Spiny Gourd : కొవిడ్ మహమ్మారి నేపథ్యంలో చాలా మంది ఇమ్యూనిటీ పవర్ లేక ప్రాణాలు కోల్పోయిన సంగతి అందరికీ తెలిసిందే. కరోనా వచ్చిన క్రమంలోనే జనంలో హెల్త్ కాన్షియస్‌నెస్ పెరిగి హెల్దీ ఫుడ్ తీసుకోవడంతో పాటు ఇమ్యూనిటీ పవర్ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, బోడ కాకరకాయలతో మనుషులకు బోలెడంత ఇమ్యూనిటీ పవర్ లభిస్తుంది. బోడ కాకరకాయతో హెల్త్‌కు కలిగే ప్రయోజనాలు తెలుసుకుందాం.
Spiny Gourd 2
హ్యూమన్ హెల్త్‌తో పాటు బాడీ ఇమ్యూనిటీ పవర్‌పైన ప్రభావం చూపే వాటల్లో ఒకటి బోడ కాకరకాయ. దీనిని కొన్ని ప్రాంతాల్లో ‘ఆకాకరకాయ’ అని కూడా పిలుస్తారు. అటవీ ప్రాంతాల్లో సేకరించబడే ఈ కూరగాయలను ప్రజలు ఎంతో ఇష్టంగా తీసుకుంటారు. వీటికి మార్కెట్‌లో ధర కూడా బాగానే లభిస్తుంది. భోజన ప్రియులకు అత్యంత ఇష్టమైన ఈ బోడ కాకరకాయ పోషకాల భాండాగారం.
ఔషధ విలువలు మెండుగా ఉన్నటువంటి ఈ బోడ కాకరకాయను ప్రతీ ఒక్కరు తమ ఆహారంలో భాగం చేసుకోవాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. బోడ కాకరలో పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులో అధిక మొత్తంలో ఉండేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ హెల్త్‌కు చాలా అవసరమైనవి. వీటి వల్ల హ్యూమన్ డైజేషన్ సిస్టమ్ కూడా బాగా స్ట్రాంగ్ అవుతుంది.
Spiny Gourd1
ఇకపోతే బోడకాకరను ఒకే రకంగా కాకుండా రకరకాలుగా కూడా చేసుకుని ఆహారంలో భాగం చేసుకోవచ్చు. పులుసు రూపంలోనూ, కూర రూపలోనూ పచ్చడ రూపంలోనూ బోడ కాకరకాయలను మనం తీసుకోవచ్చు. బోడ కాకరలో ఉండేటువంటి ఫోలేట్స్ హ్యూమన్ ఇమ్యూనిటీ పవర్ ఇంక్రీజ్ చేయడంలో కీ రోల్ ప్లే చేస్తాయి. గర్భిణులు ఈ బోడ కాకరకాయలను తీసుకోవడం వలన గర్భస్థ శిశువు ఎదుగుదల ఉంటుంద. డయాబెటిక్ పేషెంట్స్‌కు బోడకాకరకాయ చాలా మంచిదట. బ్లడ్‌లోని షుగర్ లెవల్స్ డిక్రీజ్ చేయడంలో బోడ కాకరకాయ చాలా పని చేస్తుంది. మొత్తంగా బోడ కాకరకాయతో మనుషుల ఆరోగ్యానికి బోలెడు ప్రయోజనాలున్నాయి.
Spiny Gourd
బోడకాకరకాయలోని కెరోటినాయిడ్స్ కంటి సంబంధిత సమస్యలను పరిష్కరించడంలో చక్కగా పని చేస్తాయి. కేన్సర్ ఇతర ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఉండేందుకుగాను బోడకాకరకాయలలోని పోషకాలు కాపాడతాయి. బోడ కాకరకాయ కేవలం హెల్త్ సంబంధిత మెడిసిన్‌గానే కాకుండా బ్యూటీ మెడిసిన్‌గానూ పని చేస్తుందట. బోడ కాకరకాయలోని ఫ్లవనాయిడ్స్ ఏజ్ మీద వచ్చేటువంటి ముడతలను నియంత్రిస్తాయి. మనుషులను హెల్దీ ప్లస్ యంగ్‌గా ఉంచడంలో బోడ కాకరకాయలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇన్ని పోషక విలువలు కలిగినటువంటి బోడ కాకరకాయలను దాదాపుగా ప్రతీ ఒక్కరు అత్యంత ఇష్టంగా తమ ఆహారంలో భాగం చేసుకోవడం మనం చూడొచ్చు.