Health Tips : మెదడు ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలు

Health Tips : కొందరు దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. భాగ్యనగరంలోనూ ఈ తరహా బాధితుల సంఖ్య పెరుగుతోంది..

By: jyothi

Published Date - Thu - 22 September 22

Health Tips : మెదడు ఆరోగ్యానికి పాటించాల్సిన జాగ్రత్తలు

Health Tips : శరీరంలో గుండె తర్వాత అత్యంత ముఖ్యమైన అవయవం మెదడు. శరీరంలో ఏ భాగం పనిచేయాలన్నా.. మెదడే కీలకం. మెదడు సహకరించకపోతే.. ఏమీ చేయలేని పరిస్థితి. అంతటి కీలకమైన అవయవ ఆరోగ్యం ప్రస్తుతం ప్రమాదంలో పడుతోంది. మారుతున్న జీవనశైలే ఇందుకు కారణం.

కొందరు దీర్ఘకాలంగా ఉన్న అధిక రక్తపోటు కారణంగా బ్రెయిన్‌ స్ట్రోక్‌కు గురవుతున్నారు. భాగ్యనగరంలోనూ ఈ తరహా బాధితుల సంఖ్య పెరుగుతోంది. నిమ్స్‌కు నిత్యం న్యూరో సంబంధిత సమస్యలతో 70-100 మంది వస్తున్నారు. ప్రైవేటు ఆసుపత్రుల్లోనూ ఇదే పరిస్థితి. యువతనూ ఈ సమస్యలు వెంటాడుతున్నాయి.

మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే..

-నిద్రలేచే సమయంలో తలనొప్పి, చూపు మందగింపు, శరీరం ఒకవైపు కుంగినట్లు అనిపించినా, వాంతుల్లాంటివి తరచూ వేధిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలి.

-రోజూ 7-8 గంటలపాటు గాఢ నిద్రపోవాలి.

-చేపలు, బ్లూబెర్రీస్‌, వంటల్లో పసుపు వాడాలి. గుమ్మడికాయ, నారింజ, వాల్‌నట్‌, బ్రోకలి, గుడ్లు, విటమిన్‌ బి12 ఉండే ఆహారం తినాలి.

-వారానికి కనీసం 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. జాగింగ్‌, వేగంగా నడక, సైక్లింగ్‌, స్విమ్మింగ్‌ ఏదైనా చేయొచ్ఛు రోజూ 30 నిమిషాలకు తక్కువ కాకుండా చేయడం మేలు.

Also Read : Allu Arjun : ఒకే నెల‌లో రూ.140 కోట్లు సంపాదించిన బ‌న్నీ.. ఏంది సామీ ఇది..!

Also Read : Bigg Boss Season 6 : బూతులకు బ్రాండ్ అంబాసిడర్‌లా మారిన గలాటా గీతూ.. ఏందీ రచ్చ

Related News