Regular Menstruation: పీరియడ్స్… దీనినే తెలుగులో రుతుస్రావం.. నెలసరి… ఇంగ్లీషులో అయితే మెన్సెస్, డేట్ అని పిలుస్తారు. దీనికి ఇలా చాలా పేర్లు వాడుకలో ఉన్నాయి. అయితే ఇది ఆరోగ్యవంతమైన మహిళల్లో నిరంతరం ప్రక్రియగా ఉంటుంది. చిన్న పిల్లలుగా ఉన్న అమ్మాయిలు పెళ్లీడుకు వచ్చారు అని తెలిసేది కూడా దీనితోనే. ప్రతీనెలలో 5రోజుల పాటు స్త్రీలకు ఈ బహిష్టు కాలం అనేది ఉంటుంది. ఈ సమయంలో మహిళలు కొంత ఇబ్బందికి గురవుతారు. ఆ ఐదు రోజులు వారికి నరకం ఉన్నట్టు ఉంటుంది. ఎక్కడ లేని నొప్పి వారికి కలుగుతుంది. పొత్తి కడుపులో వచ్చే ఈ నొప్పితో వారు చెప్పలేని బాధ అనుభవిస్తారు. అందుకే ఆ రోజుల్లో చికాకుగా ఉంటారు. చిన్న దానికి పెద్ద దానికి కోపం కూడా అందుకే వస్తుంది. అయితే ఇంత బాధను అనుభవిస్తూ కూడా మహిళలు దీనిని భరిస్తారు. అంతేకాకుండా ఓ నెల ఈ ప్రక్రియ ఆలస్యమైనా, అసలు రాకపోయినా చాలా కంగారు పడుతుంటారు.
నెల నెల పీరియడ్స్ పక్కాగా రావడం లేదు అంటే ఆ మహిళల్లో ఏదో ఇబ్బంది ఉన్నది స్పష్టంగా అర్థం అవుతుంది. ఇంత బాధను అనుభవిస్తూ కూడా వారు దీనిని వద్దు అనుకోరు. క్రమం తప్పింది అని తెలిస్తే మాత్రం వెంటనే గైనకాలజిస్టు దగ్గరకు వెళ్తారు. ఇందుకు గల కారణాలను అడిగి తెలుసుకుంటారు. డాక్టర్ సూచించిన విధంగా మందులు వేసుకుంటారు. అయితే ఇంతకంటే ముందు కొన్ని వంటింటి చిట్కాలును ట్రై చేయడం ద్వారా కూడా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందని పెద్దలు చెప్తున్నారు. అవి ఏంటో వాటిని ఎలా ఫాలో అవ్వలో తెలుసుకుందాం.
మనం రోజువారిగా ఉపయోగించే అల్లం పీరియడ్స్ క్రమం తప్పకుండా రావడానికి ఉపయోగపడుతుందని నిపుణులు చెప్తున్నారు. ఆ రోజుల్లో తట్టుకోలేని నొప్పి వచ్చినప్పుడు అల్లం టీ తీసుకుంటే కొంత ఉపశమనం కలుగుతుందని అంటున్నారు. ఇందుకే అల్లంను ట్రై చేయాలని సూచిస్తున్నారు. రెగ్యులర్ గా పీరియడ్స్ రాని వారు మనం వంటల్లో వాడే జీలకర్రను తగిన మోతాదులో తీసుకోవడం వల్ల ఎప్పటిలాగే నార్మల్ గా వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెప్తున్నారు. ప్రతీ రోజు దానిని తీసుకుంటే ఆరోగ్యం కూడా బాగుంటుందని సూచిస్తున్నారు. అలాగే జీలకర్రను కలిపిన నీటిని తీసుకోవడం వల్ల ఆ రోజుల్లో వచ్చే నొప్పి కూడా సాధారణం కంటే చాలా తగ్గుతుందని అంటున్నారు. దీనికి కారణం ఇందులో ఉంటే ఆయుర్వేద గుణాలే అని తెలుస్తోంది.
అంతేకాకుండా అసలైన ఆయుర్వేదమైన పసుపును తీసుకోవడం వల్ల కూడా పీరియడ్స్ ప్రాబ్లెమ్స్ కు సమాధానం దొరుకుతుందని అంటున్నారు. తినే ఆహారంలో ఒక చెంచాడు పసుపును రోజూ తీసుకుంటే క్రమం తప్పకుంటా నెలసరి వస్తుందని చెప్తున్నారు. ఇలా చేయడం వల్ల మరో ప్రయోజనం కూడా ఉందంటున్నారు నిపుణులు. అదే అవాంఛిత రోమాలు. పసుపును ఒక టీ స్పూన్ మేర రోజూ తీసుకుంటే తప్పకుండా అవాంఛిత రోమాలు పెరగకుండా ఆపుతుందంట.
రెగ్యూలర్ మెన్సెస్ కి మరో వంటింటి ఉపాయం దాల్చిన చెక్క. దీనిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల… పీరియడ్స్ రెగ్యూలర్ గా వస్తాయంట. అందుకే బాగా కాచిన పాలల్లో కలిపి తీసుకుంటే సత్పలితాలను ఇస్తుందట. ఇలాంటిదే మరోకటి యాపిల్ సైడర్ వెనిగర్. దీనిని తేనె మిశ్రమంగా కలిపి తీసుకుంటే ఇర్ రెగ్యూలర్ పీరియడ్స్ కు చెక్ పెట్టొచ్చు. అంతేకాకుండా దీనిని తీసుకోవడం వల్ల అధిక బరువు ఉన్నవారు సన్నగా.. నాజూగ్గా మారుతారంట. ఈ మధ్యకాలంలో బాగా ప్రాచూర్యం పొందిన స్మార్ట్ బెల్లీ మహిళల సొంతం అని అంటున్నారు. పీరియడ్స్ టైంలో ఆహారంగా పండ్లు తీసుకోవడం కూడా మంచిదే. అందులోనూ పైనాపిల్ మరీ మంచిది. ఇందులో బ్రోమెలైన్ అనే పేరుగల ఎంజైమ్ ఒకటి ఉంటుంది. ఈ ఎంజైమ్ గర్భాశయం పొరను ఎంతో మృదువుగా ఉంచేలా చేస్తుంది. దీని వల్ల స్త్రీల్లో రుతుస్రావం క్రమం తప్పకుండా వస్తుందంట. దీంతో పాటు చాలమందికి ఉండే మలబద్దకం సమస్య కూడా తీరుతుంది.
ట్రై చేయండి…