Pomelo Fruit : పంపర పనసతో ఎముకలు బలంగా అవుతాయట…

Pomelo Fruit : ప్రకృతిలో లభించే ప్రతీ ఒక్క ఫ్రూట్‌ను అందరూ ఆస్వాదించాలని, వాటిని తప్పకుండా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చలికాలంలో సీజన్‌లో దొరికే పంపర పనస పండ్ల వల్ల మానవాళి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం. పంపర పనసలో ఉండేటువంటి ఔషధ గుణాలు మనిషి ఆరోగ్యానికి బాగా కావలసినవి. నిమ్మజాతికి చెందిన ఈ పంపర పనసలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. కరోనా మహమ్మారి […].

By: jyothi

Updated On - Thu - 25 November 21

Pomelo Fruit : పంపర పనసతో ఎముకలు బలంగా అవుతాయట…

Pomelo Fruit : ప్రకృతిలో లభించే ప్రతీ ఒక్క ఫ్రూట్‌ను అందరూ ఆస్వాదించాలని, వాటిని తప్పకుండా తమ ఆహారంలో భాగం చేసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఈ చలికాలంలో సీజన్‌లో దొరికే పంపర పనస పండ్ల వల్ల మానవాళి ఆరోగ్యానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.


pomelo fruit

pomelo fruit



పంపర పనసలో ఉండేటువంటి ఔషధ గుణాలు మనిషి ఆరోగ్యానికి బాగా కావలసినవి. నిమ్మజాతికి చెందిన ఈ పంపర పనసలో విటమిన్ సీ సమృద్ధిగా ఉంటుంది. కరోనా మహమ్మారి కాలంలో చాలా మంది విటమిన్ సీ ఫ్రూట్స్ కోసం ఎగబడిన సంగతి మనం చూడొచ్చు. కాగా, విటమిన్ సీతో పాటు ఇతర ఔషధ గుణాలు ఉన్నటువంటి పంపర పనసను తప్పకుండా ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు.


pomelo fruit

pomelo fruit



షుగర్ వ్యాధిగ్రస్తులకు పంపర పనస దివ్య ఔషధంగా పని చేస్తుంది. ఈ పండు టేస్ట్ ఇతర పండ్ల టేస్ట్ కంటే కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. స్వీట్, వగరు, పులుపు రుచుల కాంబినేషన్‌లో వీటి టెస్ట్ ఉంటుంది. పంపర పనస గింజలు దానిమ్మ గింజల మాదిరిగానే ఉంటాయి. పంపర పనసలో ఉండేటువంటి ఔషధాలు డైజేషన్ సిస్టమ్‌ను స్ట్రాంగ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. ఈ పండు కేన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధులు రాకుండా అడ్డుకుంటుంది.


pomelo fruit

pomelo fruit



ఇకపోతే ఎముకలను బలంగా ఉంచేందుకుగాను ఈ ఫ్రూట్‌లోని పోషకాలు సాయపడతాయి. ఈ ఫ్రూట్ బోలు ఎముకల వ్యాధి నుంచి రక్షణనిస్తుంది. ఉమెన్స్‌కు ఈ ఫ్రూట్ వల్ల చాలా మేలు జరుగుతుంది. వెయిట్ లాస్ కావడానికి, లివర్ ఇష్యూస్ సాల్వ్ చేసేందుకుగాను ఇందులోని పోషకాలు సాయపడతాయి. హ్యూమన్ బాడీ అంతటా బ్లడ్ సర్కులేట్ కావడానికి పంపర పనస సాయపడుతుంది. పంపర పనసలో ఉండే పోషకాలు హార్ట్ డిసీజెస్ రాకుండా అడ్డుకోవడంతో పాటు మనుషు ఆరోగ్యాన్ని రక్షించే ఔషధంగా పని చేస్తాయి. స్కిన్‌కు మరింత షైనింగ్ ఈ పండు ద్వారా లభిస్తుంది. వృద్ధాప్య చాయలు రాకుండా పంపర పనస సాయం చేస్తుంది.


pomelo fruit

pomelo fruit



పులుపు, వగరు కాంబినేషన్ టేస్ట్ ఉన్నటువంటి పంపర పనస తినడానికి చాలా మంది భయపడుతుంటారు. టేస్ట్ డిఫరెంట్‌గా ఉంటుందని అనుకుంటారు. కానీ, ఒకసారి ఈ ఫ్రూట్‌ను టేస్ట్ చేస్తే కనుక
మళ్లీ మళ్లీ ఈ ఫ్రూట్‌ను తీసుకుంటూనే ఉంటారని పెద్దలు చెప్తున్నారు. ఎముకల్లో శక్తిని పెంచడంతో పాటు వాటని బలంగా ఉంచేందుకుగాను పంపర పనస చక్కగా పని చేస్తుందని నిపుణులు వివరిస్తున్నారు. మహిళలు ఈ పంపర పనసను తప్పక తీసుకోవాలని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ సూచిస్తున్నారు. ఈ పండును పండులాగానే కాకుండా సలాడ్‌గా తీసుకున్నా చక్కటి ప్రయోజనాలుంటాయని పేర్కొంటున్నారు.

Tags

Latest News

Related News