Weight Loss : ప్రొటీన్.. మనిషి శరీర నిర్మాణంలో కీలక పాత్ర పోషించే మ్యాక్రో న్యూట్రియెంట్. అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే శరీర బరువును తగ్గించుకోవానుకునేవారు ఎగ్స్ తోపాటు ప్రొటీన్ అధికంగా ఉండే మరికొన్ని ఫుడ్స్ కూడా తీసుకోవటం బెటర్. నిజం చెప్పాలంటే ప్రొటీన్ కంటెంట్ విషయంలో ఈ వెజిటేరియన్ డైట్ తో పోల్చితే కోడి గుడ్లు దేనికీ పనికి రావని చెబుతున్నారు. ఒక ఎగ్ మహా అయితే 6 గ్రాముల ప్రొటీన్ ని మాత్రమే ఇస్తుంది. కానీ కొన్ని చెట్ల గింజలు దానికన్నా ఎక్కువ ప్రోటీన్ ని అందిస్తాయి. అవేంటో చూద్దాం..
అర కప్పు చిక్కుడు విత్తనాలను లేదా కాయ ధాన్యాలను తింటే చాలు. 8 గ్రాముల ప్రొటీన్ మన సొంతమవుతుంది. మన దేశంలో 65 వేలకు పైగా రకాల కాయ ధాన్యాలు ఉన్నాయి. కాబట్టి వారం మొత్తమ్మీద వీటిలో కనీసం ఐదు రకాల కాయ ధాన్యాలనైనా తినాలి. పప్పు, చారు, ఇడ్లీ, దోశ, వడ, కిచిడీ ఇలా.. వివిధ రూపాల్లో తీసుకోవాలి.
Weight Loss : for Weight Loss these seeds are better
30 గ్రాముల గుమ్మడి కాయ గింజలను తింటే 8.5 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. ఇందులో పీచు పదార్థం, జింక్, ఐరన్, పొటాషియం, మెగ్నీషియం, సిలీనియం, కాపర్ తదితరాలు ఉంటాయి. ఈ గింజలను సలాడ్లపై చల్లుకొని గానీ లేదా డైరెక్టుగా విత్తనాలను గానీ తినొచ్చు.
అర కప్పు సెనగ గింజల్లో 8 గ్రాముల ప్రొటీన్ దొరుకుతుంది. వీటిని మన దేశంలో ఎక్కువ మంది నిత్యం వాడుతుంటారు. టిఫిన్ కి చట్నీ రూపంలో గానీ లేదా ఉప్మాలో ఒక భాగంగా గానీ లేదా కూర వండుకొని గానీ తింటారు. పచ్చి సెనగ కాయలు కూడా బాగుంటాయి. వాటిని ఉడకబెట్టుకొని తిన్నా భలే టేస్టీగా అనిపిస్తాయి.
రెండు టేబుల్ స్పూన్ల బాదం వెన్నలో 7 గ్రాముల ప్రొటీన్ ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి కావాల్సిన మంచి కొవ్వును అందిస్తుంది. ఆల్మండ్ బటర్ కోస్ట్ ని గొప్ప బ్రేక్ ఫాస్ట్ ఆప్షన్ గా ఎంచుకోవచ్చు. వర్కౌట్ కి ముందు స్నాక్స్ లాగా కూడా తినొచ్చు.
ప్రొటీన్ ఎక్కువ మొత్తంలో ఉండే వనరు సోయాబీన్. ఒక కప్పు సోయాబీన్ లో 29 గ్రాముల ప్రొటీన్ లభిస్తుంది. దీన్ని ఎక్కువ మంది కూర వండుకొని తింటారు. పచ్చి సోయాబీన్ ని ఉడకబెట్టుకొని కూడా తీసుకోవచ్చు. విత్తనాలతో చారు పెట్టుకోవచ్చు.