Potato Juice : అన్ని కాలాలలో లభించే కూరగాయల్లో ఒకటి బంగాళదుంప. దీనిని ఉర్లగడ్డ అని కొందరు, ఆలుగడ్డ అని మరికొందరు పిలులస్తుంటారు. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అయితే దాదాపుగా ఆలుగడ్డ అని ప్రజలు పిలుస్తుంటారు. ఇకపోతే ఆలుగడ్డ వల్ల మనిషి ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలున్నాయి. ఈ ఆలుగడ్డలను కూరగానే కాకుండా రకరకాల పదార్థాల్లో వేసుకుని మరీ తీసుకుంటుంటారు.
ఇతర కూరగాయలతో కలిపి ఆలుగడ్డను కూరగా వండుకుంటుంటారు. సమోసాతో పాటు ఇతర ఫుడ్ ఐటమ్స్‌లోనూ ఆలుగడ్డలను వాడుతుంటారు. ఆలుగడ్డ చిప్స్ కూడా చేస్తుంటారు. చాలా మంది వీటిని ఎంతో ఇష్టంగా తింటుండటం మనం చూడొచ్చు. ఈ క్రమంలోనే బంగాళ దుంప జ్యూస్‌తో మనిషి ఆరోగ్యానికి కలిగే లాభాల గురించి తెలుసుకుందాం.
ఆలుగడ్డను దాదాపుగా అందరూ అత్యంత ఇష్టంగా తింటుంటారు. అయితే, కొందరు మాత్రం ఆలుగడ్డ పట్ల సహజమైన వ్యతిరేకత కనబరుస్తుంటారు. కానీ, ఆలుగడ్డ వల్ల ఆరోగ్యానికి చక్కటి ప్రయోజనాలున్నాయి. ఆలుగడ్డలోని ఆల్ విటమిన్స్ ప్లస్ మినరల్స్ హెల్త్‌కు బాగా కావలిసినవి. ఆలుగడ్డను జ్యూస్‌గా చేసుకుని తాగితే కనుక చర్మ సంబంధిత సమస్యలన్నీ కూడా ఇట్టే పరిష్కరమవుతాయి. ఆలుగడ్డలోని ఉండేటువంటి విటమిన్స్ బీ, సీ, కాల్షియం, పొటాషియం, ఐరన్, పాస్ఫరస్, కాపర్ అన్ని కూడా ఆరోగ్యానికి బాగా కావల్సినవి.
Potato juice
హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో ఆలుగడ్డ జ్యూస్ బాగా సాయపడుతుంది. ఆలుగడ్డలో ఉండేటువంటి విటమిన్ సి స్కిన్ డిసీజెస్ నివారించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. జలబు, ఇతర ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకుగాను ఆలుగడ్డలోని పోషకాలు అడ్డుకుంటాయి. ప్రతీ రోజు పరగడుపున ఆలుగడ్డ రసం తీసుకున్నట్లయితే ఆర్థటైటిస్, కీళ్ల సంబంధిత సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ చెప్తున్నారు. ఇకపోతే బాడీపైన ఏదేని ప్రదేశంలో నొప్పి ఉన్నట్లయితే అక్కడ బంగాళ దుంప ముక్కతో రుద్దినట్లయితే నొప్పి ఇట్టే తగ్గిపోతుందట.
ఆలుగడ్డ రసం అల్సర్‌ను తగ్గించడంలోనూ కీలక పాత్ర పోషిస్తుంది. పిత్తాశయం, కాలేయాన్ని క్లీన్ చేసే డిటాక్స్ డ్రింక్‌గా పొటాటో జ్యూస్ పని చేస్తుంది. హైపటైటిస్ ట్రీట్‌మెంట్ చేసేందుకుగాను జపాన్ దేశంలో బంగాళదుంప రసాన్ని ఉపయోగిస్తారు. అంతటి ఔషధగుణాలు ఉన్నటువంటి ఆలుగడ్డ రసాన్ని తప్పకుండా ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలి. ఆలుగడ్డలో ఉండేటువంటి ఫైబర్ హ్యూమన్ బాడీ కొలెస్ట్రాల్ లెవల్స్ కంట్రోల్ చేయడంలోనూ కీ రోల్ ప్లే చేస్తాయి. కేన్సర్ కణాల పెరుగుదలను నియంత్రించి.. అత్యద్భుతమైన ఔషధంగా ఆలుగడ్డ జ్యూస్ పని చేస్తుంది.