Mrs. World : డాటరాఫ్ సత్యమూర్తి..

Mrs. World : సన్నాఫ్ సత్యమూర్తి.. విలువలే ఆస్తి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కడున్నాయి అనుకునేవాళ్లకు ఇవాళ ఆదివారం జరిగిన ఓ సంఘటనే సరైన జవాబు. ‘మిసెస్ వరల్డ్-2020’ కరోలిన్ జూరీ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకి మిసెస్ వరల్డ్ కిరీటం వద్దు అని, తాను నమ్మిన విలువలే తనకు ముద్దు అని తేల్చిచెప్పారు. తల పైన ఉన్న కిరీటాన్ని తీసి పక్కన పెట్టారు. […].

By: jyothi

Updated On - Sun - 11 April 21

Mrs. World : డాటరాఫ్ సత్యమూర్తి..

Mrs. World : సన్నాఫ్ సత్యమూర్తి.. విలువలే ఆస్తి. ఈ సినిమా ఎంత పెద్ద హిట్టో మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో ఇలాంటి క్యారెక్టర్లు ఎక్కడున్నాయి అనుకునేవాళ్లకు ఇవాళ ఆదివారం జరిగిన ఓ సంఘటనే సరైన జవాబు. ‘మిసెస్ వరల్డ్-2020’ కరోలిన్ జూరీ ఈరోజు సంచలన నిర్ణయం తీసుకున్నారు. తనకి మిసెస్ వరల్డ్ కిరీటం వద్దు అని, తాను నమ్మిన విలువలే తనకు ముద్దు అని తేల్చిచెప్పారు. తల పైన ఉన్న కిరీటాన్ని తీసి పక్కన పెట్టారు. దాన్ని సంబంధిత నిర్వాహకులకి ఇచ్చేసేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు. ఆమె ఎందుకు ఇలా చేశారో తెలుసుకోవాలంటే కాస్త వివరంగానే చెప్పుకోవాలి.

Mrs. World : mrs.world Caroline Jurie sensational decision

Mrs. World : mrs.world Caroline Jurie sensational decision 

పెళ్లిచేసుకోకూడదు..

రీసెంటుగా మిసెస్ శ్రీలంక అందాల పోటీల ఫైనల్స్ జరిగాయి. జడ్జిలందరూ పుష్పిక డి సిల్వ అనే అమ్మాయిని విజేతగా ప్రకటించారు. దీంతో 2019లో మిసెస్ శ్రీలంక కిరీటాన్ని దక్కించుకున్న కరోలిన్ జూరీ(2020 మిసెస్ వరల్డ్ విజేత) పుష్పిక డి సిల్వకు కిరీటాన్ని అలంకరించారు. తర్వాత కరోలిన్ మాట్లాడుతూ ఈ పోటీల నియమాలు, నిబంధనల ప్రకారం పెళ్లి చేసుకొని, విడాకులు తీసుకున్న వ్యక్తిని విన్నర్ గా సెలెక్ట్ చేయకూడదన్నారు. అంతటితో ఆగకుండా వెంటనే పుష్పిక డి సిల్వ దగ్గరికి వెళ్లి ఆమె తలపై ఉన్న కిరీటాన్ని బలవంతంగా తొలగించి పక్కనే ఉన్న మొదటి రన్నరప్ నెత్తి మీద పెట్టారు. దీంతో ప్రతిఒక్కరూ ఆశ్చర్యపోయారు.

అదేం లేదు: Mrs. World

దీనిపై రియాక్ట్ అయిన ఆ అందాల పోటీల నిర్వాహకులు పుష్పిక డి సిల్వ విడాకులు తీసుకోలేదని చెప్పటంతోపాటు మళ్లీ ఆమెకే ఆ కిరీటాన్ని బహూకరించారు. కరోలిన్ వ్యవహరించిన తీరు అవమానకరంగా ఉందని తప్పుపట్టారు. మిసెస్ వరల్డ్ సంస్థ ఇప్పటికే ఆమెపై దర్యాప్తు ప్రారంభించిందని తెలిపారు. పుష్పిక డి సిల్వని గాయపరిచినందుకు కరోలిన్ ని కొలంబో పోలీసులు అరెస్ట్ చేసి తర్వాత బెయిల్ మీద విడుదల చేశారు. బెయిల్ పై రిలీజ్ అయిన కొద్దిసేపటికే కరోలిన్ ఓ వీడియోని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టారు. అందులో తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పారు.

నమ్మినదానికి కట్టుబడ్డా..

‘‘నేను ఏదైతే కరెక్ట్ అని నమ్ముతానో దానికే ఎప్పుడూ కట్టుబడి ఉంటా. రూల్స్, రెగ్యులేషన్స్ అందరికీ ఒకేలా ఉండాలి. అప్పుడే ప్రతిభావంతులకి న్యాయం జరుగుతుంది. నేను మొదటి నుంచీ చెబుతున్నదిదే. రూల్స్ లోని లోపాలను మనకు అనుకూలంగా మలచుకోకూడదు. మిసెస్ వరల్డ్ పోటీలు పెట్టేది విడాకులు తీసుకున్నోళ్లను, విడిగా బతుకుతున్నోళ్లను కించపర్చటానికి కాదు. మిసెస్ వరల్డ్ కిరీటాన్ని పెట్టుకున్న నేను అన్యాయాన్ని చూస్తూ ఊరుకోను. విలువలను కాపాడటం కోసం గట్టిగా నిలబడ్డా. తొలి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి. పిదప వచ్చేవారికి మార్గమవుతుంది. మనం నమ్మినదానికోసం నిలబడ్డప్పుడు ఏం కోల్పోయినా పట్టించుకోకూడదు. అందుకే నాకు సొంతమైన మిసెస్ వరల్డ్ కిరీటాన్ని త్యజిస్తున్నా’’ అని వివరించారు.

మాటలే కాదు: Mrs. World

మిసెస్ శ్రీలంక-2020 పుష్పిక డి సిల్వ ఏం తప్పుచేశారో దానికి తగ్గ రుజువులను కరోలిన్ జూరీ సమర్పిస్తే సరిపోయేది. కానీ.. ఈ పోటీల్లో జరుగుతున్న రాజకీయాలు, వాటితో రాజీపడే మనస్తత్వం లేకపోవటం, తన మాటకు విలువ దక్కలేదనే అసంతృప్తి, మిసెస్ వరల్డ్ విజేతకు ఘోర అవమానం జరిగిందనే మానసిక ఆవేదన కరోలిన్ ని ఈ తీవ్ర నిర్ణయం తీసుకునేలా ప్రేరేపించాయి. కాకపోతే నమ్మిన విలువల కోసం నిలబడాలని చెప్పటం, దాన్ని చేతల్లో చేసి చూపించటం మాత్రం సూపర్.

Latest News

Related News