Coconut oil: కేరళ వారు కొబ్బరి నూనె వంటకాల వల్ల ఏ ప్రయోజనాలు పొందుతున్నారో తెలిస్తే మీరు ట్రై చేస్తారేమో

Coconut oil : కేరళ స్థానికులు వంటలను ఎక్కువగా కొబ్బరి నూనెతో చేస్తారు. ఏ కూర అయినా కొబ్బరి నూనెతో చేసి ఆ రుచిని వారు ఆస్వాదీస్తూ ఉంటారు. కాని మనం మాత్రం కొబ్బరి నూనె వంట అంటే బాబోయ్‌ నీకో దండం.. పస్తులు అయినా ఉంటాను కాని ఆ కొబ్బరి నూనె వంటను తినను అంటాం. కొబ్బరి నూనె అంటే జుట్టుకు పెట్టుకుంటారు కాని ఇలా వంటి చేయడం ఏంట్రా బాబు అంటూ తెలుగు రాష్ట్రాల్లో […].

By: jyothi

Published Date - Tue - 23 November 21

Coconut oil: కేరళ వారు కొబ్బరి నూనె వంటకాల వల్ల ఏ ప్రయోజనాలు పొందుతున్నారో తెలిస్తే మీరు ట్రై చేస్తారేమో

Coconut oil : కేరళ స్థానికులు వంటలను ఎక్కువగా కొబ్బరి నూనెతో చేస్తారు. ఏ కూర అయినా కొబ్బరి నూనెతో చేసి ఆ రుచిని వారు ఆస్వాదీస్తూ ఉంటారు. కాని మనం మాత్రం కొబ్బరి నూనె వంట అంటే బాబోయ్‌ నీకో దండం.. పస్తులు అయినా ఉంటాను కాని ఆ కొబ్బరి నూనె వంటను తినను అంటాం. కొబ్బరి నూనె అంటే జుట్టుకు పెట్టుకుంటారు కాని ఇలా వంటి చేయడం ఏంట్రా బాబు అంటూ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అనుకుంటూ ఉంటారు. కొత్త వారికి ఈ విషయాన్ని చెప్పే నమ్మక పోవచ్చు కూడా. కేరళ వారు ఇంతకు ఎందుకు కొబ్బరి నూనెతో వంట చేస్తారు అనేది అందరిని వేదిస్తున్న ప్రశ్న. కొందరు మాత్రం కేరళలో కొబ్బరి చెట్టు ఎక్కువగా ఉన్నాయి కనుక కొబ్బరి నూనె అధికంగా ఉంటుంది. ఆ కారణం వల్లే కొబ్బరి నూనెతో వంటలు చేస్తారు అనుకుంటూ ఉంటారు. కాని కేరళ వాసులు చాలా తెలివి కల్ల వారు అలాగే వారి జీవన విధానం అత్యంత అధునాతంగా ఉంటుంది. అయినా కూడా కొబ్బరి పాల వంటలే చేస్తూ ఉంటారు. వారు ఈ వంట నూనె కొనుగోలు చేయలేక కాదు… కొబ్బరి చెట్టు అధికంగా ఉండటం వల్ల అంతకు మించి కాదు. కేరళ వారు కొబ్బరి నూనెలో ఉన్న ఔషద గుణాలు మరియు ప్రయోజనాలు తెలుసుకున్నారు కనుకో కొబ్బరి చెట్లను పెంచుతున్నారు. కొబ్బరి పాల వంటను చేస్తున్నారు. కొబ్బరి నూనె వంటల వల్ల కేరళ వారు పొందుతున్న ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.


coconut oil

coconut oil



కొబ్బరి నూనె వంటలు ఈజీగా జీర్ణం అవుతాయి. జీర్ణ వ్యవస్థ బాగా పని చేయడంతో పాటు కొబ్బరి నూనెలో ఉన్న కొన్ని కారణాలు శరీరంలో ఉన్న కొవ్వును తొలగించడంతో పాటు జీర్ణ వ్యవస్థలో ఉన్న బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. కడుపులో మంట లేకుండా అల్సర్ మరియు ఇతరత్ర జీర్ణ క్రియలు సరిగ్గా జరిగేలా కొబ్బరి పాల వంట పని చేస్తుంది.

cooking with coconut oil

cooking with coconut oil



చర్మ సమస్యలు ఉన్న వారు కొబ్బరి పాల వంట తింటే కొన్నాళ్లకే మంచి నిగ నిగలాడే చర్మ సౌందర్యం పెరగుతూ ఉంది. అందుకే కేరళ వారి ముఖాలు ముఖ్యంగా అమ్మాయిల ముఖాలు చాలా నునుపుగా ఆకట్టుకునే విధంగా ఉంటాయి. లోనికి వెళ్లిన కొబ్బరి పాలు బయట చర్మం పై చాలా ప్రభావం చూపిస్తుంది. చర్మ సూర్య రష్మికి దెబ్బ తినకుండా కూడా కొబ్బరి పాల ఆహారం పని చేస్తుంది.

coconut milk for good skin

coconut milk for good skin



కొబ్బరి నూనెలో ఉన్న లారిక్ యాసిడ్‌ పలు ప్రయోజనాలను కలిగిస్తుంది. ముఖ్యంగా ఈ లారిక్ యాసిడ్‌ అనేది పళ్ల సమస్యలు మరియు పళ్ల పటిష్టం పై పని చేస్తుంది. రెగ్యులర్ గా కొబ్బరి నూనె ఆహారంతో పళ్లు చాలా కాలం పాటు మన్నికగా ఉంటాయి.

Coconut Oil & It’s Benefits

Coconut Oil & It’s Benefits

కొబ్బరి నూనె ను సహజంగా అయితే జుట్టుకు రాస్తారు. జుట్టు ఆరోగ్యంగా ఉండటం కోసం ఆయుల్ రాస్తారు. ఆయుల్‌ తో ఫుడ్ తినడం వల్ల కూడా జుట్టుకు పోషకాలు అందుతాయని నిపుణులు చెబుతున్నారు. ఈ సమయంలో జుట్టు కాలుష్యం బారిన పడి వీక్ అవుతుంది. కనుక రెగ్యులర్ గా కొబ్బరి పాల భోజనం చేసే వారికి ప్రయోజనం దక్కుతుంది.

Coconut Oil for hair

Coconut Oil for hair



చివరగా అధిక బరువు తో బాధ పడే వారు కొబ్బరి నూనె బోజనం కనీసం నెలన్నర నుండి రెండు నెలల వరకు చేయడం వల్ల మంచి ప్రయోజనాలు పొందవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. కొబ్బరి నూనెలో ఉన్న కారకాలు శరీరంలో ఉన్న వృదాగా ఉన్న కొవ్వును మరియు అధిక బరువుకు కారకం అయిన కారకాలపై ప్రభావం చూపిస్తుంది. కనుక రెగ్యులర్‌ గా కాకున్నా అప్పుడప్పుడు అయినా కొబ్బరి నూనె బోజనం చేయడం వల్ల ప్రయోజనం దక్కుతుందని నిపుణులు చెబుతున్నారు.

coconut oil for weight loss

coconut oil for weight loss

Tags

Latest News

Related News