Health Care 50 ఏళ్ల క్రితం మన తల్లిదండ్రులు.. తాతబామ్మలకు అనారోగ్యం అంటే ఏంటో తెలియదు. కొందరికి ఆసుపత్రులు ఉంటాయని.. వాటికి వెళ్లి చికిత్స చేయించుకోవడం తెలియదు. చాలా మందికి పెరిగి పెద్ద అయ్యే వరకు ఇంజక్షన్స్ అంటే తెలియదు. అప్పట్లో అలా పెరిగారు మన ముందు తరాల వారు. ఇప్పుడు మనం ఏడాదికి ఒక సాయి అయినా ఆసుపత్రికి వెళ్తున్నాం. కొత్త కొత్త రోగాలు.. వింత వింత సమస్యలను మనం ఎదుర్కొంటూ ఉన్నాం. ఈ మద్య కాలంలో చాలా మంది చాలా రకాలుగా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. అవన్నీ కూడా మన జీవన విధానం మార్పు రావడం వల్ల అనడంలో సందేహం లేదు. ఒకప్పుడు ఉన్న జీవన విధానంకు ఇప్పుడు జీవన విధానంకు చాలా మార్పులు వచ్చాయి. అప్పట్లో ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే పదుల కిలో మీటర్లు నడుచుకుంటూ లేదంటే సైకిల్ పై వెళ్లే వారు.
కనీసం కొంత దూరం వరకు నడిచి వెళ్లి అక్కడ నుండి ఏదో బస్సు లేదా మరేదైనా వాహనం ఎక్కే వారు. కాని ఇప్పుడు పరిస్థితి అలా లేదు. ఎక్కడికి అయినా వెళ్లాలి అంటే మన సొంత బైక్ లేదా కారు ఉంటుంది. కనుక ఇంటి బయట కాలు పెడితే వెంటనే వాహనంలో పెట్టడమే. ఒక వేళ వాహనం లేకున్నా కూడ అడుగడుకు కూడా ఆటోలు ఉన్నాయి కనుక నడవాల్సిన అవసరం రావడం లేదు. మనిషి ప్రతి రోజు వయసుకు తగ్గట్లుగా నడవక పోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. ఇక ఈమద్య కాలంలో చాలా మంది బ్యాక్ పెయిన్ మరియు అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు. ఆ బ్యాక్ పెయిన్ కు అందరికి తెలిసిన కారణం ఎక్కువ సమయం కూర్చుని ఉండటమే. గంటలకు గంటలు కూర్చును ఉండటం వల్ల సమస్యలు మొదలు అవుతాయి.
ఆ సమస్యలను తగ్గించుకోవాలంటే ఖచ్చితంగా కంటిన్యూస్ గా కూర్చుని ఉండటం చేయవద్దు. గంటలో 5 నుండి 10 నిమిషాల వరకు వాకింగ్ చేయడంతో పాటు చేతులను కిందికి మీదకు అంటూ ఉండాలి. చేతులు మరియు కాళ్లను సాధ్యం అయినంతగా ఎక్కువ కదిలించడం వల్ల ముందు ముందు సమస్యలు ఉండవు. పెద్ద ఎత్తున అనారోగ్య సమస్యలకు కారణం అయిన కంటిన్యూస్ సిట్టింగ్ గుండెకు సంబంధించిన సమస్యలకు కూడా కారణం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కాళ్లు మరియు చేతులు ముడచుకుని కూర్చుని ఉండటం వల్ల రక్త ప్రసరణ ఎక్కడికి అక్కడ స్థంభించి పోతుంది. తద్వార గుండె సమస్యలు తలెత్తుతాయని నిపుణులు చెబుతున్నారు. కనుక కూర్చుని జాబ్ చేసే వారు ఖచ్చితంగా ఏదో ఒక సమయంలో లేచి నిలబడి కాళ్లు మరియు చేతులు మూమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
కొన్ని సంవత్సరాల పాటు కూర్చుని చేసే జాబ్ చేస్తున్న వారిలో అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. మొదట నడుము నొప్పి అంటూ కంప్లైంట్ ఇచ్చే వారు ఆ తర్వాత ఊపిరి తిత్తులకు సంబంధించిన సమస్యలు గుండె సమస్యలు అంటూ ఆసుపత్రి చుట్టు తిరగాల్సి ఉంటుంది. కనుక భవిష్యత్తులో ఆసుపత్రి చుట్టు తిరిగే అవసరం రాకుండా వర్క్ ప్లేస్ లో గంటకు అయిదు పది నిమిషలు అయినా లేచి వాకింగ్ చేయాలంటున్నారు. పెద్ద పెద్ద కంపెనీలు ప్రత్యేకంగా గంట గంటకు విశ్రాంతి పేరుతో కొన్ని యాక్టివిటీస్ చేస్తూ ఉంటాయి. అలా చేయడం వల్ల ఒత్తిడి కూడా చాలా వరకు తగ్గుతూ ఉంటుంది. కనుక మీరు కనుక ఎక్కువ సమయం కూర్చుని చేసే జాబ్ చేస్తున్నట్లయితే ఇప్పుడు చెప్పిన విధంగా గంటకు అయిదు పది నిమిషాలు కనీసం వాకింగ్ చేయాలి.