Mango Peel Benefits : మనందరం మామిడి పండ్లను ఎంతో ఇష్టంగా తింటుంటాం. అలా మ్యాంగో ఫ్రూట్స్ తింటూ ఆ రుచిని ఆస్వాదించని వారు ఎవరూ ఉండబోరు అనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే, దాదాపుగా అందరూ మామిడి కాయలను మాత్రమే తిని తొక్కలను బయట పడేస్తుంటారు. కానీ, మామిడి తొక్కలతో మస్లు ప్రయోజనాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం..
మ్యాంగ్ తొక్కల్లో లిపిడ్లు, ప్రోటీన్స్, పెక్టిన్, సెల్యులోజ్, ఫైబర్, హెమిస్యొలోజ్ అత్యధికంగా ఉంటాయి. వీటితో పాటు రాగి, పొటాషియం, మాంగనీస్, జింక్, ఇనుము, సెలీనియం మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి. ఇవన్నీ కూడా హ్యూమన్ హెల్త్‌కు చాలా అవసరమైనవి. చిన్నా పెద్దా అని తేడా లేకుండా అందరూ తినేటువంటి మామిడి పండ్లతో చాలా ప్రయోజనాలున్నాయి.
మామిడి తొక్కలో ఉండేటువంటి విటమిన్ ఈ, సి, ఎంజైమ్స్, పాలీఫినాల్స్, కెరోటినాయిడ్స్ చాలా ముఖ్యమైనవి. ఇవి బ్యూటీ ప్రొడక్ట్‌గా ఉపయోగపడతాయి. మహిళలను అందంగా ఉంచేందుకు ఈ పోషకాల సమ్మేళనం ఉపయోగపడుతుంది. మహిళల బ్యూటినెస్‌ను మరింతగా పెంచేందుకుగాను ఇవి చాలా ఉపయోగపడతాయి. ఇందుకుగాను మామిడి తొక్కలను తీసుకుని మీరు ఒక పేస్టులాగా మార్చుకోవాలి. ఆ తర్వాత ముఖానికి అప్లై చేసుకుని ఆరేంత వరకు అలానే ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత ముఖం కడుక్కున్నట్లయితే ముడతలు తొలగిపోతాయి.
mango peel snip
అందాన్ని మరింత పెంచడానికి మ్యాంగో పీల్స్ బాగా ఉపయోగపడతాయి. చాలా మంది మామిడి తొక్కలతో ఉన్నటువంటి ఈ ఉపయోగాల గురించి తెలియక బయట పడేస్తుంటారు. కానీ, అలా చేయొద్దు. వాటిని ఫేస్ ప్యాక్‌గా మార్చుకుని మీరు ఉపయోగించుకోవచ్చు. అందుకుగాను ముందర మీరు మామిడి తొక్కలను ఎండలో ఎండబెట్టాలి. తర్వాత వాటిని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత ఆ మిశ్రమానికి కొద్ది రోజ్ వాటర్ కాని కర్డ్ కాని బాగా కలపాలి. అలా కలిపిన తర్వాత మిశ్రమాన్ని ఫేస్‌కు అప్లై చేయాలి. అలా రెగ్యులర్‌గా చేస్తే కనుక డార్క్ స్పాట్స్ తగ్గిపోతాయి.
మామిడి తొక్క పిండిని బ్రెడ్, స్పాంజ్ కేకు, బిస్కెట్స్, నూడుల్స్ ఇతర బేకరీ ప్రొడక్ట్స్ మేకింగ్‌లో ఉపయోగిస్తుంటారు. అందాన్ని రెట్టింపు చేయడంలో మ్యాంగో పీల్స్ కీలక పాత్ర పోషిస్తాయి. మ్యాంగో పీల్స్‌లో ఉండేటువంటి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్ మృత కణాలను తొలగించి స్కిన్ షైనింగ్ బాగా పెంచుతాయి. ఫేస్ ట్యాన్ కాకుండా ఉండటానికీ మామిడి తొక్కలు సాయపడతాయి. మామిడి తొక్కలను ముఖం మీద రాసి దానితో మసాజ్ చేసుకున్నట్లయితే ముఖం అందంగా తయారవుతుంది. మొటిమలు కూడా తొలగిపోతాయి.