Breastfeeding: ప్రపంచంలోని ప్రతీ మహిళ కోరుకునేది ఒక్కటే. అదే అమ్మతనం. పెళ్లైన తరువాత వచ్చే పసుపు, కుంకుమలను ఐదోతనంగా స్త్రీలు భావిస్తారు. అయితే ఆ తరువాత వచ్చే అమ్మతనానికి అంతకు మించిన ప్రేమను అందిస్తారు. దీనికి కారణం నవమాసాలు తనలోనే మోసి, కనడం వల్ల బిడ్డతో తల్లికి ఎనలేని అనుబంధం ఏర్పడుతుంది. అయితే అపురూపమైన భావనను అనుభవించేందుకు ప్రతీ మహిళా సిద్ధంగా ఉంటుంది. అయితే పిల్లలకు జన్మ నివ్వడం ఒక ఎత్తు అయితే వారిని పెంచి పెద్దవారిని చేయడం మరో ఎత్తు.
ఇందులో మొదటిది సరిగా ఉంటే అంతా మంచిగానే ఉంటుంది. అదే పిల్లలకు పాలు పట్టడం. సాధారణం తల్లికి బిడ్డ పుట్టిన తరువాత వారిలో మాతృత్వం పురుడు పోసుకుంటుంది. అప్పుడే వారి పాలిండ్లలోకి పాలు వస్తాయి. వాటిని పిల్లలకు సరైన సమయంలో, సరైన విధంగా ఇవ్వడం ఎంతో ముఖ్యం. ఈ ఫీడింగ్ ను కనీసం ఆరు నెలలు నుంచి ఏడాది పాటు ఇస్తే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. చిన్నారికి కావాల్సిన పోషకాలు అన్నీ తల్లి చనుబాలలో ఉంటాయని డాక్టర్లు చెప్తున్నారు. బిడ్డకు అవసరమైన కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, కొవ్వు పదార్ధాలు అన్నీ ఉంటాయి. అందుకే అమ్మ పాలను మించిన ఆహారం బిడ్డకు మరోకటి ఉండదు. ఈ పాలలో వీటితో పాటు ఆ పసికందు పెరుగుదలకు అవసరమైన మినరల్స్, విటమిన్లు ఉంటాయి. అందుకే ప్రతీ రోజు బిడ్డకు పాలు ఇవ్వాలని అంటున్నారు.
అయితే బిడ్డకు ఈ పాలు పట్టే సమయంలో కొన్ని జాగ్రత్తలు అవసరమని చెప్తున్నారు నిజానికి తొలికాన్పు మహిళలకు అయితే అంతా కొత్తగానే ఉంటుంది. పిల్లలు ఏడిస్తే కేవలం వారు ఆకలి అని మాత్రమే ఏడవరు అని గ్రహించాలి. చాలా సందర్భాల్లో పిల్లలకు అనుకూలమైన వాతావరణం లేకపోయినా పెద్ద పేట్ల ఏడవడం ఖాయం. అందుకే తల్లి పాలు పట్టిన నిర్ణీత సమయం తరువాత తిరిగి వారి ఆకలి తీరిస్తే బాగుంటుంది. పుట్టిన నెలలోపు చిన్నారులకు ప్రతీ 2 గంటలకు ఓసారి గంట కొట్టినట్టుగా పాలు ఇవ్వల్సి ఉంటుంది. అప్పుడే వారిలో ఉన్న ఆత్మారాముడు చల్లబడుతాడు. అయితే ప్రతీసారి రెండు గంటలకు ఓసారి ఇవ్వాలా అంటే అవసరం లేదు. అంచనా ప్రకారం ఇస్తే సరిపోతుంది.
పిల్లలు తమ చిన్ని నోటితో జన్మనిచ్చిన తల్లి రొమ్ములను అందుకుని పాలు తాగుతారు. అయితే వాటి పరిమాణం, సైజులను బట్టి అర్ధగంట నుంచి సుమారు 45 నిమిషాల కన్న ఎక్కువే పట్టొచ్చు. కానీ ఆ సమయాన్ని తల్లి విసుగు లేకుండా వేచి చూడాలి. ఆ సమయంలోనే చిన్నారికి పూర్తిస్థాయిలో పోషకాలు అందుతాయి. శిశువుకు పాలు పట్టే సమయంలో పొజిషన్ సరిపోయేలా చూసుకోలి. పిల్లలు సౌకర్యవంతంగా ఉంటేనే వారు పాలు సులభంగా తాగగలరు. లేకపోతే కొద్దిసేపటికే వారికి చికాకు వచ్చి మధ్యలో రొమ్ము విడిచి సగం కడుపుతో వచ్చేస్తారు.
పిల్లలు పుట్టిన కొత్తల్లో తల్లులకు పాలు ధారలుగా కారిపోయి.. వృద్ధా అవుతుంటాయి. ఎక్కువై కొన్నిసార్లు గడ్డలు కూడా కడుతుంటాయి. ఇవి అన్నీ సహజమే. ఈ సమయంలో పిల్లలకు పాలు ఇస్తే అంతా సెట్ రైట్ అవుతుంది. రొమ్ముల్లో వచ్చే నొప్పికి ఇంతకు మించిన ఉత్తమ పరిష్కారం మరోకటి ఉండదు. లేకపోతే ఆ నొప్పిని తట్టుకోవడం కష్టం అని అనుభవించిన తల్లులు చెప్తున్నారు. పిల్లలకు పాలు ఇవ్వడం ఎంత ముఖ్యమో.. ఆ సమయంలో తల్లి పౌష్టికాహారం తీసుకోవడం కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే తల్లి తీసుకునే ఆహారం ప్రభావమే.. పిల్లలపై కూడా పడుతుంది. అందుకే వారికి మంచి పోషకాలు అందించాలి అంటే మంచి ఆహారం తీసుకోవాలి.
పాలిచ్చే తల్లులకు స్తనాల్లో నొప్పి వస్తుంది అంటే డాక్టర్ ను సంప్రదించాలి.