• Telugu News
  • health

Oxygen: దేశంలో ఆక్సీజన్ ఓకే.. దేహంలోని ఆక్సీజన్ సంగతేంటి?..

Oxygen: ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆక్సీజన్ గురించే చర్చ జరుగుతోంది. భారత్ లో ప్రాణవాయువుకి భారీ కొరత ఏర్పడిందని, దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా కొంత మందికి అది అందక చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి కాస్త పక్కన పెడితే మరో అంశం పైన కూడా గతేడాది నుంచి మాట్లాడుకుంటున్నారు. అదే ‘పల్స్ ఆక్సీ మీటర్’. ఈ పరికరం మన బాడీ(రక్తం)లో ఆక్సీజన్ స్థాయి […].

By: jyothi

Updated On - Mon - 26 April 21

Oxygen: దేశంలో ఆక్సీజన్ ఓకే.. దేహంలోని ఆక్సీజన్ సంగతేంటి?..

Oxygen: ఇప్పుడు మన దేశంలో ఎక్కడ చూసినా, ఎక్కడ విన్నా ఆక్సీజన్ గురించే చర్చ జరుగుతోంది. భారత్ లో ప్రాణవాయువుకి భారీ కొరత ఏర్పడిందని, దీంతో విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారని చెబుతున్నారు. అయినప్పటికీ ఇంకా కొంత మందికి అది అందక చనిపోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఆ సంగతి కాస్త పక్కన పెడితే మరో అంశం పైన కూడా గతేడాది నుంచి మాట్లాడుకుంటున్నారు. అదే ‘పల్స్ ఆక్సీ మీటర్’. ఈ పరికరం మన బాడీ(రక్తం)లో ఆక్సీజన్ స్థాయి ఎంత ఉందో చెబుతుంది. మన శరీరంలో ఆక్సీజన్ లెవల్ 92 కన్నా తక్కువ ఉంటే డాక్టర్ ని సంప్రదించాలి.

అప్పుడలా.. ఇప్పుడిలా..

ఒకప్పుడు ఈ పరికరం డాక్టర్ల దగ్గర, హాస్పిటల్స్ లోనే ఉండేది. గతేడాది కొవిడ్-19 ఫస్ట్ వేవ్ వల్ల అందరూ కొనుక్కొని ఇంట్లో పెట్టుకోవాలని వైద్యులు సూచించారు. కరోనా వైరస్ సోకినవారికి ఎక్కువ శాతం శ్వాస సమస్యలు తలెత్తుతాయనే సంగతి తెలిసిందే. శరీరంలోని ఆక్సీజన్ స్థాయిలను సరిగా గుర్తించకపోవటం వల్ల ఆందోళనతో చనిపోతున్నారు. ఇలాంటి ప్రమాదాలను తప్పించటంలో ఈ పల్స్ ఆక్సీ మీటర్లు బాగా ఉపకరిస్తాయి. కొవిడ్-19 స్టార్టింగ్ స్టేజ్ లో రక్తంలో ఆక్సీజన్ శాతం తగ్గుతుంది. దీన్నే హైపోఆక్సీమియా అంటారు. ఇప్పుడు కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో మళ్లీ ఈ హైపోఆక్సీమియా ఇబ్బంది వచ్చిందా లేదా అనేదాన్ని పల్స్ ఆక్సీ మీటర్ సాయంతో గుర్తించొచ్చు.

ఎలా వాడాలి?..

పల్స్ ఆక్సీ మీటర్ ని ఎలా వాడాలో కేంద్ర ఆరోగ్య శాఖ చెప్పింది. ఈ మేరకు కొన్ని గైడ్ లైన్స్ ని విడుదల చేసింది. వాటి ప్రకారం.. పల్స్ ఆక్సీ మీటర్ ని చేతి వేళ్లకి పెట్టుకుంటాం కాబట్టి ఆ వేళ్ల గోళ్లకి రంగు లేకుండా చూసుకోవాలి. చేతులు చల్లగా ఉండే కాస్త వేడి చేసుకోవాలి. 5 నిమిషాలు రెస్ట్ తీసుకొని, తర్వాత చేతిని ఛాతీ లెవల్ కి తేవాలి. అప్పుడు ఆ పరికరాన్ని మధ్య వేలికి గానీ చూపుడు వేలికి గానీ పెట్టి ఆన్ చేయాలి. అనంతరం కనీసం నిమిషం సేపు అలా ఉంచాలి. 5 సెకన్ల పాటు రీడింగ్ లో తేడా లేకపోతే దాన్నే రికార్డు చేయాలి. అలా రోజులో 3 సార్లు చేయాలి. రోజూ ఒకే సమయంలో రీడింగ్ తీసుకోవాలి. ఊపిరి ఆడటం ఇబ్బందిగా ఉన్నా, మాట సరిగా రాకపోయినా, ప్రాణవాయువు 92 శాతం కన్నా తక్కువ ఉన్నా అలర్ట్ కావాలి. హెల్ప్ లైన్ నంబర్ 1075కి ఫోన్ చేయాలి. లేదా డాక్టర్ ని కలవాలి.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News