Shahjahan Mumtaz: షాజహాన్ అంటే గుర్తొచ్చేది.. తాజ్ మహల్. ఆయన భార్య ముంతాజ్ మీద ప్రేమకు గుర్తుగా షాజహాన్ నిర్మించిన అపురూపమైన కట్టడం తాజ్ మహల్. ప్రపంచం మొత్తాన్నీ ఆశ్చర్య చకితుల్ని చేసిన అందమైన కట్టడం ఇది. అందుకే ప్రపంచ వింతల్లో తాజ్ మహల్ కూడా ఒకటి. అయితే, ఇంత అద్భుతమైన కట్టడాన్ని షాజహాన్ ఎందుకు కట్టించాడు.? నిజంగానే మనం చెప్పుకునేటట్లు షాజహాన్ ది ప్రేమేనా.? లేక మూర్ఖత్వమా.? చరిత్ర చెబుతున్న కొన్ని నమ్మలేని నిజాలు తెలియాలంటే, అసలు షాజహాన్ గురించి కూడా కొన్ని నిజాలు తెలియాల్సిందే. ఆ నిజాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షాజహాన్, ముంతాజ్ ను ఎలా పెళ్లాడాడు.?
మొగల్ చక్రవర్తిల్లో ఒకడైన షాజహాన్ ఏడు పెళ్లిళ్లు చేసుకున్నాడట. అందులో నాలుగో భార్య ముంతాజ్ అట. ముంతాజ్ మహల్ చాలా అందగత్తె. ఆమె అందానికి దాసోహమైన షాజహాన్, అప్పటికే వివాహమైన ముంతాజ్ ను తన ప్రేమతో మచ్చిక చేసుకున్నాడట. అలా షాజహాన్ ప్రేమకు దాసోహమైపోయింది ముంతాజ్. ముంతాజ్ ప్రేమను పొందేందుకు ఆమె మొదటి భర్తను అతి దారుణంగా చంపేశాడు షాజహాన్ అని చరిత్ర చెబుతుంది. ఆ తర్వాతే ముంతాజ్, షాజహాన్ ప్రేమలో పడిందట. అయితే, నిజంగానే ముంతాజ్ అంటే షాజహాన్ కు అపారమైన ప్రేమ ఉండేదట. ఎప్పుడూ ఆమె అందాన్ని చూస్తూ, ఆమె ప్రేమ ఊయలలో తరించిపోయేవాడట షాజహాన్. అలా ముంతాజ్ 14 వ కుమారుడిని ప్రసవించే సమయంలో కన్ను మూసిందట. ముంతాజ్ ప్రేమను మర్చిపోలేని షాజహాన్ ఆమె ప్రేమకు చిహ్నంగానే కట్టించిన అతి సుందరమైన కట్టడమే తాజ్ మహల్.
ముంతాజ్ తర్వాత కూడా ఆగని షాజహాన్ పెళ్లిళ్ల పర్వం..
ముంతాజ్ చనిపోయాక షాజహాన్ ఆమె చెల్లెలిని వివాహమాడాడట. అలా ఏడుగురు భార్యలతో షాజహాన్ వైవాహిక జీవితం అనుభవించాడట. వీళ్లే కాదు, అందులో ముంతాజ్ కారణంగా షాజహాన్ కు పుట్టిన కూతురు కూడా ఉందని చరిత్ర చెబుతుంది. చరిత్ర ఎంత తీయగా ఉంటుందో, లోతుల్లోకి వెళితే, ఇలాంటి కొన్ని చేదు నిజాలు కూడా ఔరా అనిపించక మానవు.
షాజహాన్ చివరి రోజులు అంత దుర్భరంగానా.?
అంత మందిని వివాహం చేసుకుని, సర్వ భోగాలు అనుభవించిన షాజహాన్ చివరి రోజులు చాలా దుర్భరంగా గడిచాయట. ఎవరూ ఊహించిన వింత రోగంతో బాధపడి, కుంగి కుశించిపోయాడట. ఆ సమయంలో ఆయనను కుమారుడైన ఔరంగజేబు అష్ట కష్టాలు పెట్టాడట. చివరికి ముంతాజ్ కోసం కట్టిన భవంతిలోనే ఓ మూల బంధీగా చేశాడట. అక్కడే తుది శ్వాస విడిచాడట షాజహాన్. ఎంతైనా తండ్రి కదా.. అక్కడే అంత్య క్రియలు చేసి, ముంతాజ్ సమాధి పక్కనే షాజహాన్ సమాధిని కూడా కట్టించాడట ఔరంగ జేబు. షాజహాన్ మీదున్న ప్రేమతో, ముంతాజ్ ఆత్మఇప్పటికీ అక్కడే తిరుగుతూ ఉంటుందని అంటుంటారు.
‘
తాజ్ మహల్ కట్టిన శిల్పుల్నీ, కూలీలను చంపించేశాడా.?
ఇక తాజ్ మహల్ విషయానికి వస్తే, ఇంతటి అపురూపమైన కట్టడం న భూతో న భవిష్యతి అనేలా ఉండాలి. మళ్లీ ఇలాంటి కట్టడాన్ని ఎవ్వరూ కట్టించకూడదు.. దీని ఫార్ములా ఎవ్వరికీ తెలియకూడదు.. అనే నెపంతో, ఈ కట్టడాన్ని పూర్తి చేసిన తర్వాత, కట్టిన శిల్పుల్ని, కూలీలను చంపించేశాడని అంటుంటారు. ఇందులో నిజమెంతో తెలీదు. కానీ, నిజంగానే ఈ కట్టడం తాలూకు రహస్యాలు ఇప్పటికీ మిస్టరీగానే ఉండిపోయాయి. ముంతాజ్ మీద ప్రేమే కాదు, తాజ్ మహల్ కట్టడానికి షాజహాన్ పెట్టిన ఎఫర్ట్ ఏ పాటిదో కానీ, 400 ఏళ్లు కావస్తున్నా.. ఆ కట్టడం ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉండిపోయింది.