COVID-19 Vaccine:దేశ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య కాస్త తగ్గింది. సెకండ్ వేవ్ నుండి బయట పడ్డట్లే అంటూ అంతా ఊపిరి పీల్చుకుంటున్నారు. గత ఏడాదితో పోల్చితే సెకండ్ వేవ్ భయంకరంగా కేసుల సంఖ్య ఉంది. అలాగే మృతుల సంఖ్య కూడా భారీగా ఉంది. అసలు మృతుల సంఖ్య చెప్పలేదని.. ఆ సంఖ్య చెప్తే ప్రతి ఒక్కరి గుండెల్లో గుబులు మొదలు అవ్వడం ఖాయం అని.. అందుకే అలాంటి విషయాలను ప్రభుత్వాలు చెప్పక పోవడమే మంచి నిర్ణయం అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఈ సమయంలో దేశ వ్యాప్తంగా స్పీడ్ గా వ్యాక్సినేషన్ పక్రియ కొనసాగించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న ఈ సమయంలో పలువురు పలు రకాల అనుమానాలను కలిగి ఉన్నారు. కొందరు వ్యాక్సిన్ అంటేనే భయపడుతూ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొందరిలో రెండవ రోజు లేదా మూడవ రోజు లేదా వారం రోజుల లోపు లో కరోనా పాజిటివ్ అంటూ నిర్థారణ అవుతోంది. దాంతో ఒకానొక సమయంలో కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న కొన్ని రోజుల వరకు టెస్ట్ కు వెళ్తే కరోనా పాజిటివ్ టెస్ట్ వస్తుందని.. వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల టెస్టు రిపోర్ట్ అలా వస్తుందని కొందరు కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. దాంతో వ్యాక్సిన్ అంటే కొందరు భయ పడి వేయించుకోకుండా కరోనా బారిన పడుతున్నారు. కరోనా వ్యాక్సిన్ తీసుకుని వారం లోపు వైరస్ బారిన పడ్డ వారిని కొందరిని ఎంపిక చేసి వారిని ప్రశ్నించి.. వారి పరిస్థితిని పరిశీలించగా నిపుణులకు ఆశ్చర్యకర విషయాలు వెళ్లడి అయ్యాయట. అసలు విషయం ఏంటీ అంటే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల పాజిటివ్ రావడం అనేది పూర్తి అవాస్తవం. ఇక వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత అది పూర్తి స్థాయిలో శరీరంలోకి కలిసి పోయి వర్క్ చేయడానికి కనీసం వారం రోజుల సమయం పడుతుంది.
తద్వార వారం రోజుల వరకు వైరస్ కు దూరంగా ఉంటేనే వ్యాక్సిన్ తీసుకున్న ప్రయోజనం ఉంటుందని.. వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే వైరస్ ఎటాక్ కాకుండా ఉండదు అంటూ నిపుణులు చెబుతున్నారు. మరి వారికి వైరస్ ఎలా వచ్చింది అనే విషయంలో కూడా ఆసక్తికర విషయాలను వారు వెళ్లడించారు. వ్యాక్సిన్ కోసం వెళ్లిన వారిలో చాలా మంది ఆరోగ్య కేంద్రాలకు వెళ్లారు. అక్కడ కరోనా నిర్థారణ పరీక్షలు జరుగుతున్నాయి. పక్కన్నే వ్యాక్సినేషన్ జరుగుతోంది.
వ్యాక్సినేషన్ కోసం వెళ్లిన వారు.. కరోనా నిర్థారణ పరీక్షలకు వెళ్లిన వారు అంతా ఒకే లైన్ లో నిల్చోవాల్సి వచ్చిందట. తద్వార కరోనా పేషంట్స్ నుండి వ్యాక్సిన్ వేసుకోవడానికి వెళ్లిన సమయంలో వైరస్ బారిన పడుతున్నారు అంటూ నిపుణులు చెబుతున్నారు. అందుకే కేంద్ర ప్రభుత్వం వ్యాక్సిన్ వేసే కేంద్రాలు మరియు కరోనా నిర్థారణ కేంద్రాలను వేరు వేరుగా ఉంచాలని ఆదేశించింది. తద్వార కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వెంటనే పాజిటివ్ అంటూ కేసులు నమోదు అవ్వడం తగ్గింది. వైధ్య సిబ్బంది నిర్లక్ష్యం వల్లే వారికి అలా జరిగిందని.. వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారికి ఎలాంటి ఇబ్బంది లేదు అన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు.
వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత కూడా వారం పాటు వైరస్ సోకే అవకాశాలు ఉన్నాయి. కనుక ప్రతి ఒక్కరు కూడా ఎల్లవేలలా జాగ్రత్తగా ఉండాలంటూ నిపుణులు సూచిస్తున్నారు. కరోనా వ్యాక్సిన్ గురించి ఉన్న అనుమానాలు పూర్తిగా పక్కకు పెట్టి వెంటనే కరోనీ వ్యాక్సిన్ ను వెంటనే వేయించుకోవాలని.. థర్డ్ వేవ్ సమయానికి కనీసం ఒక్క డోసు తీసుకున్నా కూడా చాలా ప్రయోజనం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే దేశ వ్యాప్తంగా కనీసం ఒక్క డోసు అయినా పూర్తి చేసేలా ప్లాన్ చేస్తున్నారు.