Sunny Leone : సన్నీ లియోన్.. పోర్న్ స్టార్ గా పరిచయం. తర్వాత బాలీవుడ్ రెగ్యులర్ హీరోయిన్ అయిపోయారు. అప్పుడప్పుడూ తెలుగు సినిమాల్లోనూ మెరుస్తున్నారు. దేశంలో విపత్తులు తలెత్తినప్పుడల్లా స్పందిస్తున్నారు. తనకు తోచిన, చేతనైనంత సాయం చేస్తున్నారు. తద్వారా నలుగురికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. దీంతో ఒకప్పుడు ఆమె పేరు వింటేనే ముసిముసిగా నవ్వుకున్న జనం ఇప్పుడు ముక్కున వేలేసుకుంటున్నారు. సన్నీ లియోన్ లో అందంతోపాటు మంచి మనసు కూడా ఉందని మెచ్చుకుంటున్నారు. ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఆమె మరోసారి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు. సాయం చేసేందుకు ముందుకొచ్చారు. ఈ మేరకు ‘‘పీపుల్ ఫర్ ది ఎథికల్ ట్రీట్మెంట్ ఆఫ్ యానిమల్స్’’ (పెటా) సంస్థ సహకారం తీసుకున్నారు.
Sunny Leone : bollywood heroine sunny leone humanity
అన్నదానానికి మించిన దానం లేదంటారు. అందుకే సన్నీ లియోన్ ఆ మార్గాన్ని ఎంచుకున్నారు. ఢిల్లీలో నివసిస్తున్న వలస కార్మికులకు పది వేల భోజనాలను ఉచితంగా అందిస్తానని ప్రకటించారు. ‘‘పొట్ట చేత పట్టుకొని ఊరు కాని ఊరుకి వచ్చిన నిరుపేదలకు ఇప్పుడు ప్రొటీన్ ఫుడ్ అవసరం. దాన్ని అందించటానికి పెటాతో కలిసి ముందుకు వస్తున్నా. మనం ప్రస్తుతం కొవిడ్ సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాం. దీన్ని తట్టుకొని నిలబడాలంటే అందరం కలిసికట్టుగా ముందుకు రావాలి’’ అని సన్నీ లియోన్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. ముంబైలో ఇటీవల కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న 102 ఏళ్ల షీలా తారకేశ్వర్ సిన్హా ఫొటోను నిన్న గురువారం షేర్ చేశారు. ఆమే తనకు స్ఫూర్తి అంటూ ట్యాగ్ చేశారు. సొసైటీ పట్ల సన్నీ లియోన్ బాధ్యతకు ఆమె అభిమానులు ‘‘సూపర్’’ అంటూ కితాబులిస్తున్నారు.
సన్నీ లియోన్ గత కొంత కాలంగా కరోనా వైరస్ వ్యాప్తిపై సోషల్ మీడియా వేదికగా ప్రజలను అలర్ట్ చేస్తున్నారు. కొవిడ్ నుంచి కోలుకున్నవారు బాధితులకు ప్లాస్మాను దానం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. కరోనా టీకా కోసం కొవిన్ వెబ్ సైట్ లో రిజిస్టర్ చేసుకోవాలని సూచించారు. కొవిడ్ పై మనం చేస్తున్న పోరాటంలో టీకా వేయించుకోవటం ఎంతో అవసరమని చెబుతున్నారు. ఎర్త్ డే, లాఫింగ్ డే వంటి ప్రతి సందర్భంలోనూ స్పందిస్తున్నారు.