Potato Peel : బంగాళదుంపు తొక్కలతో గుండె ఆరోగ్యం పదిలం..

Potato Peel : మనలో చాలా మంది ఆలుగడ్డ లేదా బంగాళ దుంపల కూరను అత్యంత ఇష్టంగా తింటుంటాం. ఆలుగడ్డతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఆలుగడ్డలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. అయితే, అందరూ దాదాపుగా ఆలుగడ్డలను కూర చేసుకునే క్రమంలో పొట్టు తీసేసి బయటపడేస్తుంటారు. కానీ, ఆలుగడ్డ తొక్కలతోనూ బోలెడు ప్రయోజనాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం. బంగాళదుంప తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి3, ఐరన్, ఫైబర్, […].

By: jyothi

Published Date - Sat - 20 November 21

Potato Peel : బంగాళదుంపు తొక్కలతో గుండె ఆరోగ్యం పదిలం..

Potato Peel : మనలో చాలా మంది ఆలుగడ్డ లేదా బంగాళ దుంపల కూరను అత్యంత ఇష్టంగా తింటుంటాం. ఆలుగడ్డతో ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయన్న సంగతి అందరికీ విదితమే. ఇకపోతే ఆలుగడ్డలు శరీరంలోని బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను కంట్రోల్ చేస్తాయి. అయితే, అందరూ దాదాపుగా ఆలుగడ్డలను కూర చేసుకునే క్రమంలో పొట్టు తీసేసి బయటపడేస్తుంటారు. కానీ, ఆలుగడ్డ తొక్కలతోనూ బోలెడు ప్రయోజనాలున్నాయట. అవేంటో తెలుసుకుందాం.

బంగాళదుంప తొక్కలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇందులో విటమిన్ బి3, ఐరన్, ఫైబర్, పోషకాలు అధికంగా ఉంటాయి. ఈ ఆలుగడ్డ తొక్కలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ సి హెల్త్‌కు చాలా కావాల్సినవి. హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో బంగాళ దుంప తొక్కలు కీలక పాత్ర పోషిస్తాయి. కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో చాలా మంది రోగ నిరోధక శక్తి కోసం రకరకాల ఆహార పదార్థాలు తీసుకుంటున్నారు. కాగా, ఆలుగడ్డ తొక్కలను కూడా ఆహారంగా తీసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయి.

ఈ క్రమంలోనే ఆలుగడ్డలే కాదు పొట్టు కూడా ఆహారంలో భాగం చేసుకుంటే కనుక మంచి ఉపయోగాలుంటాయని పెద్దలు చెప్తున్నారు. ఆలుగడ్డ పొట్టులో ఉండేటువంటి విటమిన్ బి కాంప్లెక్స్, క్యాల్షియం మినరల్ హ్యూమన్ హెల్త్‌ను కాపాడటంతో పాటు కేన్సర్ బారిన పడకుండా చూస్తాయి. ఇకపోతే ఆలు తొక్కలలో ఉండేటువంటి ఫైటోకెమికల్స్ మనకు కావల్సినవే. హ్యూమన్ బాడీకి కావల్సిన క్లోరోజెనిక్ యాసిడ్ సమృద్ధిగా ఆలుగడ్డ పొట్టులో ఉంటుంది. హ్యూమన్ బాడీని కేన్సర్ నుంచి కాపాడటంలో ఆలుగడ్డ తొక్కలే కీలక పాత్ర పోషిస్తాయి. కాబట్టి తొక్కలే కదా అని తీసేయకుండా వాటిని కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి.

potato peeel

potato peeel

ఆలు తొక్కల వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇటీవల కాలంలో చాలా మంది హార్ట్ డిసీజెస్ బారిన పడి అతి తక్కువ ఏజ్‌లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలోనే వారు ఆలుగడ్డల తొక్కలను తీసుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయి. కొలెస్ట్రాల్ సమస్యలున్న వారికి ఆలుగడ్డల తొక్కలు చక్కగా పని చేస్తాయి. ఆలుగడ్డ తొక్కలలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ బ్లడ్‌లోని కొలెస్ట్రాల్ లెవర్స్ కంట్రోల్ చేస్తాయి. దాంతో పాటు హార్ట్‌ను హెల్దీగా ఉంచుతాయి.

potato peeell1

potato peeell1

ఇందుకుగాను మీరు బంగాళ దుంప తొక్కలను చక్కగా ఉడికించి తీసుకోవాలి. ఇందులో ఉండేటువంటి మినరల్స్ కాల్షియం, పొటాషియం, మెగ్నిషియం బ్లడ్ ప్రెషర్‌ను కంట్రోల్‌లో ఉంచుతాయి. బంగాళ దుంప తొక్కలు హ్యూమన్ బోన్స్‌నూ స్ట్రాంగ్ చేస్తాయి. బంగాళ దుంప తొక్కలలో ఉండేటువంటి మినరల్స్ హ్యూమన్ హెల్త్ ప్లస్ బోన్స్‌ను స్ట్రాంగ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి.

Tags

Latest News

Related News