Tamarind Seeds : ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవనంలో ఆరోగ్యాన్ని సరిగా పట్టించుకునే వారు చాలా తక్కువ మందని చెప్పొచ్చు. అయితే, కరోనా తర్వాత ఈ పరిస్థితిలో చాలా మార్పులొచ్చాయి. చాలా మంది ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనబరుస్తున్నారు. మార్నింగ్ టైమ్స్‌లో వాకింగ్, ఎక్సర్ సైజెస్, యోగా అలవాటు చేసుకుంటున్నారు. అయితే, చాలా మంది తమ చర్మ రంగు గురించి బాధపడుతుంటారు.
అందంగా కనబడేందుకుగాను చర్మం రంగు మంచిగా ఉండటం చాలా ముఖ్యం. కాగా, మీ స్కిన్ కలర్‌ను ఇంప్రూవ్ చేసే శక్తి మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ కంటే కూడా చింత గింజలకు ఎక్కువగా ఉందన్న సంగతి మీకు తెలుసా.. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే చింత గింజల వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
తీసుకునే ఆహార పదార్థాలపైన శ్రద్ధ వహించడం ద్వారా అందంగా కనబడొచ్చని నిపుణులు అంటున్నారు. అయితే, చాలా మంది మార్కెట్‌లో లభించే వివిధ రకాల ప్రొడక్ట్స్ యూసేజ్ ద్వారా తాము అందంగా కనబడుతామని అనుకుంటారు. అది నిజమే కానీ, అది తాత్కాలికమన్న సంగతి గుర్తించాలి. ఎందుకంటే అప్పటి వరకు వాటి వల్ల ఉపయోగం ఉన్నా వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ తర్వాత చాలా ఇబ్బందులు కలగజేస్తాయి. ఈ క్రమంలో నేచర్‌లో లభించే చింత గింజల ద్వారా అందం మీ సొంతం చేసుకుంటే చాలా మంచిది.
Tamarind Seeds 3
చింత గింజల్లో ఉండేటువంటి హైల్రోనిక్ అనే యాసిడ్ స్కిన్‌ను ఎప్పుడూ తేమగా ఉంచుతుంది. అయితే, చింత గింజలను స్కిన్‌పై డైరెక్ట్‌గా అప్లై చేయకూడదు. టామరిండ్ సీడ్స్‌ను పౌడర్‌గా చేసుకుని టీ లో వేసుకుని తాగినట్లయితే చక్కటి ప్రయోజనాలుంటాయి. స్కిన్ డ్రై అసలే కాదు. ఇకపోతే వృద్ధాప్య చాయలు అనగా వయసు పెరిగే కొద్ది చర్మ ముడుత పడుతుండటం సహజం. కాగా, అలా స్కిన్ ముడుతలు పడకుండా ఉండేందుకుగాను చింతగింజలు ఉపయోగించుకోవాలి.
Tamarind Seeds
చింత గింజలలో తేనె వేసి స్కిన్‌పై అప్లై చేసుకోవాలి. ఈ రెమెడీని వన్ వీక్‌లో త్రీ టైమ్స్ లేదా ఫోర్ టైమ్స్ అప్లై చేస్తే చక్కటి ఫలితముంటుంది. ఈ చింత గింజల రెమిడీతో మీ స్కిన్ వదులుగా ఉండకుండా టైట్‌గా ఉంటుంది. చింత గింజల పౌడర్‌తో చేసిన టీ హెల్త్‌కు చాలా మంచిది. చింతగింజల్లో చర్మాన్ని యవ్వనంగా ఉంచే పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. పొడి చర్మం ఉన్న వారు చింత గింజల పొడికి బొప్పాయి రసం కలిపి ముఖానికి రుద్దుకుంటే చక్కటి ప్రయోజనాలుంటాయి. చింత గింజల్లో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు స్కిన్ ఇన్‌ఫెక్షన్స్ నుంచి బయటపడేస్తాయి. చింత గింజలను ఎండలో బాగా ఆరబెట్టి పొడిచేసిన తర్వాత ఆ పౌడర్‌కు ఆలివ్ ఆయిల్ కలిపి స్కిన్‌పై అప్లై చేస్తే మీ స్కిన్ కలర్ బాగా ఇంప్రూవ్ అవుతుంది.