Kohinoor Diamond: కోహినూర్ వజ్రం రక్త చరిత్ర: రాణులు మాత్రమే ధరించాలా.?

Kohinoor Diamond: ప్రపంచంలోనే అతి విలువైన వజ్రం కోహినూర్ వజ్రం. ఈ వజ్రం చాలా విలువైందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, దీని చరిత్ర మాత్రం చాలా తక్కువ మందికే తెలుసేమో బహుశా. ఈ వజ్రానికి రాజులు నచ్చలేదా.? రాణులు ధరించడమే నచ్చిందా.? కాదని రాజులు ధరించే సాహసం చేస్తే, వారికి మరణమే శరణమైందా.? ఎందుకలా.? తెలుసుకోవాలంటే, సూక్ష్మంగా కోహినూర్ వజ్రం రక్త చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి కోహినూర్ వజ్రం ఎక్కడిది.? అంటే, అక్షరాలా […].

By: jyothi

Published Date - Sat - 4 September 21

Kohinoor Diamond: కోహినూర్ వజ్రం రక్త చరిత్ర: రాణులు మాత్రమే ధరించాలా.?

Kohinoor Diamond: ప్రపంచంలోనే అతి విలువైన వజ్రం కోహినూర్ వజ్రం. ఈ వజ్రం చాలా విలువైందన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, దీని చరిత్ర మాత్రం చాలా తక్కువ మందికే తెలుసేమో బహుశా. ఈ వజ్రానికి రాజులు నచ్చలేదా.? రాణులు ధరించడమే నచ్చిందా.? కాదని రాజులు ధరించే సాహసం చేస్తే, వారికి మరణమే శరణమైందా.? ఎందుకలా.? తెలుసుకోవాలంటే, సూక్ష్మంగా కోహినూర్ వజ్రం రక్త చరిత్ర గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

నిజానికి కోహినూర్ వజ్రం ఎక్కడిది.? అంటే, అక్షరాలా అది మన తెలుగువారి సొత్తే. అది కూడా ఆంధ్రోళ్ల సొత్తు. అవునండీ నిజమే, ఈ కోహినూర్ వజ్రం మన ఆంధ్ర ప్రదేశ్ లోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతమైన కొల్లూరు గనుల్లో దొరికిందని చరిత్ర చెబుతోంది. అయితే, మన భారత దేశంలో, అందునా మన ఆంధ్ర రాష్ర్టంలో పుట్టిన ఈ కోహినూర్ వజ్రం ఇప్పుడు లండన్ రాణుల కిరీటంలో అలంకరించబడి వారి ఠీవీని మరింత పెంచింది. అయితే, మన దేశం నుండి ఈ వజ్రం లండన్ కి ఎలా చేరింది.?

కృష్ణా పరివాహక ప్రాంతంలో దొరికిన ఈ వజ్రాన్ని మొదట ఆ ప్రాంత రాజులే దక్కించుకున్నారు. అయితే, ఆ తర్వాత ఢిల్లీ సుల్తానుల చేతికి చిక్కింది ఈ అపురూపమైన వజ్రం.  14 వ శతాబ్ధంలో మాల్వా ప్రాంత రాజు మహా లగ్ధేవ్, ఢిల్లీ సుల్తానులపై యుద్ధంలో జయించి, అతి విలువైన ఈ వజ్రాన్ని దక్కించుకున్నాడు. ఆ తర్వాత అల్లా వుద్ధీన్ ఖిల్జీ దండయాత్రలో భాగంగా,  అతని చేతికి చిక్కిన ఈ వజ్రం కారణంగానే,  కొద్ది రోజుల్లోనే ఆయన మరణించడం జరిగింది.

ఆ తర్వాత చేతులు మారిన ఈ వజ్రం కాకతీయ రాజు ప్రతాప రుద్రుడి చేతికి చిక్కింది. అదే సమయంలో ఢిల్లీ సుల్తానులు కాకతీయ రాజ్యంపై దండెత్తగా, ప్రతాప రుద్రుడు  ఢిల్లీ సుల్తానులతో సంధి చేసుకుని సంధిలో భాగంగా, ఈ అమూల్యమైన వజ్రాన్ని బాబర్ చేతికి అందించాల్సి వచ్చింది.

బాబర్ నామాలో కోహినూర్ వజ్రం విలువ..

అప్పటికే ఎంతో మంది రాజుల చేతులు మారినప్పటికీ, బాబర్ కాలంలోనే ఈ వజ్రానికి విలువ పెరిగింది. ఈయన కాలంలోనే ఈ వజ్రం ప్రస్థావన చరిత్రలో లిఖించబడింది కూడా. అప్పటికీ దీనికి కోహినూర్ వజ్రం అని పేరు రాలేదు. బాబర్ గుర్తుగా దీన్ని బాబర్ వజ్రం అనే పిలిచేవారు. ఆ తర్వాత బాబర్ మరణానంతరం, ఆయన కొడుకు హుమయూన్ ఈ వజ్రం వారసత్వంగా చేరింది. ఈ వజ్రం తన చేతికి చిక్కిన తర్వాత హుమయూన్ అనేక యుద్ధాలను ఎదుర్కోవల్సి వచ్చింది. ఆ క్రమంలోనే మళ్లీ ఢిల్లీ సుల్తానుల చేతిలో ఓడిపోయి, వారికి ఈ వజ్రం విడిచిపెట్టవలసి వచ్చింది. ఢిల్లీ సుల్తానులపై పర్షియన్ రాజు మెరుపు దాడి చేసి, వారి రాజ్యాన్నీ, ఖజానాను కొల్లగొట్టేశాడు.

పర్షియన్ రాజు హయాంలో కోహినూర్ వజ్రం ప్రాముఖ్యత..

తాను కొల్గగొట్టిన సంపదలో అత్యంత తేజస్సుతో మెరిసిపోతున్న ఈ మణిని చూసి, పర్షియన్ రాజు ’కో హి నూ ర్‘ అని సంబోదించాడు. అంతేకాదు, దీని విలువ 105 కోట్ల పై మాటే అని తేల్చాడు. ఇక అప్పటి నుండీ ఈ వజ్రానికి బాగా పబ్లిసిటీ జరిగింది. ఈ వజ్రం చేజిక్కించుకోవడం కోసమే దండయాత్రలు మొదలయ్యాయి. ఎవరైతే ఈ వజ్రాన్ని చేజిక్కించుకోవాలనుకుంటున్నారో వారంతా సర్వనాశనం అయిపోతున్నారు. అయినా సరే, దీన్ని దక్కించుకోవడాన్ని తమ ప్రెస్టీజ్ గా భావించిన రాజులు ఒకరిపై ఒకరు దండయాత్రలు చేసుకుంటూ,  భీకరమైన యుద్ధాలతో పోరాటాలూ.. అబ్బో ఇక అసాధారణ రక్త చరిత్రకు ఈ వజ్రం కేరాఫ్ అడ్రస్ గా మారింది. అలా బ్రిటీష్ కాలంలోని డల్హౌసీ చేతికి చిక్కిందీ వజ్రం. ఆయన తన రాణి విక్టోరియాకి ఈ అపురూపమైన వజ్రాన్ని బహుమతిగా ఇచ్చాడు. రాణి ఈ వజ్రాన్ని తన కిరీటంలో అలంకరించుకుంది. అప్పటి నుండి రాణికి తిరుగే లేకుండా పోయింది. అంతవరకూ ఈ వజ్రాన్ని దక్కించుకున్న రాజులు మాత్రం రకరకాల వ్యాధులు, ఆకస్మిక దండయాత్రల కారణంగా చనిపోతూ వచ్చారు. కానీ, రాణులు మాత్రం ఈ అపారమైన వజ్రపు శక్తితో తమ రాజ్యాలను సువిశాల రాజ్యాలుగా విస్తరింపచేసుకున్నారు. అప్పటి నుండీ ఈ విలువైన వజ్రం లండన్ రాణుల కిరీటంలో అలంకరణ ప్రాయంగా మారి, వారి కీర్తినీ గౌరవాన్ని మరింతగా పెంచేసింది. అదీ కోహినూర్ వజ్రం కథ.

Latest News

Related News