Pregnancy.. మహిళలు మామూలు సమయాల్లో కంటే గర్భ సమయంలో జాగ్రత్తగా ఉండాలి. అందులోనూ ఉద్యోగం చేసే మహిళలైతే మరింత జాగ్రత్త అవసరం. ఆ సమయంలో ఉద్యోగం చేయటం అంత సులభం కాదు. శరీరంలో వచ్చే మార్పులు వస్తుంటాయి. వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి.. ఎలా హెల్దీగా ఉండాలో తెలుసుకోండి. ప్రెగ్నెన్సీలో బిజీబిజీగా ఉండే ఆచారం చాలా ఏళ్ల నాటిది. కానీ ఇప్పుడు గర్భం అనేది గ్లామరైజ్డ్ స్ట్రెస్‌గా మారిపోయింది. ప్రసవ సమయంలో అనేక సమస్యలు రావడానికి ఇదే కారణం.
వికారం తెప్పించే పదార్థాలకి దూరంగా ఉండండి..
ఈ సమయంలో మహిళలకు చాలా ఇష్టమైన పదార్థాలపైనా కూడా ఒక్కోసారి వికారం పుట్టొచ్చు. వాటిని ఇంతకుముందు ఎంతో ఇష్టంగా తీసుకున్నా.. ఇప్పుడు వాటిపై వికారంగా ఉంటుంది. ఇలాంటి సమయంలో చిరుతిళ్లు తినండి. క్రాకర్ బిస్కెట్లు ఇంకా ఇతర మెత్తని ఆహారం తినటం గర్భిణీలకు చాలా మంచిది. ఆఫీసులో సులభంగా తినటానికి చిరుతిళ్ళను ముందు నుంచే ప్రిపేర్ చేసుకోని ఉంచుకోండి. గర్భిణీలకు వికారాన్ని తగ్గించేందుకు అల్లం టీ బాగా ఉపయోగపడుతుంది. నిపుణుల సూచన ప్రకారం వ్యాయామం, యోగా చేస్తే, దాని వల్ల బలహీనమైన కటి వలయం బలంగా మారుతుంది.
గర్భధారణ సమయంలో హార్మోన్లలో మార్పులు మానసిక ఆరోగ్యాన్ని కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో స్త్రీలందరూ చిరాకుగా ఉంటారు. వారు చాలా ఒత్తిడి, చికాకు కలిగి ఉంటారు. కానీ శారీరకంగా చురుగ్గా ఉండటం వల్ల మనసు ఆ విధమైన భావనల నుంచి మళ్లుతుంది. దీని వల్ల ఇలాంటి సమస్యలన్నీ అదుపులో ఉంటాయి.
Pregnancy-2
సరైన నిద్ర
గర్భిణీలకు విశ్రాంతి ఎక్కువ అవసరం. మామూలు సమయాల్లో 8 గంటలు నిద్రపోతే.. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు కనీసం 10గంటల పాటు నిద్ర ముఖ్యమని తెలుసుకోండి. అయితే, ఈ సమయంలో పడుకునే విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోండి. ఎడమవైపుకి తిరిగి పడుకోటం వల్ల బేబీకి ఎక్కువగా రక్తప్రసరణ జరిగి, వాపులకి ఉపశమనం లభిస్తుంది. ఇంకా సౌకర్యంగా ఉండటానికి పొట్ట కింద అలాగే కాళ్ల మధ్యన దిండ్లు పెట్టుకుంటే బరువు అంతగా అన్పించదు.
గర్భిణీ రోజు వారి కార్యకలాపాల ప్రభావం ఆమెకు పుట్టబోయే బిడ్డపై కూడా ప్రభావితం చేస్తాయి. ఈ సమయంలో మహిళలు చురుకుగా ఉంటే వారి పిల్లలను ఆరోగ్యంగా, ఫిట్‌గా, చురుకుగా ఉంచుతాయి. గర్భిణీగా ఉన్నప్పుడు ఆరోగ్యంగా ఉన్న స్త్రీలు ఆరోగ్యవంతమైన పిల్లలకు జన్మనిస్తారని నిపుణులు అంటారు. వైద్యుల సలహాల మేరకు పై సూచనలు పాటించండి.. ఆరోగ్యంగా ఉండండి.