In Digestion : ప్రస్తుతం మారుతున్న కాలంలో అతిగా ఆహారం తీసుకున్నా, తక్కువగా తీసకున్నా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సమయానికి అనుగుణంగా ఆహారం తీసుకోకపోయినా.. తిన్న వెంటనే వాకింగ్ చేయకుండా ఒకే దగ్గర స్థిరంగా ఉన్నా అజీర్తి సమస్యలు తీవ్రంగా వేధిస్తాయి. ప్రస్తుతం 25 ఏళ్ల పైబడిన విద్యార్థుల నుంచి జాబ్స్ చేసే వారూ సైతం అజీర్తి సమస్యలతో బాధపడుతున్నారు. గ్యాస్టిక్ సమస్య, ఆహారం జీర్ణకాకపోవడంతో నానా అవస్థలు పడుతున్నారు. గ్యాస్టిక్ ట్యాబ్లెట్స్, ఈనో వంటి ఇన్‌స్టాంట్ రిలీఫ్ మెడిసిన్‌ను వెంట తీసుకెళ్తున్నారు.
మసాలా, కల్తీ ఆయిల్ ఫుడ్స్‌తోనే సమస్య..
జీర్ణ వ్యవస్థ సరిగా లేకపోవడం వలన అజీర్తి, మలబద్దకం, అసిడిటీ, గ్యాస్, కడుపు ఉబ్బరం, గుండెల్లో మంట వంటి అనేక సమస్యలు ఎదురవుతాయని వైద్యులు చెబుతున్నారు. మన జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా ఉంటే రోగాలు దరిచేరవు. రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. అందుకోసమే మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉండేలా చూసుకోవాలి.
ఈ రోజుల్లో చాలా మంది బయట దొరికే చిరుతిండ్లు, ఆయిల్ ఫుడ్స్, మసాల ఫుడ్స్ తీసుకోవడం వలన జీర్ణ వ్యవస్థ దెబ్బతింటోందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఫలితంగా ఆస్పత్రుల పాలవుతున్నారు. పూర్వం జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచేందుకు వంటింటి చిట్కాలను ఉపయోగించేవారు. అవెంటో ఇప్పుడు తెలుసుకుందాం..
In Digescion tips
వంటింటి చిట్కాలతో అజీర్తికి చెక్..
అజీర్తి సమస్యకు పుదీనా టీతో చెక్ పెట్టవచ్చు. పుదీనా జీర్ణవ్యవస్థలోని కండరాల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్‌గా పనిచేస్తుంది. మలబద్ధకం, గ్యాస్, కడుపు నొప్పి వంటి సమస్యలను దూరం చేస్తుంది. పెరుగుతో కూడా అజీర్తికి మంచి ఔషధంలా పనిచేస్తుంది. ఇందులో ప్రోబయోటిక్స్ అధికంగా ఉంటాయి. రోజూ పెరుగు తింటే ఎముకలు కూడా గట్టిగా అవుతాయి. పాలల్లో అధికంగా కాల్షియం ఉండటం వలన హైడ్రోక్లోరిక్ యాసిడ్ స్రావాలను ఇది నియంత్రిస్తుంది. ఫలితంగా కడుపులో మంట తగ్గుతుంది.
పుచ్చకాయ కూడా చాలా అజీర్తికి మంచి విరుగుడు. దీనిలో హైడ్రేటింగ్, యాంటీ బాక్టీరియల్ లక్షణాలు, ఖనిజాలు, విటమిన్లు, కడుపు సంబంధిత సమస్యలను అధిగమించడానికి చాలా దోహదం చేస్తాయి. మనంలో చాలా మంది తిన్న వెంటనే పడుకుంటుంటారు. అలా ఎప్పుడు చేయొద్దు. తిన్న వెంటనే పడుకుంటే కేలరీలు కరిగిపోయే అయ్యే అవకాశం ఉండదు. బరువు పెరిగే ప్రమాదం ఉంటుంది. దీంతో జీర్ణ వ్యవస్థ పాడయ్యే ఆస్కారం ఉంది.