Inspiring Person: సక్సెస్.. ఈ పేరు కోసం చాలా మంది తపిస్తూ ఉంటారు.. అయితే కష్టపడి సాధిస్తే చేయలేని పని అంటూ ఏం లేదని చాలా మంది ఇప్పటికే నిరూపించారు. సంకల్పం బలంగా ఉంటే సాధించలేనిది ఏదీ లేదు. దీన్ని ఓ యువకుడు పట్టుదలతో మరోసారి రుజువు చేశాడు. తద్వారా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచాడు.
ఎన్ని అడ్డంకులు వచ్చినా తాను అనుకున్న గమ్యానికి చేరుకున్నాడు.. ఒకప్పుడు వాచ్ మెన్ గా పని చేసిన ఈ యువకుడు ఇప్పుడు ఐఐఎం లో ప్రొఫెసర్ అయ్యాడు.. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రంజిత్ రామచంద్రన్.. ఇతడిది కేరళ.. ఇతడు పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా తన లక్ష్యం కోసం ఎంతో పట్టుదలతో శ్రమించి లైఫ్ లో సక్సెస్ అయ్యాడు. దీంతో ఇతడిని అందరూ ప్రశంసిస్తున్నారు.
రంజిత్ తలుపులు కూడా సరిగా లేని ఇంట్లో ఉంటూనే తన చదువును ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆపకుండా కంటిన్యూ చేసాడు.. తనతో పాటు తండ్రి, తల్లి, ఇద్దరు తోబుట్టువులు కూడా ఉండేవారు.. కుటుంబ పోషణకే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇతడు చదువు ఆపకుండా పార్ట్ టైం గా వాచ్ మెన్ ఉద్యోగం చేసి నెలకు 4 వేలు సంపాదిస్తూనే చదువు సాగించాడు.
ఇతడు ముందు నుండి చదువుల్లో ముందు ఉండేవాడు.. మరాఠీ తెగకు చెందిన ఇతడు స్కాలర్షిప్ ఉపయోగించు కుంటూనే వాచ్ మెన్ ఉద్యోగం కూడా చేస్తూ పీజీ తర్వాత పిహెచ్డి కూడా పూర్తి చేసాడు. పిహెచ్డి చేస్తున్న సమయంలో ఆంగ్లంలో ఇబ్బందులు ఎదుర్కున్న తన గైడ్ ఇచ్చిన ప్రోత్సాహంతో పరిశోధన కొనసాగించి తన లక్ష్యాన్ని చేరుకున్నాడు. ఇక ఇప్పుడు ఐఐఎంలో ప్రొఫెసర్ గా పని చేస్తున్నాడు. ఇది ఇతడి సక్సెస్ స్టోరీ.. ఎన్ని అడ్డంకులు వచ్చిన ఇతడు చదువు మాత్రం నిర్లక్ష్యం చేయకుండా పట్టుదలతో అనుకున్నది సాధించాడు..
Read Also : Vishnu Priya : పక్కలోకి వెళ్లకుంటే ఎవరూ ఛాన్సులు ఇవ్వరు.. యాంకర్ విష్ణు ప్రియ కామెంట్లు..!
Read Also : Neha Shetty : టాప్ విప్పేసి బ్రా అందాలతో సెగలు రేపుతున్న నేహాశెట్టి..!