Health Tips : బరువు తగ్గాలని రన్నింగ్ చేసేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Health Tips: చాలా మంది పరగడుపున రన్నింగ్, జాగింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పరగడుపున పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వుల్ని కరిగించడానికి తగిన ఇంధనం మనం మన శరీరానికి అందించనట్లే లెక్క..

By: jyothi

Updated On - Wed - 21 September 22

Health  Tips : బరువు తగ్గాలని రన్నింగ్ చేసేవారు ఈ జాగ్రత్తలు తప్పనిసరి

Health Tips: చాలా మంది పరగడుపున రన్నింగ్, జాగింగ్ లాంటివి చేస్తుంటారు. అయితే ఇలా చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే పరగడుపున పరిగెత్తడం వల్ల శరీరంలోని కొవ్వుల్ని కరిగించడానికి తగిన ఇంధనం మనం మన శరీరానికి అందించనట్లే లెక్క. దాంతో కొవ్వులు కరగకపోగా.. మనం మరింత నీరసించిపోయే ప్రమాదం ఉంది. కాబట్టి కార్బోహైడ్రేట్లు అధికంగా లభించే పండ్లు, నట్స్‌, పాలు-పాల పదార్థాలు, పప్పులు, బ్రెడ్‌, కాయధాన్యాలు.. వంటివి గంట ముందే తీసుకొని ఆపై రన్నింగ్‌ చేయమంటున్నారు నిపుణులు. ఇక పరిగెత్తడానికి గంట ముందు, తర్వాత నీళ్లు తాగడమూ ముఖ్యమేనని గుర్తు పెట్టుకోండి.

చేతులు సరిగ్గా..

పరిగెత్తే క్రమంలో భుజాలకు మోచేతులు 90 డిగ్రీల కోణంలో ఉండాలట. అంతేకాదు.. వాటిని మరీ పైకి లేపి కాకుండా.. పొట్టకు సమాంతరంగా ఉంచి భుజాలు కదిలేలా ముందుకు, వెనక్కి అంటూ పరిగెత్తుతుంటే త్వరగా అలసిపోకుండా, గాయాల పాలుకాకుండా జాగ్రత్తపడచ్చు. అంతేకాదు.. ఇలా దీనివల్ల పరుగు వేగం కూడా అదుపులో ఉంటుందట! ఇక దీంతో పాటు పరిగెత్తే క్రమంలో పెద్ద పెద్ద అడుగులు వేయకుండా చూసుకోవడం వల్ల కూడా మన శరీరంలోని శక్తిని కాపాడుకుంటూ ముందుకు సాగచ్చు..

దుస్తుల్లో జాగ్రత్తలు..

ఏ కాలంలో రన్నింగ్‌ చేసినా వదులైన దుస్తులు, పొట్టిగా ఉండేవి అస్సలు వద్దంటున్నారు నిపుణులు. ఎందుకంటే వదులైన దుస్తుల కారణంగా పరిగెత్తే క్రమంలో గాయాలు కావచ్చు.. కాబట్టి శరీరానికి అతికినట్లుగా ఉండే కాటన్‌ దుస్తులు లేదా మెత్తటి క్లాత్‌తో తయారుచేసిన జిమ్‌ వేర్‌ను ఎంచుకుంటే ఎప్పుడైనా కంఫర్టబుల్‌గా ఉండచ్చు.. ఇక వీటితో పాటు ఫిట్‌గా, అడుగుభాగంలో మెత్తగా ఉండే సోల్‌/స్ప్రింగ్స్‌ ఉండే రన్నింగ్‌ షూస్‌ని ఎంచుకుంటే పరిగెత్తడం మరింత సులభమవుతుంది.

వేగంగా పరుగెత్తొద్దు..

త్వరగా బరువు తగ్గిపోవాలని వేగంగా పరిగెడుతున్నారా? నిజానికి ఇది అస్సలు మంచిది కాదంటున్నారు నిపుణులు. ఎందుకంటే వేగంగా పరిగెత్తడం అనేది అప్పటిదాకా మన శరీరానికి అలవాటు లేదు. అలాంటిది ఒక్కసారిగా వేగంగా రన్నింగ్‌ చేస్తే గాయాలయ్యే ప్రమాదం ఉంది.. దీని ద్వారా శ్వాసక్రియ రేటు బాగా పెరుగుతుంది. అది ఆరోగ్యానికీ మంచిది కాదు. కాబట్టి పరుగు పెట్టాలనుకుంటే ముందు నెమ్మదిగా నడక మొదలుపెట్టాలి. ఆపై క్రమంగా వేగాన్ని పెంచుకుంటూ పోవాలి.

 

Also Read : Business Idea : తక్కువ పెట్టుబడితో అదిరిపోయే బిజినెస్.. నెలకు రూ.70వేలు ఆదాయం

 

Also Read : Leadership: ఐప్యాక్ ఆలోచనను రద్దు చేసుకున్న సీఎం జగన్

Related News