Signs For Body Fat: మనం రోజువారీ తీసుకునే ఆహారాన్ని ఒక క్రమ పద్ధతిలో తీసుకోవాలి. శరీరానికి అవసరమైన మేరకు మాత్రమే తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటాం. లేదంటే బాడీలో కొవ్వు బాగా పెరిగిపోతుంది. దీని వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. వీటి అన్నింటికి మితి మీరిన ఆహారం ప్రధాన కారణంగా ఉంది. అంతేగాకుండా పోషకాహారం తీసుకోకపోవడం కూడా మరో సమస్యగా మారుతుంది. అసలు పోషకాహారం అంటే ఏమిటి అనేది కూడా మీకు తెలియాలి. శరీరానికి అవసరమైన మాంసకృతులు, పోషకాలు, విటమిన్లు అందించే ఆహారమే పోషకారం. దీనిని తీసుకుంటే ఎటువంటి అనారోగ్యం ధరి చేరదు. అలా కాదని మరోలా ప్రయత్నిస్తే కొవ్వు పెరిగిపోతుంది. కొవ్వు పెరగడం సమస్య కాదు కానీ… దానితో పాటే గుండె జబ్బులు, బీపీ, సుగర్, అల్సర్ లాంటివి మనల్ని ఎంతో ఇబ్బంది పెడుతాయి.
ఇలా మనలో కొవ్వు పెరుగుతుంటే మన శరీరం మనకు కొన్ని సంకేతాలు ఇస్తుంది. అది తినే ఆహార పదార్థాల మీద కావచ్చు. తాగే పానీయాలు మీద కావచ్చు. అలాంటి సమయంలో వాటిని మనం కంట్రోల్ చేయాలి. లేకపోతే పూర్తిగా తినడం ఆపేయాలి. ఇలా చేస్తే వాటిని కొవ్వు పెరగకుండా శరీరాన్ని కాపాడుకోవచ్చు. అయితే ఈ కొవ్వు పెరిగే సమయంలో బాడీ మనకు ఇచ్చే సంకేతాలు ఏంటి అనేది చూద్దాం. వాటి లక్షణాల గురించి తెలుసుకుందాం.
మనకు కొన్నిసార్లు కడుపు ఉబ్బినట్లు ఉంటుంది. ఇదే సమయంలో తేన్పులు కూడా వస్తాయి. వీటికి ప్రధాన కారణం కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని మనం తీసుకోవడంమే. ముఖ్యంగా పీచు పదార్థాలు ఎక్కువగా ఉండే క్యాబేజీ వంటివి తీసుకోవడం వల్ల అవి అజీర్తికి దారి తీస్తాయి. దీంతో కడుపు ఉబ్బరంగా ఉంటుంది. అంతేగాకుండా ఈ ఆహారం ఎక్కువ సేపు పొట్టలో ఉండడం చేత పులిసి పోయినట్లు అనిపిస్తుంది. అప్పుడు తేన్పులు రావడం మొదలు అవుతుంది. ఇది కచ్చితంగా మన శరీరంలో పెరిగిపోతున్న కొవ్వుకు సంకేతమే. దీనిని నిర్లక్ష్యం చేస్తే మూల్యం చెల్లించుకోక తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమయంలో కొంచె నీటిని ఎక్కవగా తీసుకోవడం వల్ల దాని నుంచి ఉపశమనం పొందవచ్చని సూచిస్తున్నారు.
కొవ్వు పెరుగుతున్నాం అని తెలిపే మరో సంకేతం విరేనాలు పట్టుకోవడం. శరీరంలో కొవ్వు పెరుగుతున్నప్పుడ దానికి సూచికగా ఒక్కొసారి మోషన్స్ వేధిస్తాయి. ఇది ఇందుకు గల ప్రధాన కారణం కొవ్వు పదార్థాల జీర్ణం కాకపోవడం. నిజానికి ఇది అందరిలో ఒకేలా అవుతుంది అని అంటే కాదు. కొంతమంది శరీరం దానికి సపోర్ట్ చేస్తే బాగానే ఉంటుంది. లేకపోతే విరేచనాలు పట్టుకుంటాయి. ఈ సమయంలో ఓరల్ డీహైడ్రేషన్ తీసుకోవాలి. గ్లూకోజ్ కూడా మంచిగా పనిచేస్తుంది.
సరిగా నిద్రపట్టకపోవడం కూడా శరీరంలో కొవ్వుశాతం పెరుగుతుంది అని చెప్పడానికి ఓ సంకేతం. మానవ శరీరంలో కొవ్వులు బాగా ఎక్కువ అయినప్పుడు ఫలితంగా నిద్రకు భంగం కలుగుతుంది. పదే పదే మెలుకువ రావడం జరుగుతుంది. ఎక్కువ భాగం కొవ్వు పదార్ధాలు జీర్ణం కాకపోయినప్పుడు ఇలా జరుగుతుంది. ఈ కారణంగా మనిషి అలసిపోనట్లు కనిపిస్తాడు. ఈ సమయంలో సరైనా విశ్రాంతి అవసరం.
శరీరంలో కొవ్వు పదార్ధాలు పెరిగినప్పుడు అలసట వస్తుంది. అప్పుడు దీన్ని కూడా ఓ సంకేతంగా గుర్తించాలి. ఇది కేవలం కొవ్వు పదార్ధాలు ఎక్కువగా తినడం వల్ల వస్తుంది. తరుచూ ఇలా అలసిపోతున్నారు అంటే గుండె జబ్బుకు ఇది ఓ కారణం కావచ్చు. ఈ సమయంలో డాక్టర్ ను సంప్రదించడం మంచిది.
అధిక బరువు కూడా మనలో పెరుగుతున్న కొలెస్ట్రాలకు సూచనే. కొవ్వు పదార్థాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం వల్ల మనిషి బరువు పెరుగుతారు. ఈ సమయంలోనే బాడీని అదుపులో ఉంచేందుకు వ్యాయామం లాంటివి చేయాలి.