Medicine For Cold & Heart Disease: జలుబు నుండి గుండె జబ్బు వరకు అన్నింటికి ఇదో అద్బుత ఔషదం

Medicine For Cold & Heart Disease: ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అల్లం వల్ల జలుబు వంటి చిన్న అనారోగ్య సమస్య నుండి మొదలుకుని గుండె జబ్బు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్య లు కూడా దూరం అవుతాయి అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా కూడా ఇది నిజం అంటూ ఆయుర్వేద గురువులు చెబుతున్నారు. అల్లం ను సరైన రీతిలో వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అల్లం టీ […].

By: jyothi

Published Date - Fri - 24 September 21

Medicine For Cold & Heart Disease: జలుబు నుండి గుండె జబ్బు వరకు అన్నింటికి ఇదో అద్బుత ఔషదం

Medicine For Cold & Heart Disease: ప్రతి ఒక్కరి వంటింట్లో ఉండే అల్లం వల్ల జలుబు వంటి చిన్న అనారోగ్య సమస్య నుండి మొదలుకుని గుండె జబ్బు వంటి అత్యంత ప్రమాదకరమైన అనారోగ్య సమస్య లు కూడా దూరం అవుతాయి అంటే నమ్మడానికి కాస్త కష్టంగానే ఉన్నా కూడా ఇది నిజం అంటూ ఆయుర్వేద గురువులు చెబుతున్నారు. అల్లం ను సరైన రీతిలో వాడటం వల్ల పలు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా ఉంటాయి. అల్లం టీ ని రోజు తాగే వారు తక్కువగా జబ్బు పడుతారనే సర్వే ఫలితం వచ్చింది అంటే అర్థం చేసుకోవచ్చు. అల్లం వల్ల కలిగే ప్రయోజనాలు చాలానే ఉన్నాయి కాని దాన్ని మనం మాత్రం ఎలా వాడాలో అలా వాడటం లేదు. అల్లంను ఎక్కువగా మన వాళ్లు నాన్ వెజ్ వంటల్లో మరియు బిర్యానీ వంటల్లో మాత్రమే వినియోగిస్తారు. అల్లం టీ తాగే వారు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు. కొందరు స్పెషల్‌ గా అల్లం టీ ను మాత్రమే తాగుతారు. నీటిలో అల్లం ముక్కను వేసి కనీసం పావు గంట పాటు మరుగబెట్టి కాస్త టీ పౌడర్ వేసి చిటికెడు చెక్కర వేయాలి. అలా చేసిన అల్లం టీ వల్ల పలు అనారోగ్య సమస్యలు దూరం అవుతాయని వైధ్యలు అంటున్నారు. అల్లం రసం ను రెగ్యులర్‌ గా తాగడం వల్ల గొంతు నుండి కడుపులో వరకు ఉన్న హానికారక బ్యాక్టీరియాలు తొలగించబడుతాయి.

ఇక రక్తనాళాల్లో పేరుకు పోయిన వ్యర్థాలను కూడా అల్లం టీ తొలగిస్తుందని పలు ప్రయోగాల్లో నిర్థారణ అయ్యింది. బరువు తగ్గాలనుకునే వారు అల్లం ను అధికంగా వాడటం వల్ల వృదా కొవ్వ శరీరం నుండి బయటకు వెళ్లి పోతుంది. ప్రతి రోజు కొవ్వు పదార్థాలను తిన్నా కూడా దాంతో పాటు అల్లం టీ లేదా అల్లం రసంను తీసుకోవడం వల్ల బ్యాలన్స్ అవుతుందట. ఇక వర్షా కాలంలో సీజనల్ జ్వరాలు వస్తూ పోతూ ఉంటాయి. అసలే కరోనా కాలం ఈ సమయంలో చిన్న జ్వరం వచ్చినా కూడా చుట్టు ఉన్న జనాలు కరోనా అనే భయంను వ్యక్తం చేసే అవకాశం ఉంది. అందుకే వర్ష కాలం ఉన్నన్ని రోజులు ఖచ్చితంగా అల్లంను ఆహారం లేదా మరో రకంగా అయినా తీసుకోవడం మంచిది. అల్లం రసం కనీసం రోజులో టీ స్ఫూన్ అయినా తాగడం వల్ల అద్బుతమైన ప్రయోజనాలను గుర్తించినట్లుగా నిపుణులు చెబుతున్నారు. జలుబు మరియు దగ్గు సమస్యలు వచ్చిన వెంటనే అల్లం రసం ను తీసుకోవాలి. సీజనల్‌ జ్వరాలు.. విష జ్వరాలు రాకుండా ఉండాలంటే ప్రతి రోజు కూడా అల్లం ను తీసుకోవాలి. ఏదైన ఫంక్షన్‌ లకు వెళ్లిన చోట ఫుడ్‌ తింటూ ఉంటాం.

 

ఆ సమయంలో ఫుడ్‌ పాయిజన్‌ అయినట్లుగా అనిపిస్తే వెంటనే టీ స్ఫూన్‌ అల్లం రసంలో తేనె ను కలుపుకుని తాగడం వల్ల అంతా సర్దుకుంటుంది. అజీర్తి సమస్య నుండి మలబద్దకం వరకు అనేక సమస్యలకు కూడా అల్లం రసం చెక్‌ పెడుతుంది. అల్లం రసంను ప్రతి రోజు ఉదయాన్నే పరిగడుపున తీసుకోవచ్చు. వారంకు సరిపోయే వధంగా పావు కేజీ అల్లంను తీసుకుని బాగా క్లీన్‌ చేసి చిన్న చిన్న ముక్కలుగా కోసి మరో సారి మంచి నీటితో కడగాలి. పావు కేజీ అల్లంలో రెండు కప్పుల  నీళ్లు పోయాలి. ఆ నీళ్లు ఒక కప్పు నీళ్లు అయ్యే వరకు మరగించాలి. ఆ తర్వాత ఆ నీటిని మరగబెట్టి ప్రతి రోజు ఉదయం మరియు రాత్రి పడుకునే సమయంలో టీ స్పూన్‌ తీసుకోవడం వల్ల అద్బుత ప్రయోజనం చేకూరుతుంది. కషాయం తరహాలోనే ఉండే అల్లం రసం ఆ తరహాలోనే ప్రయోజనాలను కలిగి ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరు ఇలా అల్లం రసంను తయారు చేసుకుని ఆరోగ్యంను కాపాడుకుంటారని ఆశిస్తున్నాం.

Related News