Weight Gain: బరువు పెరగడానికి 4 ప్రధాన కారణాలు ఇవే

Weight Gain: మంచి కూడా అతి మంచిది కాదు అంటారు. అంటే ఏది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే అన్ని విధాలుగా ఉత్తమం. మంచితనమే కదా అని అతి మంచిగా ఉంటే అవతలి వారికి అలుసు అవుతారు. అలాగే బరువు విషయంలో కూడా అతి బరువు ఆరోగ్యానికి హానికరం. కొందరు విపరీతమైన బరువు పెరుగుతూ నాకేంటీ నేను రాయిలా బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కాని అతి బరువు వల్ల అనారోగ్య సమస్యలు ముందు […].

By: jyothi

Published Date - Tue - 31 August 21

Weight Gain: బరువు పెరగడానికి 4 ప్రధాన కారణాలు ఇవే

Weight Gain: మంచి కూడా అతి మంచిది కాదు అంటారు. అంటే ఏది ఎంత వరకు ఉండాలో అంత వరకు ఉంటేనే అన్ని విధాలుగా ఉత్తమం. మంచితనమే కదా అని అతి మంచిగా ఉంటే అవతలి వారికి అలుసు అవుతారు. అలాగే బరువు విషయంలో కూడా అతి బరువు ఆరోగ్యానికి హానికరం. కొందరు విపరీతమైన బరువు పెరుగుతూ నాకేంటీ నేను రాయిలా బాగానే ఉన్నాను అనుకుంటూ ఉంటారు. కాని అతి బరువు వల్ల అనారోగ్య సమస్యలు ముందు ముందు వస్తాయని వారికి తెలియదు పాపం. అధిక బరువు పెరగడం అనేది ఖచ్చితంగా వారి అలవాట్ల వల్లే ఉంటుంది. ఒక సర్వే ప్రకారం నూటికి 85 శాతం అధిక బరువుకు కారణం వారి అలవాట్లు కాగా 10 శాతం మంది అధిక బరువుకు హార్మోన్‌ ల సమస్యగా గుర్తించారు. అయిదు శాతం మంది అధిక బరువుకు కారణం అనారోగ్య సమస్యలుగా గుర్తించారు. ఆ 85 శాతం మంది బరువు పెరగడానికి ప్రధానంగా 4 కారణాలను నిపుణులు గుర్తించారు. ఇప్పుడు అవేంటో చూద్దాం..

 

  1. ఆహారపు అలవాట్లు.. చాలా మంది అతిగా తింటే బరువు పెరిగేస్తున్నాం అని తినకుండా ఉంటారు. తినకుండా ఉంటే ఆకలి వేస్తుంది కదా ఆ సమయంలో ఏదో ఒక జంక్ ఫుడ్‌ కొద్దిగే కదా అని తినేస్తారు. అలా జంక్‌ ఫుడ్స్‌ వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం క్రమం తప్పకుండా చేస్తున్నాం మన బాడీని జంక్ ఫుడ్ ఏం చేస్తుందిలే అనుకుంటే పొరపాటే. జంక్ ఫుడ్‌ అనేది ఖచ్చితంగా శరీరంపై అంతో ఇంతో ఎంతో ప్రభావం అయితే చూపుతుంది. కనుక జంక్ ఫుడ్‌ కు దూరంగా ఉన్నప్పుడే అధిక బరువు పెరగకుండా ఉంటారు.

 

  1. అధిక బరువుకు కారణం నిద్ర కూడా ఒక కారణంగా నిపుణులు చెబుతున్నారు. అధికంగా నిద్ర పోతే బరువు పెరగడం కాదు.. నిద్ర సరిగ్గా లేకుంటే అధిక బరువు పెరుగుతున్నారట. ఈ విషయంను నిపుణులు కొంత మందిని తీసుకుని అద్యయనం చేసి మరీ నిర్థారించారు. మద్య వయస్కుడు కనీసం 7 నుండి 8 గంటలు అయినా నిద్ర పోతే తప్పితే బాడీలోని మెటబాలిజం సరిగ్గా పని చేయదు. సరిగా నిద్ర లేని వారికి మెటబాలిజం పని చేయకుంటే బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరైన సమయంకు పడుకుని ఉదయాన్నే నిద్ర లేవడం వల్ల శరీరంలోని అన్ని పార్ట్‌ లు కూడా బాగా పని చేసి జీర్ణ వ్యవస్థ నుండి మొదలుకుని అన్ని వ్యవస్థలు సరిగ్గా వర్క్ చేసి బరువు పెరగకుండా ఉంటారు.

 

  1. బరువు పెరుగుతున్నాం అంటూ కొందరు ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ చేయకుండా నేరుగా లంచ్ చేస్తారు. అలా చేయడం కూడా కరెక్ట్‌ కాదు. మినిమం బ్రేక్‌ ఫాస్ట్‌ ను తీసుకోవాలి. సరైన సమయంకు ఆహారం తీసుకోకుంటే శరీరం యొక్క మెటబాలిజం దెబ్బతిని బరువు పెరిగే అవకాశం ఉంటుంది. ఉదయం బ్రేక్‌ ఫాస్ట్‌ మద్యాహ్నం లంచ్ రాత్రి డిన్నర్‌ అన్ని తీసుకోవాలి. కాని మితంగా తీసుకోవాలి. తీసుకున్న ఆహారం కు తగ్గట్లుగా వ్యాయామం చేయాల్సిందే అప్పుడే బరువు పెరగకుండా ఉంటారు.
  2. అధిక బరువుకు ఒక కారణం నీరు కూడా. ఔను నీరు తక్కువగా తీసుకుంటే శరీర జీర్ణ శక్తి సరిగా పని చేయదు. తిన్న ఆహారం ఎప్పుడైతే సరిగా జీర్ణం అవ్వదో అప్పుడు అధిక బరువుకు కారణం అవుతుంది. అందుకే సాధ్యం అయినంతగా ఎక్కువ గా నీరు తాగాలి. వయసును బట్టి.. తినే ఆహారంను అనుసారంగా రోజుకు అయిదు నుండి 10 లీటర్ల నీరు అయినా మనం శరీరంలో పోయాల్సిందే. అలా తాగితేనే అధిక బరువు పెరగకుండా ఉంటారు.

     

    ఈ నాలుగు చిన్న చిట్కాలు పాటించండి.. ఖచ్చితంగా మీరు అధిక బరువు పెరుగకుండా ఉంటారు.

    అధిక బరువు

    ఆరోగ్య సలహాలు

    weight loss

    weight loss tips

    Over weight

    health care tips

    telugu health tips

    arogyam in telugu

    latest health news

    ayurvedam telugu

     

Read Today's Latest Health News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Tags

Latest News

Related News