Therapy: కండరాల నొప్పులకు ఏ థెరపీ మంచిదో తెలుసుకోండి..

Therapy: కాలు బెణికినా, టీకాలు వేసుకున్నా హాట్, కూల్ థెరపీలు చేస్తుంటాం. ఇది ప్రాచీన వైద్యం. నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ వైద్యాన్ని నాటు నాటు వైద్యులు మొదలుకుని, నేటి కార్పొరేట్ వైద్యుల వరకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ హాట్ థెరపీ, కూల్ థెరపీ ఎలా సమయంలో చేయాలి..? ఎలా చేయాలి..? వీటిల్లో ఎలాంటి రకాలు ఉంటాయో తెలుసుకుందాం. కండరాలు, కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడానికి ఈ రెండు థెరపీలను చేస్తారు. వీటిల్లో వేడి థెరపీతో […].

By: jyothi

Updated On - Fri - 3 December 21

Therapy: కండరాల నొప్పులకు ఏ థెరపీ మంచిదో తెలుసుకోండి..

Therapy: కాలు బెణికినా, టీకాలు వేసుకున్నా హాట్, కూల్ థెరపీలు చేస్తుంటాం. ఇది ప్రాచీన వైద్యం. నొప్పుల నుంచి ఉపశమనం పొందడానికి ఈ వైద్యాన్ని నాటు నాటు వైద్యులు మొదలుకుని, నేటి కార్పొరేట్ వైద్యుల వరకు ఉపయోగిస్తున్నారు. అయితే ఈ హాట్ థెరపీ, కూల్ థెరపీ ఎలా సమయంలో చేయాలి..? ఎలా చేయాలి..? వీటిల్లో ఎలాంటి రకాలు ఉంటాయో తెలుసుకుందాం.

కండరాలు, కీళ్ల నొప్పులు, వాపును తగ్గించడానికి ఈ రెండు థెరపీలను చేస్తారు. వీటిల్లో వేడి థెరపీతో కండరాలు, కీళ్ల నొప్పులు తగ్గుతాయి. నొప్పి ఉన్న ప్రాంతంలో హీట్ బ్యాగ్ కాపాడం చేస్తే ఆ ప్రదేశంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. దీని వల్ల కణజాలానికి తగినంత రక్తం అంది నొప్పి తగ్గుతుంది. అలాగే కండరాలు మృదువుగా మారడానికి ఈ హీట్ థెరపీ చక్కగా పని చేస్తుంది. అయితే ఈ హీట్ థెరపీలోనూ పొడి వేడి, తేమ వేడి అనే రెండు రకాలు ఉన్నాయి. వస్త్రాన్ని వేడి చేయడం పొడివేడి. వేడి నీటిలో గుడ్డను నానబెట్టడం తేమవేడి. వీటిల్లో తేమ వేడి థెరపీ వల్ల ప్రయోజనం ఎక్కువగా ఉంటుంది.

కూల్ థెరపీతో రక్త నాళాలు కుచించుకుపోతాయి. దీని వల్ల రక్త ప్రసరణ తగ్గుతుంది. కాళ్లు బెణికినా, వాపు, గాయం అయినా ఈ కూల్ థెరపీ చేస్తారు. అయితే 48 నుంచి 72 గంటల ముందు కూల్ థెరపీ చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. రోజుకు 5 నుంచి 10 నిమిషాలు రెండు, మూడు రోజులు ఇలా కూల్ థెరపీ చేస్తే బెణుకు, గాయాలు త్వరగా తగ్గిపోతాయనడంలో సందేహం లేదు. అయితే వాపు, గాయం ఉన్న ప్రాంతంలో నేరుగా ఐస్ వేసి థెరపీ చేయకూడదు. వాటికి కొద్ది దూరంలో అప్లై చేయాలి. ఐస్ గడ్డను నేరుగా కాకుండా పాలిథిన్ బ్యాగ్ లో వేసి థెరపీ చేయడం మేలు.

కీళ్ల, కండరాల నొప్పులు దీర్ఘకాలిక నొప్పులు బాధించేవాళ్లు వేడి థెరపీ చాలా ఉపయోగకరం. మానని గాయాల నొప్పి, కండరాల వాపు ఇలా ఏ నొప్పి ఉన్నా వెచ్చని బ్యాగ్‌తో కాపడం పెడితే ఉపశమనం ఉంటుంది. చీలమండలం, ఆపరేషన్ల వల్ల ఏర్పడే నొప్పులకు హాట్ కంప్రెస్‌లు అద్భుతంగా పని చేస్తుంది. వేడి నీటిని నానబెట్టేటప్పుడు, ప్రభావిత ప్రాంతాన్ని నీటిలో 10-15 నిమిషాలు ఉంచి, ఆపై దాన్ని తీసివేయండి. కొన్ని నిమిషాల తర్వాత, ప్రభావిత ప్రాంతంపై మళ్లీ నీరు పోయాలి. ఇలా చేయడం ద్వారా నొప్పులు తగ్గడంతోపాటు కండరాలు మృదువుగా మారుతాయి.

Tags

Latest News

Related News