Water : మనిషి ఎంత ఆహారం తీసుకున్నప్పటికీ వాటర్ లేకపోతే ఉండలేడు. ప్రతీ ఒక్కరికి నీరు ముఖ్యం. జీవనాధారంగా పరిగణించబడే నీటిని ప్రతీ ఒక్కరు ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు చెప్తుంటారు. అయితే, చాలా మంది వాటర్ తీసుకోవడం పట్ల నిర్లక్ష్యం వహిస్తుండటం మనం చూడొచ్చు. అలా మంచి నీళ్లు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తే వారికే ఇబ్బందులు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే, ప్రతీ రోజు ఎన్ని గ్లాసుల వాటర్ తీసుకోవాలంటే..
ప్రజెంట్ బిజీ లైఫ్‌లో అందరూ దాదాపుగా ప్రతీ పనిని చాలా స్పీడ్‌గా చేసేయాలనుకుంటున్నారు. ఈ క్రమంలోనే అసలు పనులు మరిచిపోతున్నారు. ఫుడ్ తీసుకోవడం మరిచిపోవడంతో పాటు వాటర్ తాగడం కూడా మరిచిపోతున్నారు. కాగా, హ్యూమన్ బాడీలో వాటర్ తగినంత స్థాయిలో లేకపోతే అలసట వస్తుందని హెల్త్ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. వాటర్ తగు పాళ్లలో తీసుకోపోతే కనకు హ్యూమన్ బాడీ డీ హైడ్రేట్ అవుతుంది. అలా డీ హైడ్రేషన్‌కు గురికాక మునుపే నీటిని తీసుకోవాలి. ఇకపోతే నీరు తగుపాళ్లలో తీసుకోకపోతే కనుక హ్యూమన్ బాడీపై స్కిన్, ఐస్ పొడిబారుతుంటాయి. కండరాల్లో నొప్పులు వచ్చే చాన్సెస్ ఉంటాయి.
హెల్దీగా ఉన్న ప్రతీ ఒక్కరు ప్రతీ రోజు ఎనిమిది గ్లాసుల వాటర్ తీసుకోవాలని నిపుణులు అంటున్నారు. డాక్టర్స్ కొందరు ప్రతీ రోజు కంపల్సరీగా నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తసీుకోవాలని చెప్తుంటారు. మార్నింగ్ టైమ్స్‌లోనూ రెండు గ్లాసుల నీళ్లు తాగాలట. ఎర్లీ మార్నింగ్‌లోనే వాటర్ తీసుకోవడం వలన మీ శరీరం ఉత్తేజమయం అవడంతో పాటు బాడీ నుంచి విషపదర్థాలన్నీ కూడా బయటకు వెళ్లిపోతాయని నిపుణులు చెప్తున్నారు. స్నానం చేయడానికి ముందర కూడా గ్లాసు వాటర్ తీసుకోవాలని అంటున్నారు.
Water
అలా బాతింగ్‌కు ముందర వాటర్ తీసుకోవడం వలన హ్యూమన్ బీపీ కంట్రోల్‌లో ఉంటుంది. ఇకపోతే స్లీపింగ్‌కు ముందర కూడా కంపల్సరీగా వాటర్ తీసుకోవాలట. అలా చేయడం వల్ల హార్ట్ అటాక్ వచ్చే చాన్సెస్ తగ్గుతాయట.అయితే, అందరూ ప్రతీ రోజు నాలుగు నుంచి ఐదు లీటర్ల నీటిని తీసుకోవడం కష్టమే. వారి వారి హెల్త్ కండీషన్స్, వెయిట్‌ను బట్టి వాటర్ భిన్న పరిమాణాల్లో తీసుకోవాలి.
ప్రతీ వ్యక్తి 20 కేజీల బరువును బట్టి ఒక లీటర్ వాటర్ తీసుకోవాలని అనేక పరిశోధనల్లో తేలిందని పరిశోధకులు చెప్తున్నారు. ఈ క్రమంలోనే ఉదాహరణకు 70 కేజీల వెయిట్ ఉన్న పర్సన్ 3.5 లీటర్ల నీటిని తీసుకోవాలి. హ్యూమన్ బాడీలో వాటర్ కంటెంట్ 65 పర్సెంట్ ఉంటుందన్న సంగతి అందరికీ విదితమే. కాబట్టి వాటర్ కంటెంట్ సమృద్ధిగా ఉంచేందుకుగాను వాటర్ ఎప్పుడూ తీసుకుంటూనే ఉండాలి.