Spinach: ఈ ఆకు కూర అద్బుతం వారంలో కనీసం ఒక్క సారైనా తింటే..!

Spinach: మన చూట్టూ మొక్కలు, చెట్లు, ఆకులు ఇలా చాలా ఉంటాయి. వాటి వల్ల మానవునికి చాలా ప్రయోజనాలే ఉంటాయి. కానీ మనలో ఎక్కువ మందికి అవి ఏంటి? దేనికి ఉపయోగిస్తారు అనేది తెలియదు. మన తాతయ్య కానీ ఆ వయస్సుతో సమానం అయిన వారిని ఇప్పుడు మనం తీసుకునే మందుల గురించి అడిగితే వారి కాలంలో ఇలాంటి ఏమీ ఉండేవికావని చెప్తారు. అంతేగాక రోడ్డు పక్కన ఉండే ఓ మొక్కను తీసుకుని వచ్చి.. నాకు జ్వరం […].

By: jyothi

Published Date - Sun - 5 September 21

Spinach: ఈ ఆకు కూర అద్బుతం వారంలో కనీసం ఒక్క సారైనా తింటే..!

Spinach: మన చూట్టూ మొక్కలు, చెట్లు, ఆకులు ఇలా చాలా ఉంటాయి. వాటి వల్ల మానవునికి చాలా ప్రయోజనాలే ఉంటాయి. కానీ మనలో ఎక్కువ మందికి అవి ఏంటి? దేనికి ఉపయోగిస్తారు అనేది తెలియదు. మన తాతయ్య కానీ ఆ వయస్సుతో సమానం అయిన వారిని ఇప్పుడు మనం తీసుకునే మందుల గురించి అడిగితే వారి కాలంలో ఇలాంటి ఏమీ ఉండేవికావని చెప్తారు. అంతేగాక రోడ్డు పక్కన ఉండే ఓ మొక్కను తీసుకుని వచ్చి.. నాకు జ్వరం వస్తే దీనిని రంగరించి మింగే వాడిని అని అంటారు. ఇదంతా ఆయుర్వేదం మొక్కల చలవే. ఇలాంటి కోవకు చెందిందే ఇప్పుడు మనం తెలుసుకోబోయే ఆకు కూడా. అదే సొరైల్ ఆకు. దీన్ని కొన్ని చోట్ల బచ్చలి ఆకు అని కూడా అంటారు. వీటిని కూరగాయలు పండించినట్లే పండిస్తారు. గ్రామాల్లో, పల్లెటూర్లలో అయితే ఇంటి పెరట్లో గానీ, దగ్గరగా ఉండే ఖాళీ ప్రదేశాల్లో దీన్ని పండిస్తారు. కొన్ని చోట్లయితే ఇవి రోడ్డు పక్కన కూడా మొలుస్తుంటాయి. ఈ మొక్కల్లో ఆకులు, కాండాన్ని తింటారు. ఆంధ్రప్రదేశ్ లో అయితే ఈ ఆకుని గోంగూర అంటారు. దీనికి పులి కీరై అని పేరు కూడా ఉంది

.

ఔషధానికి ఉపయోగించే మొక్కల్లో దీనికి ప్రత్యేక స్థానం ఉంది. ఈ మొక్క ఆకులు జ్వరం జలుబును ఇట్టే తగ్గించేస్తాయి. అంతే కాకుండా ఇది కడుపులో మంటగా ఉండే వారికి ఇంకా మంచిగా పని చేస్తుంది. సాధారణంగా కామెర్లు అయిన వారికి ఇచ్చే చికిత్సలో దీని వినియోగం ఎక్కువగా ఉంటుంది అని నిపుణులు చెప్తున్నారు. దీనిని ఆహారంగా మనం తీసుకున్నప్పుడు ఒంటిలో వ్యాధి నిరోధక శక్తిని ఎక్కువగా ఉత్పత్తి  చేస్తుందని అంటారు. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే కరోనా లాంటి వైరస్ లు కూడా మన దరి చేరవు. అందుకనే దీనిని మనం తరుచు తీసుకునే ఆహారంలో భాగంగా తీసుకోవాలని వైద్యులు చూసిస్తున్నారు. కంటి చూపు మందగించిన వారికి కూడా ఈ బచ్చలి కూడా బాగా పని చేస్తుంది. దీనిలో ఉండే విటమిన్ ఏ తో కళ్లు బాగా కనిపిస్తాయి. ముఖ్యంగా రేచీకటి ఉండే వారికి ఇది ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. అందుకే చిన్ననాటి నుంచి పిల్లలకు ఈ ఆకు కూరను తినిపించి అలవాటు చేస్తుంటారు. ముసలి వాళ్లలో కూడా బాగా పని చేస్తుందని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ బరువు ఉన్న వాళ్లు ఈ ఆకుకూరను ఆహారంగా తీసుకుంటారు.  డైట్ చేసే వాళ్లలో చాలా మంది దీన్ని రోజు వారి మెనూలో ఓ భాగంగా ఉంచుతారు.  వారికి కావాల్సిన తక్కువ కేలరీల ఫుడ్ దీనితో లభిస్తుంది. ఆరోగ్యం పరంగానూ మంచిదైన దీనిలో…  ఉండే విటమిన్లు, పిండి పదార్థాలు, ఖనిజాలు  ఉంటాయి . ఇవి ఊబకాయులకు ఎంతగానో ఉపయోగపడుతాయి.

ఈ బచ్చల కూర అనేది మనిషి శరీరంలో ఉండే అనేక చెడును అంతా బయటకు తొలగిస్తుంది. దీంతో విషతుల్యమైనవి ఏమైనా బాడీలో ఉన్న అవి బయటకు వచ్చేస్తాయి. ముఖ్యంగా ఇందులో ఫ్లేవనాయిడ్లు, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మానవుని మూత్రవిసర్జనను మెరుగు పరుస్తాయి. దీని తాజా ఆకుల్లో ఉండే రసాన్ని జ్యూస్ గా చేసుకుని తాగితే మలినం అంతా తుప్పు వదిలినట్లు బయటకు వెళ్లి పోతుంది. దీంతో పొట్టలో ఉండే ఉబ్బరం తగ్గి ప్రశాంతత లభిస్తుంది. జీర్ణవ్యవస్థను కూడా సాఫీగా ఉంచుతుంది. రక్తపోటును కూడా అదుపులో ఉంచడానికి ఈ సొరైల్ ఆకు ఉపయోగపడుతుంది. బీపీ ఎక్కువ ఉన్నవారు దీన్ని క్రమంతప్పకుండా తీసుకోవడం ఉత్తమం అని వైద్యులు సూచిస్తున్నారు. బాడీలో ఉండే ట్రైగ్లిజరైడ్ లను పూర్తి స్థాయిలో అదుపులో ఉంచకపోయినా… రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల అదుపులో ఉంటాయని అంటున్నారు. మనం తీసుకునే ఆహారం ఎలాంటిదో మనకు పూర్తిగా తెలియదు. బాగుంది అని తింటాం. కానీ దాని వల్ల తెలియకుండానే మన ఆనారోగ్యాన్ని మనమే కొని తెచ్చుకున్న వాళ్లం అవుతాము. అలా కాకుండా ఈ ఆకు తినడంతో ఆ కొలెస్ట్రాల్ అన్నీ తగ్గి శరీరాన్ని తేలిక చేస్తాయి.  మలబద్దకం ఉన్న వారిలో కూడా ఇది మంచి ఫలితాన్ని చూపిస్తుంది. తరుచూ ఈ ఆకును కూర చేసుకుని తినడం వల్ల మలబద్దకం బారిన పడకుండా ఉండొచ్చు. తిన్న ఆహారాన్ని జీర్ణం చేసి అజీర్తిని దూరం పెడుతుంది. ఇలా ఇన్నీ ఉపయోగాలు ఉన్న సొరైల్ ఆకును అందరూ ఆహారంగా తీసుకొని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండండి.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News