Inspirational : చనిపోయినవారినీ.. ప్రేమిస్తాడు..

Inspirational : బతికున్నప్పుడే పట్టించుకునే రోజులు కావివి. అలాంటిది చనిపోయాక కూడా ప్రేమించటం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీకి చెందిన ‘పద్మశ్రీ’ జితేందర్ సింగ్ గతేడాది కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2000 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించాడు. ‘షాహిద్ భగత్ సింగ్ సేవా దళ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ సేవలో నిమగ్నమయ్యాడు. ఉదయం 7 గంటలకే డ్యూటీ ఎక్కుతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి ఇంటికి […].

By: jyothi

Published Date - Sun - 9 May 21

Inspirational : చనిపోయినవారినీ.. ప్రేమిస్తాడు..

Inspirational : బతికున్నప్పుడే పట్టించుకునే రోజులు కావివి. అలాంటిది చనిపోయాక కూడా ప్రేమించటం అంటే మామూలు విషయం కాదు. ఢిల్లీకి చెందిన ‘పద్మశ్రీ’ జితేందర్ సింగ్ గతేడాది కరోనా వెలుగులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు దాదాపు 2000 అనాథ శవాలకు అంతిమ సంస్కారాలను గౌరవప్రదంగా నిర్వహించాడు. ‘షాహిద్ భగత్ సింగ్ సేవా దళ్’ అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి ఈ సేవలో నిమగ్నమయ్యాడు. ఉదయం 7 గంటలకే డ్యూటీ ఎక్కుతాడు. ప్రస్తుత పరిస్థితుల్లో రాత్రి ఇంటికి చేరేటప్పటికి ఎంత టైమ్ అవుతుందో ఇతనికే తెలియదు. ఒక్కోసారి అర్ధ రాత్రి దాటినా ఇంటికి రావటానికి కుదరట్లేదు. దీంతో ఎక్కడో ఒక చోట రోడ్డు పక్కనే బండిని పార్క్ చేసి అందులోనే నిద్ర పోతాడు.

Inspirational : a man for cremation of unknown deadbodies

Inspirational : a man for cremation of unknown deadbodies

రెండు దశాబ్ధాలుగా..

జితేందర్ సింగ్ గత రెండు దశాబ్ధాలుగా ఈ సోషల్ సర్వీస్ కే తన జీవితాన్ని అంకితం చేశాడు. కొవిడ్-19 తలెత్తాక దిక్కూ మొక్కు లేని డెడ్ బాడీల సంఖ్య అనూహ్యంగా పెరిగిందని, దీంతో మరింత స్ఫూర్తితో, పట్టుదలతో పనిచేస్తున్నానని చెబుతున్నాడు. జితేందర్ వయసు 59 సంవత్సరాలు. 1990ల్లో ఈ ఫీల్డ్ లోకి వచ్చాడు. శవాలు ఏ స్థితిలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా తన అంబులెన్సులో వెళ్లి శ్మశానాలకు తీసుకొస్తానని అంటున్నాడు. మనం మన పెళ్లిళ్లకు, ఇతర శుభ కార్యాలకు కోట్ల రూపాయలు ఖర్చు పెడతామని, చాలా మందికి అంతిమ సంస్కారాల సమయంలో కూడా చేతిలో చిల్లిగవ్వ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఇలాంటివారికి అంతిమ యాత్ర గౌరవప్రదంగా సాగాలనే సదుద్దేశంతోనే స్వచ్ఛంద సంస్థను నెలకొల్పానని పేర్కొన్నాడు.

గతంలో ఎంతో లగ్జరీగా: Inspirational

జితేందర్ సింగ్ గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేవాడు. ఫైనాన్స్ కూడా నడిపేవాడు. కొన్నాళ్లు రాజకీయాల్లోనూ ఉన్నాడు. కానీ ఇప్పుడు పొందుతున్నంత సంతృప్తి ఇంతకుముందెన్నడూ పొందలేదని చెప్పాడు. ఇతను స్థాపించిన స్వచ్ఛంద సంస్థలో ప్రస్తుతం 18 మహాప్రస్థానం వాహనాలు ఉన్నాయి. ఈ గ్రూపులో మొత్తం 20 మంది ఉన్నారు. వీళ్లంతా కలిసి 1995 నుంచి ఇప్పటి వరకు దాదాపు 24 వేల అనాథ శవాలకు అంత్యక్రియలు నిర్వహించారు. తాను ఈ పని చేయటం పట్ల తన కుటుంబం ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదని, వాళ్ల ప్రోత్సాహం వల్లే ముందుకు వెళుతున్నానని గర్వంగా చెప్పాడు.

Latest News

Related News