Ladyfinger Benefits : బెండకాయ కూరను అందరూ దాదాపుగా ఇష్టంగా తింటుంటారు. అయితే, బెండకాయ కూర చేసుకునే విధానంలో ఒక్కొక్కరు ఒక్కో పద్ధతి ఫాలో అవుతున్నప్పటికీ మెజారిటీగా అందరికీ బెండకాయ ఫ్రైనే ఇష్టముంటుంది. కాగా, బెండకాయ వల్ల మనిషి హెల్త్‌కు చాలా లాభాలున్నాయి. కూరగా బెండకాయను తీసుకోవడం వల్ల కలిగే లాభాలు తెలుసుకుంటే కనుక తప్పకుండా అందరూ బెండకాయను కచ్చితంగా బెండకాయను తినని వారు సైతం కచ్చితంగా తమ ఆహారంలో బెండకాయను భాగం చేసుకుంటారు.
Ladyfinger Benefits 2
బెండకాయలోని పోషక విలువలు చాలా ఉంటాయి. ఇందులోని విటమిన్ ఏ, బీ, సీ, అయోడిన్, ఫోలేట్, పిండి, పీచు పదార్థాలు హెల్త్‌కు చాలా మంచివి. బెండకాయలోని మినరల్స్ జింక్, మెగ్నిషియం, కాల్షియం కూడా అవసరమైనవి. ఇకపోతే బెండకాయ తినడం వల్ల మెదడుకు చాలా మంచిదట. బెండకాయలో మెండుగా ఉంటే పీచు పదార్థాలు, ఖనిజాలు, విటమిన్స్ మనిషికి ఉన్న అనారోగ్య సమస్యలన్నిటినీ వెంటనే దూరం చేస్తుందట.
బెండకాయ తినడం వల్ల ఆలోచనా, జ్ఞాపకశక్తి ఇంప్రూవ్ అవుతుంది. బెండకాయ కూర తింటే లెక్కలు బాగొస్తాయని పెద్దలు చెప్తుంటారు. ఇకపోతే బెండకాయలోని మ్యూకస్ అనే పదార్థం కడుపులో మంటను పోగొడుతుంది. గ్యాస్ట్రిక్, అసిడిటీ ఇతర సమస్యలు దరిచేరకుండా చేస్తుంది. బెండకాయలోని లెక్టిన్ అనే ప్రోటీన్ రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని తగ్గించేస్తుంది. బెండకాయలలోని ఫోలెట్స్ అనేక రకాల కేన్సర్లను అడ్డుకుంటాయి.
Ladyfinger Benefits
బెండకాయ గింజలను పొడి చేసి తింటే మధుమేహం ఉన్న వారికి చక్కటి ప్రయోజనాలుంటాయి. లేడీస్ ఫింగర్ తినడం వల్ల యూరినరీ ఇన్‌ఫెక్షన్స్ అస్సలే రావు. కంటి చూపు మెరుగు పడటంతో పాటు కిడ్నీ సంబంధిత సమస్యలు పరిష్కరించబడుతాయి. బెండకాయలోని విటమిన్ కె హ్యూమన్ బాడీని, బోన్స్‌ను స్ట్రాంగ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తుంది. బెండకాయలను క్రమం తప్పకుండా ఆహారంలో భాగం చేసుకుంటే కీళ్ల నొప్పులు, మూత్ర పిండ వ్యాధులు అస్సలు దరి చేరవు.
Ladyfinger Benefits 1
ఇకపోతే ఇటీవల కాలంలో రకరకాల కొత్త కొత్త జబ్బులు మనుషులకు వస్తుండటం మనం చూడొచ్చు. కాగా, బెండకాయ రసంగా లేదా డికాషిన్‌గా చేసుకుని తాగితే జ్వరం వెంటనే తగ్గుతుందట. బెండకాయను చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని నీటిలో మరగించి చల్లారక తాగితో శరీరంలోని హీట్ కంట్రోల్‌లోకి వస్తుంది. ఇకపోతే బెండ కాయ రసంలో… కూరలో కంటే ఎక్కువ పోషకాలుంటాయట. ఈ నేపథ్యంలోనే బెండకాయ రసం తీసుకుంటే హెల్త్‌కు చాలా మంచిదని అంటున్నారు వైద్య నిపుణులు. బెండకాయ రసం తీసుకోవడం వల్ల బ్లడ్‌లోని రెడ్ బ్లడ్ సెల్స్ కౌంట్ త్వరగా ఇంక్రీజ్ అవుతుందని, యాంటీ బ్యాక్టీరియల్, సెప్టిక్ గుణాలున్నటువంటి బెండకాయ రసం తీసుకోవడం వలన తీవ్రమైన గొంతు, దగ్గు ఇతర సమస్యలకు ఇట్టే చెక్ పెట్టొయొచ్చు. మొత్తంగా బెండకాయ మానవులకు ఓ మంచి ఔషధంగా పని చేస్తుంది.