Pimples: మొటిమలకు ‘ఆవిరి’ మంచి ఔషదం

Pimples అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా యుక్త వయసు వచ్చిన తర్వాత మొటిమలు రావడం చాలా కామన్ గా జరుగుతుంది. కాని కొందరు మొటిమలు రావడంతో తమ అందం అంతా పాడై పోతుందని.. మొటిమలు పోయిన తర్వాత మచ్చలు అలాగే ఉండి పోతాయేమో అనే భయంను వ్యక్తం చేస్తున్నారు. మొటిమలు ఎక్కువగా అమ్మాయిల చర్మంలో కనిపిస్తూ ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా కూడా అమ్మాయిలకు మొటిమల సమస్యలు తప్పవు. కాని కొన్ని చిన్న చిన్న చిట్కాల వల్ల […].

By: jyothi

Published Date - Thu - 5 August 21

Pimples: మొటిమలకు ‘ఆవిరి’ మంచి ఔషదం

Pimples అమ్మాయిలు అయినా అబ్బాయిలు అయినా యుక్త వయసు వచ్చిన తర్వాత మొటిమలు రావడం చాలా కామన్ గా జరుగుతుంది. కాని కొందరు మొటిమలు రావడంతో తమ అందం అంతా పాడై పోతుందని.. మొటిమలు పోయిన తర్వాత మచ్చలు అలాగే ఉండి పోతాయేమో అనే భయంను వ్యక్తం చేస్తున్నారు. మొటిమలు ఎక్కువగా అమ్మాయిల చర్మంలో కనిపిస్తూ ఉంటాయి. ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నా కూడా అమ్మాయిలకు మొటిమల సమస్యలు తప్పవు. కాని కొన్ని చిన్న చిన్న చిట్కాల వల్ల మొటిమలు అనేవి తగ్గించుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా మొటిమలు రాకుండా కాపాడుకోవచ్చు. మొటిమలకు చాలా సహజ పద్దతులు ఉన్నాయి. వాటిలో ఒకటి ఆవిరి పట్టడం. వేపర్ మిషన్ లేదా నీటిని బాగా మరిగేలా పెట్టడం. ఈ రెండింటి వల్ల కూడా మంచి ప్రయోజనాలు ఉంటాయి.

జలువు చేసిన సమయంలో వేడి నీటిలో పసుపు లేదా జెండూబామ్‌ వేసి ఎలా అయితే పీల్చుతారో కాస్త అటు ఇటుగా అలాంటి పద్దతినే ఇందుకు కూడా ఉపయోగించాలి. కాని నీటిలో ఏమీ వేయనక్కర్లేదు. అలాగే నీటి ఆవిరిని ఎక్కువగా పీల్చాల్సిన అవసరం కూడా లేదు. కేవలం ఫేస్ పై బాగా చెమట వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ ఆవిరికి ఎక్కువ సమయం మొహంను ఉంచడం వల్ల చర్మంపై ఉండే శ్వేద రంద్రాలు తెరుచుకుంటాయి. తద్వారా మొటిమలు రాకుండా నివారణ అవుతుంది. ఒక వేళ మొటిమలు వచ్చేందుకు సిద్దంగా ఉన్నా చీము వంటిది ముందుగానే బయటకు వచ్చేస్తుంది. తద్వారా ఫేస్ ను క్లీన్‌ చేసుకుంటే మళ్లీ మొటిమలు అనేవి రాకుండా ఉంటాయి.

ఈ ఆవిరిని నెల కు రెండు నుండి మూడు సార్లు పెట్టడం వల్ల మొటిమలు దరి చేరవు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఆవిరి పట్టే సమయంలో జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ ఆవిరి పట్టాలనే ఉద్దేశ్యంతో కొందరు మరీ వేడి వేడి నీటికి చాలా దగ్గర మొహం పడతారు. లేదా వేపర్ మిషన్ ను మరీ దగ్గరకు తీసుకు వస్తారు. అది ఎంత మాత్రం మంచిది కాదు. అలా వేడి వేడి ఆవిరి స్కిన్‌ కు తగలడం వల్ల సున్నితమైన చర్మం కంది పోతుంది. తద్వారా స్కిన్‌ నల్లగా అవ్వడంతో పాటు కొన్నాళ్ల తర్వాత ఆ స్కిన్‌ ఊడిపోతుంది. అందుకే కాస్త దూరంగా నీటి ఆవిరి ఉంచినా కూడా పెద్దగా ఇబ్బంది లేకుండానే చెమటలు పడతాయి.

వేడి ఆవిరి వల్ల ఫేస్ పై చెమటలు పట్టడం వల్ల మొటిమలు తగ్గుతాయి. ఈ చిన్న చిట్కాను ఇంట్లో ప్రతి ఒక్కరు చేసుకోవచ్చు. మొటిమలు ఉన్న చర్మంకు ఎక్కువగా ఆవిరి పట్టడం వల్ల ఆ మొటిమలు అనేవి ఊడిపోయేంత వరకు వస్తుంది. తద్వార ఏర్పడిన రంద్రం వారం రెండు వారాల్లో క్లీన్ అయిపోతుంది. కనుక అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఎవరైనా కూడా మొటిమలు తగ్గించుకునేందుకు గాను కాస్త సీరియస్‌ గా తీసుకుని వారంలో కనీసం ఒక్కసారి అయినా నీటి ఆవిరిని ఫేస్ కు పట్టాలి. ఫేస్ పై ఎంత ఎక్కువగా చెమటలు పుడతాయో అంత ప్రయోజనకరంగా ఆవిరి ఉంటుంది. కనుక ఆవిరి పట్టే సమయంలో ఊపిరి ఆడకుండా అన్నట్లుగా టవల్ ను కప్పుకోవాలి.

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News