Anise After a Meal: ఫైవ్ స్టార్ హోటల్స్ నుండి కాకా బోజనం హోటల్ వరకు ఎక్కడ భోజనం చేసినా కూడా చివర్లో సోంపు ఇవ్వడం చాలా కామన్ విషయం. స్టార్ హోటల్ లో స్వీట్ సోంపు ఇస్తూ ఉంటారు. కాకా హోటల్ లో మాత్రం జిలకర మాదిరిగా ఉండే సోంపు ఇస్తూ ఉంటారు. సోంపు ఏదైనా ఒకటే. స్టార్ హోటల్ లో ఇచ్చేది తిన్నా కాకా హోటల్ సోంపు తిన్నా కూడా మంచి ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయంటూ నిపుణులు అంటున్నారు. భోజనం తిన్న తర్వాత సోంపు తిన్నంత మాత్రాన నిజంగానే ప్రయోజనం ఉంటుందా అనే అనుమానంను కొందరు కలిగి ఉంటారు. వారి అనుమానాలను నివృత్తి చేసేందుకు ఈ వీడియోను పూర్తిగా చూడండి. సోంపు గురించిమ మొదట చెప్పాలంటే.. యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో రకాల ప్రయోజనాలు సోంపు గింజల్లో ఉంటాయి. సోంపు గింజల్లో మాంగనీసు, ఐరన్ ఫైబర్ లు మరియు విటమిన్ లు పుష్కలంగా ఉంటాయి. వాటి వల్లే సోంపు అనేక సమస్యల నుండి దూరం చేస్తుంది అంటూ నిపుణులు చెబుతున్నారు. శరీరం యొక్క మెటబాలిజం ను కాపాడేందుకు సోంపు గింజలు ప్రముఖంగా పని చేస్తాయి. ఇక శరీరంలోని జీర్ణ క్రియ పై ఈ సోంపు అధికంగా పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
సోంపు వల్ల షుగర్ లెవల్స్ కంట్రోల్ అవ్వడం నుండి మొదలుకుని శరీంపై ఉన్న అతి పెద్ద గాయాలు త్వరగా నయం అయ్యే వరకు పలు ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. సోంపు ను ప్రతి రోజు కనీసం ఒక టీ స్ఫూన్ తీసుకునా దీర్ఘ కాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత ప్రయోజనకారి అయిన సోంపును ప్రతి చోట పెట్టడంకు ప్రధాన కారణం జీర్ణం అయ్యేందుకు ఎక్కువ సమయం పట్టే ఆహారం తీసుకున్న సమయంలో జీర్ణ వ్యవస్థను ప్రభావితం చేసే లా సోంపు పని చేస్తుంది. అందుకే ప్రతి హోటల్ లో కూడా సోంపు పెడుతూ ఉంటారట. సోంపులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లతో పాటు ముఖ్యమైన సమ్మేళనాలు జీర్ణ వ్యవస్థపై ప్రభావం చూపిస్తూ ఉందని నిపుణులు చెబుతున్నారు. జీర్ణ వ్యవస్థలో ఉండే కొన్ని లోపాలను ఇది సరి చేయడం మాత్రమే కాకుండా అజీర్తి సమస్యను శాస్వతంగా పరిష్కరించడంలో తోడ్పడుతుంది. మల బద్దకం ఇంకా జీర్ణ వ్యవస్థకు సంబంధించిన విషయాల్లో సోంపు చేసే ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అందుకే హోటల్ లో అనే కాకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా సోంపు ఉండటం మంచిది అంటూ నిపుణులు చెబుతున్నారు.
చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరికి అయినా కడుపు నొప్పి లేస్తే వారు ఒక టీ స్పూన్ లేదా రెండు టీ ష్పూన్ ల సోంపును తినడం వల్ల 20 నుండి 30 నిమిషాల్లో సమస్య పరిష్కారం అవుతుంది. అజీర్తి సమస్యకు ఇది అత్యంత ప్రభావంతమైన సుగంధ ద్రవ్యంగా దీన్ని చెబుతూ ఉంటారు. సోంపు ను రెగ్యులర్ గా తినే వారిలో గుండె సమస్యలు రావడం చాలా అరుదుగా జరుగుతుంది. సోంపు గింజలను అత్యధికంగా తిన్న వారిలో అజీర్ణి సమస్యలతో పాటు పలు దీర్ఘ కాలిక సమస్యలు కూడా తొలగి పోతాయని అంటున్నారు. మనకు తెలిసి తిన్న అన్నం జీర్ణం అవ్వడం కోసమే సోంపు వాడుతాము. కాని గుండె సమస్య నుండి మొదలుకుని పాలిచ్చే తల్లులకు ఎనర్జీ బూస్టింగ్ వరకు అన్ని విధాలుగా ఈ సోంపు పని చేస్తుంది. అందుకే హోటల్ కు వెళ్లినప్పుడు మాత్రమే కాకుండా ఇంట్లో ఉన్న సమయంలో కూడా సోంపును తినడం అనేది చాలా మంచిది. ఆకు పచ్చని సోంపు అయితేనే అత్యంత పోషకాలు మరియు ఔషద గుణాలు ఉంటాయి. కనుక మార్కెట్ లో సోంపు కొనుగోలు చేసే సమయంలో కాస్త చూసి తీసుకుంటే మరింత బాగా ఉంటుందని నిపుణులు సలహా ఇస్తున్నారు