Sleep Deprivation మనిషి శరీరం చాలా సున్నితమైనది. కాని దాన్ని కొందరు సరిగా చూసుకోకుండా రాయిలా మార్చుకుని కష్టపడటం లేదా లేజీగా తయారు అయ్యి శరీరాన్ని పట్టించుకోవడం మానేస్తారు. అందువల్ల తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయి. మనిషికి వచ్చే ఎన్నో దీర్ఘకాలిక సమస్యలకు మరియు ప్రాణాంతక అనారోగ్య సమస్యలకు కారణం 75 శాతం వరకు వారు అనుసరించే జీవన విధానం అంటూ నిపుణులు చెబుతున్నారు. సరిగ్గా అన్నం తినడంతో పాటు సరైన సమయంకు విశ్రాంతి తీసుకున్నప్పుడే శరీరం అన్ని విధాలుగా మెరుగ్గా పని చేస్తుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు మనను మృత్యు ఒడికి తీసుకు వెళ్తాయి అనడంలో సందేహం లేదు. చాలా మంది నిద్ర లేమితో బాధ పడుతూ ఉన్నామని అంటూ ఉంటారు.
యవ్వనం లేదా ఆ తర్వాత ఏజ్ లో ఉన్న వారు ఖచ్చితంగా రోజుకు ఏడు నుండి తొమ్మిది గంటల నిద్ర ఖచ్చితంగా అవసరం. ఆ నిద్ర లేకుంటే మాత్రం తీవ్రమైన అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది. నిద్ర సరిగ్గా లేని వారిలో దీర్ఘ కాలిక సమస్యలు తలెత్తుతాయి. ప్రతి రోజు కనీసం నిద్ర పోని వారిలో మెటబాలిజం దెబ్బ తింటుందట. అలా మెటబాలిజం దెబ్బ తినడం వల్ల తిన్న తిండి మరియు తాగిన నీరు కూడా శరీరానికి పూర్తి స్థాయిలో వినియోగం అవ్వదు. అలా అవ్వడం వల్ల శరీరం నీరసించి పోడంతో పాటు అనేక అనారోగ్య సమస్యలు మొదలు అవుతాయి. ముఖ్యంగా శరీరంలో మెటబాలిజం దెబ్బ తింటే రక్త ప్రసరణ నుండి మొదలుకుని పేగుల్లో కొవ్వు పదార్థాలు పేరుకునే వరుకు అనేక సమస్యలు ఎదురవుతాయి. నిద్ర సరిగా పోవడం వల్ల ఆహారం సరిగ్గా జీర్ణం అవ్వడంతో పాటు పలు రకాల ప్రయోజనాలు ఉంటాయి. అప్పుడు మెటబాలిజం దెబ్బతినదు.
తద్వార అనేక అనేకానేక సమస్యలు దరి చేరవు. నిద్ర సరిగ్గా పోకుంటే మెదడుపై ప్రభావం పడుతుంది. నిద్ర పోయిన సమయంలో మెదడుతో పాటు శరీరంలోని పలు భాగాలు విశ్రాంతి తీసుకుటాయి. అలా కొద్ది సమయం విశ్రాంతి తీసుకోవడం వల్ల శరీర వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది. మన శరీరం కూడా ఒక యంత్రం తరహాలో అమరిక కలిగి ఉంటుంది. ఆ మెషన్ ను కాస్త విశ్రాంతి ఇచ్చి మరీ నడిపితేనే ఎలా అయితే ఎక్కువ కాలం మన్నుతుందో అలాగే ఈ శరీరం కూడా కాస్త జాగ్రత్తగా కాపాడుకుంటూ విశ్రాంతి ఇస్తూ అంటే నిద్ర ఎక్కువగా పోతూ ఉండటం వల్లే ఎక్కువ కాలం చెడి పోకుండా ఉంటుందని నిపుణులు మెషన్ తో శరీరాన్ని పోల్చుతూ చెబుతూ ఉంటారు.
నిద్ర పోకుండా నాలుగు నుండి ఆరు రోజుల వరకు ఉండగలరు కాని అంతకు మించి ఉంచితే మాత్రం ప్రాణాలకే అపాయం. అందుకే ప్రతి ఒక్కరు కూడా రోజుకు కనీస సమయం అయినా నిద్ర పోవాలని నిపుణులు సూచిస్తూ ఉంటారు. తల నొప్పి నుండి మొదలుకుని గుండె నొప్పి వరకు అనేక సమస్యలు నిద్ర లేమి వల్లే వస్తాయి. కనుక నిద్ర అనేదాన్ని లైట్ తీసుకుంటే జీవితంలో చాలా పెద్ద తప్పు చేసినట్లే అంటూ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆహారం లేకున్నా శరీరం కొన్నాళ్ల వరకు తట్టుకుంటుంది. వాటర్ తాగి లేదా ఆకులు మరేదో తిని జీవితాన్ని గడుపవచ్చు. కాని ఎక్కువ కాలం పాటు నిద్ర లేకుంటే మాత్రం ప్రాణాలకే అపాయం. నిద్ర లేమి సమస్య తో బాధ పడుతూ ఉంటే ఖచ్చితంగా అందుకు సంబంధించిన వైధ్యులను సంప్రదించి వెంటనే పరిష్కార మార్గంను తెలుసుకోవాలి. నెలల తరబడి రెండు మూడు గంటల నిద్ర మాత్రమే పోతే మాత్రం ముందు ముందు కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ వైధ్యులు హెచ్చరిస్తున్నారు.