Health Tips : స్నానం ఎక్కువుగా చేస్తే ఇన్ని అనారోగ్యాలు చుట్టు ముడతాయా..?

Health Tips : ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది.. ఇది శరీరం లోని సహజ నూనెను తొలగిస్తుంది...

By: jyothi

Updated On - Sun - 8 January 23

Health Tips : స్నానం ఎక్కువుగా చేస్తే ఇన్ని అనారోగ్యాలు చుట్టు ముడతాయా..?

Health Tips  : సాధారణంగా ఇండియాలో ప్రజలు అత్యధికంగా స్నానాలు చేస్తారని అంచనా.. ఈ స్నానాలు మత విశ్వాసం కారణంగా ఇలా రెండు పూటలా స్నానం చేయడం అలవాటు.. ఒకపూట స్నానం చేయకపోతే ఎలా ఫీలింగ్ ఉంటుందో తెలిసిందే.. స్నానం అనేది శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి మాత్రమే కాదు.. ప్రతీ రోజు స్నానం చేయడం వల్ల మనసుకు ప్రశాంతంగా కూడా ఉంటుంది..

అయితే మీరు ప్రతీ రోజు తలస్నానం చేస్తే అది మీకు హాని చేస్తుంది అని మీ రోగనిరోధక శక్తిని బలహీన పరుస్తుందని సైన్స్ చెబుతోంది. చలికాలంలో తలస్నానం చేస్తే ఆరోగ్యం దెబ్బతింటుంది అని అధికంగా స్నానం చేయడం వల్ల మన ఆరోగ్యానికి, చర్మానికి హాని కలుగుతుందట..

మేలు కంటే చెడు ఎక్కువ..

ప్రతీ ఒక్కరికి వేసవిలో రోజుకు రెండుసార్లు స్నానం చేయడానికి ఇష్టపడతారు.. అయితే చలికాలంలో స్నానం చేయడం మాత్రం పెద్ద టాస్క్ అనే చెప్పాలి. వేడి నీళ్లతో స్నానం చేయడం కూడా హానికరమే అట.. చలికాలంలో వేడి నీళ్లలో ఎక్కువ సేపు స్నానం చేయడం వల్ల మీకు జరిగే మేలు కంటే చెడు ఎక్కువ అని చెబుతున్నారు.

ఎక్కువగా తలస్నానం చేయడం వల్ల చర్మం పొడిబారుతుంది.. ఇది శరీరం లోని సహజ నూనెను తొలగిస్తుంది.. శరీరం లోని సహజ నూనె అందరికి ఎంత ముఖ్యమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. ఇది మనకు రోగనిరోధక శక్తిగా కూడా పని చేస్తుంది.. ఈ నూనె మిమ్మల్ని తేమగా ఉంచుతుంది. గాలి నుండి వచ్చే ఇన్ఫెక్షన్ల నుండి మిమ్మల్ని రక్షిస్తుంది. మరి అతిగా స్నానం చేయడం వల్ల మానవ శరీరం రోగనిరోధక వ్యవస్థను ప్రభావితం చేస్తుంది.. అలాగే మీ గోర్లు కూడా దెబ్బతింటాయి..

 

Read Also : Senior Naresh : సీనియర్‌ నరేశ్‌ ఆస్తుల విలువ ఎంతో తెలుసా.. స్టార్ హీరోలు కూడా పనికి రారు..!

Read Also : Ashu Reddy : బిగ్ బాస్‌ అషురెడ్డి పెండ్లి పీటలు ఎక్కుతుందోచ్.. పెండ్లి కొడుకు ఎవరంటే..?

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News