Biryani Free : ఆకలితో ఉన్నప్పుడు అన్నం పెడితే చాలు. అదే పది వేలు. పుణ్యం కూడా. అందుకే అన్ని దానాల కన్నా అన్న దానం మిన్న అన్నారు. అయితే.. ఓ మహిళ ఒట్టి అన్నం కాదు ఏకంగా బిర్యానీయే పెడుతోంది. అది కూడా ఫ్రీగా. మానవత్వం అంటే ఇది కాదూ? మనస్ఫూర్తిగా మెచ్చుకోవాల్సిన విషయం కదా. తమిళనాడులోని పులియాకులం ప్రాంతంలో రోడ్డు పక్కన ఒక చెట్టు కింద చిన్న బిర్యానీ షాపు పెట్టుకున్న ఒకావిడ.. ఆకలితో అలమటించే పేదల కోసం ఇలా ఉచితంగా సర్వీస్ అందిస్తుండటం అభినందనీయం. పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తూ లక్షల్లో, కోట్లల్లో లాభాలు ఆర్జిస్తూ పిల్లికి కూడా భిక్షం పెట్టని మహానుభావుల కన్నా ఈమె వంద రెట్లు నయం. దైవం మానవ రూపంలో దర్శనమివ్వటం అంటే ఇదే.
Biryani Free : tamilanadu women providing free biryani to poor people
కరోనా వైరస్ రెండోసారి విపరీతంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో చాలా మందికి చేయటానికి పనులు దొరకట్లేదు. దీంతో ఎంతో మంది పేదలకు రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి. కడుపులోని ఆకలికి తెలియదు ఈ బాధ. పేగులు నకనకలాడుతుంటాయి. కలో గంజో తాగితే తప్ప దండిగా ఉండదు. చేతిలో చిల్లి గవ్వ లేనప్పుడు కొనుక్కొని తినటం అసాధ్యం. ఇలాంటివారికి రోజులో కనీసం ఒక పూట తిండి దొరికినా మహా గొప్పే. మరో వైపు ప్రభుత్వాలేమో ప్రజలను బయటకు రావొద్దు, ఎక్కువ సంఖ్యలో గుమిగూడొద్దు అంటోంది. కూలి కోసం అడ్డా మీద నిలబడదామన్నా ఇదీ ఒక అడ్డమే. కాబట్టి చీకటి పడుతోందంటే నోట్లోకి నాలుగు వేళ్లు వెళ్లలేని దుస్థితి. పగలంతా ఏ నల్లా నీళ్లో తాగి కడుపు నింపుకోవచ్చు. కానీ రాత్రి పూట కాస్తోకూస్తో తినకపోతే నిద్రపట్టదు. సరిగ్గా ఇదే స్థితిలో ఉన్నవాళ్లకు ఈమె చేస్తున్న సేవ నిజంగా వెలకట్టలేనిది.
మానవత్వానికి ప్రతిరూపంగా ఈ మహిళ చేస్తున్న అన్నదానాన్ని ఆర్జే బాలాజీ అనే వ్యక్తి ఫొటో తీసి ట్విట్టర్ లో పెట్టాడు. వేలల్లో లైకులు, రీట్వీట్లు వచ్చాయి. ఈమెని చూసి కనీసం ఒక్కరైనా ఆ బాటలో నడిస్తే అంతకుమించింది ఏముంది. ఇది స్వార్థ ప్రచారం కాదు. ఎన్నికల ముందు నాయకులు ఇచ్చే ఫొటో స్టిల్సూ కావు. హ్యాట్సాఫ్.
What a great gesture by this small roadside biryani shop in Puliakulam, Coimbatore.! Humanity at its best !!! ❤️ pic.twitter.com/VZYWgRzwaN
— RJ Balaji (@RJ_Balaji) April 15, 2021