Climb Higher Peaks : జీవితంలో అన్నీ అందరికీ దక్కవు. వాటి కోసం కృషి చేయాలి. ఉన్నత శిఖరాలను అధిరోహించాలంటే నిరంతరం శ్రమిస్తూనే ఉండాలి. అలసిపోకూడదు. నిరాశచెందకూడదు. ఒకసారి విజయం దక్కకపోతే మరోసారి ప్రయత్నించాలి. మరోసారి కూడా సక్సెస్ కాకపోతే ఇంకోసారి ట్రై చేయాలి. ఇలా సక్సెస్ వచ్చే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి.
నిస్పృహలకు లోనుకాకూడదు. మనసులోంచి నెగెటివ్ ఆలోచనలకు చెక్ పెట్టాలి. ప్రతీది పాజిటివ్ గానే ఆలోచించాలి. పాజిటివ్ ధృక్పథంతోనే ముందుకు వెళ్లాలి. మనసును ఎప్పుడూ ప్రశాంతంగా ఉంచుకోవాలి. లేనిపోని నెగెటివ్ ఆలోచనలను మైండ్ నుంచి డిలీట్ చేసేయాలి. ఎప్పుడూ నవ్వతూ నవ్విస్తూ ఉండటం అలవాటు చేసుకోవాలి.
ఆధ్యత్మికత , ఫిలాసఫీకి కేంద్రమనీ చెప్పుకునే మనదేశంలో ఆనందస్థాయి తక్కువ ఉంది. బిలియనీర్లు ప్రతి ఏటా అధికమవుతున్నారు కానీ.. ఇక్కడ సంతోషంగా జీవించేవారి సంఖ్య తక్కువ. అంతెందుకు ప్రపంచంలోని హ్యాపియస్ట్ దేశాల వరుసలో ఎక్కడో అట్టడుగున 136 వ స్థానంలో ఉన్నాం. ఫీల్‌గుడ్ హార్మోన్స్ విడుదలయ్యేది నవ్వినప్పుడే అని తెలుసుకోవాలి. నవ్వినప్పుడు ఊపిరితిత్తులు శుభ్రపడతాయి. శ్వాస మెరుగుపడుతుంది. నొప్పులు కనిపించవు. వ్యాధినిరోధక శక్తి బలపడుతుంది. మెదడు చురుకవుతుంది.
రోజువారి జీవిత కష్టాలున్నా.. నెగటివ్ ఆలోచనలు రాకుండా ఉండాలంటే హాస్యం ఉండాల్సిందే. దీనివల్ల కూల్ అవుతారు. బాగా నవ్వితే అన్నీ మర్చిపోయే శూన్యస్థితికి వస్తాం. నవ్వటం వల్ల శరీరం తేలిక అవుతుంది. ఒత్తిడి తగ్గిపోతుంది. అందుకే హాస్య కార్యక్రమాలు, సినిమాలను చూడాలి. నవ్వువల్ల ఆత్మవిశ్వాసం వస్తుంది. పాజిటివ్‌గా ఆలోచిస్తాం. అందుకే ఎంత నవ్వితే అంత ఆరోగ్యం! సిగ్గుపడకుండా నవ్వండి!
Also Read : King Charles: బ్రిటన్ రాజు చార్లెస్‌కు అసాధారణ అధికారాలు.. అవి ఏంటంటే..
Also Read : Viral Video : మందేసింది..బ్రీత్ అనలైజర్ టెస్టు నుంచి తప్పించుకునేందుకు చిందేసింది.. ఆ తర్వాత