Rainy Season: ఇండియాలో ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాల్లో జూన్ వచ్చిందంటే వర్షాలు మొదలు అవుతాయి. వర్షా కాలం వచ్చిందంటే కొత్త రోగాలు మోసుకు వస్తాయి. చిన్న జలుబు నుండి మొదలుకుని డెంగ్యూ మలేరియా వరకు కూడా ఈ వర్షాకాలం మనను ఇబ్బంది పెడుతూ ఉంటాయి. అందుకే ముందస్తుగా జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనారోగ్యం చేసిన తర్వాత ఆసుపత్రికి వెళ్లడం కంటే ఆరోగ్యంను బాగుంచుకుంటే మంచిది కదా. అందుకే మేము ఈ వీడియోలో వర్షాకాలం అనారోగ్యాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను చెప్పబోతున్నాం. జాగ్రత్తగా విని తప్పకుండా పాటించి ఆరోగ్యంగా ఉంటారని ఆశిస్తున్నాం..
ఇక వివరాల్లోకి వెళ్తే… వర్షా కాలంలో ఎక్కువగా నీటిలో తడవడం లేదా చన్నీటి స్థానం చేయడం వల్ల జలుబు చేస్తుంది. దాన్ని లైట్ తీసుకుంటే జ్వరం వస్తుంది.. అది టైఫాయిడ్ గానో మలేరియాగానో మరారే ప్రమాదం కూడా ఉంది. అందుకే ఈ వర్షాకాలం అన్ని రోజులు కూడా చన్నీటి స్థానంకు పూర్తిగా దూరంగా ఉండాలి. కనీసం గోరు వెచ్చని నీటిని అయినా స్థానంగా చేయాలి. చల్లటి గాలికి తిరగకుండా ఉండాలి.. అలాగే వర్షంలో తడవకుండా జాగ్రత్త పడాలి. వర్షం పడుతున్న సమయంలో ఇంట్లోకి చల్లని గాలి వస్తుందని అంతా ఆస్వాదిస్తూ కూర్చుంటారు. కాని ఆ చల్లని గాలి వల్ల జలుబు చేసే ప్రమాదం ఉంది. కనుక ఆ చల్లని గాలికి ఉండకుండా వర్షం పడుతున్న సమయంలో డోర్ వేయడం లేదా డోర్ కు ఎదురుగా ఉండకుండా అయినా ఉండాలి. ఈ జాగ్రత్తలు తీసుకోవడం వల్ల అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండే అవకాశం ఉంది.
ఇక ఎలాంటి ఆహా పదార్థాలు ఈ వర్షాకాలం తినడం వల్ల ఇమ్యూనిటీ పెరుగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. కాలం ఏదైనా మన శరీరంను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పౌషిక ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు గాను బలవర్థకమైన ఆహారం మరియు పాలు పండ్లను తీసుకోవాలి. ఇక రెగ్యులర్ గా ఎన్నో ఆయుర్వేద గుణాలు ఉన్న నల్ల మిరియాలను ప్రతి రోజు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. అందులో ఉన్న విటమిన్ కె, సెలీనియం, మాంగనీస్, పాస్పరస్ ఇంకా పలు పోషకాలు రోగ నిరోదక శక్తిని పెంచుతాయి. కనుక ప్రతి రోజు నల్ల మిర్యాలను ఆహారంలో ఉండేలా చూసుకోవాలంటూ వైధ్యులు సూచిస్తున్నారు.
ప్రతి ఒక్కరికి తెలిన పసుపు యాంటీ బయోటిక్ గా పని చేస్తుంది. ఈ సమయంలో శరీరానికి యాంటీ బయోటిక్స్ అవసరం చాలా ఉంటుంది. కనుక పసుపును సాధ్యం అయినంతగా ఎక్కువగా ఆహారంలోకి తీసుకోవడం మంచిది. సాదారన రోజులతో పోల్చితే పసుపును రెట్టింపు తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు పలు ఔషద గుణాలు ఉన్న లవంగాల్లో రోగ నిరోదక శక్తి ఎక్కువగా ఉంటుంది. కనుక వర్షాకాలం ఎలాంటి అనారోగ్య సమస్యలు ఎదుర్కోకుండా ఉండాలి అంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు రోజు కనీసం నాలుగు నుండి ఆరు లవంగాలను అయినా తీసుకోవాలి. దీని వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది.
మన వంట గదిలో ఉండే ఎన్నో మసాలా దినుసులు మంచి ఔషద గుణాలను కలిగి ఉన్నాయి. అందుకే వాటిని కూడా సాధ్యం అయినంతగా వాడుతూ రెగ్యులర్ గా వయసును బట్టి బాదాం లు తినాలి. ఇక ఆరోగ్యవంతమైన కూరగాయలతో పాటు వారంలో రెండు లేదా మూడు సార్లు అయినా ఆకుకూరలతో భోజనం చేయడం కూడా మంచి అలవాటు. ఈ జాగ్రత్తలు అన్ని కూడా తీసుకుంటే వర్షాకాలమే కాదు ఆ తర్వాత మరే కాలమైనా కూడా మనను ఏమీ చేయలేదు.
Monsoon health tips
Immunity
Health news
వర్ష కాలంలో అనారోగ్యం
ఔషద గుణాలు
health care tips
telugu health tips
arogyam in telugu
latest health news
ayurvedam telugu