women of Katkona : ఎలా పుట్టడం అనేది మన చేతిలో ఉండదు కానీ ఎలా చావాలన్నది మాత్రం వ్యక్తులను మారుతుంది. పుట్టేటప్పుడు పేదవాళ్లుగా పుట్టినా కానీ చావడానికి ముందు మాత్రం పేదవారిగా చస్తే అది ఖచ్చితంగా వారి తప్పే. ఇలా పేదరికంలో పుట్టిన మహిళలు.. తమ జీవితాలు పేదవాళ్లలాగే ముగుస్తాయని అనుకున్నారట. అయితే ప్రభుత్వం తెచ్చిన ఓ పథకం వారి జీవితాలను మార్చివేసింది. దాంతో ఒకప్పుడు వ్యవసాయ కూలీలుగా ఉన్న వారు.. పారిశ్రామికవేత్తలుగా మారారు.
ఛత్తీస్ ఘడ్ లోని కొరియా జిల్లాలోని ఒక గ్రామం అయిన కట్కోనాకు చెందిన మహిళలు ఎంతోమందిలో నమ్మకాన్ని నింపుతోంది. ప్రభుత్వంతోడు, తోటి మహిళల సహకారం ఉంటే ఎలా విజయం సాధ్యమవుతుందనే విషయాన్ని కట్కోనా గ్రామస్థులు నిరూపించారు. కట్కోనా గ్రామానికి చెందిన మహిళలు.. ఇంటి ఆర్థిక అవసరాలను తీర్చడానికి వ్యవసాయ కూలీలుగా పని చేసే వారు. చాలీచాలని కూలీతో ఇంటిని నడిపించే వారు.
ఛత్తీస్ ఘడ్ రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తెచ్చిన పథకం వల్ల వీరి జీవితాలు మారిపోయాయి. ప్రభుత్వం గోథాన్ పథకాన్ని ప్రవేశపెట్టి.. వివిధ వ్యాపారాలు ప్రారంభించడానికి ఆర్థికంగా సహాయం అందించడం జరుగుతుంది. ఈ పథకం కింద కట్కోనా గ్రామ మహిళలకు ఆర్థిక సహాయం అందగా.. వారు పొటాటో చిప్స్ కంపెనీని ప్రారంభించారు. వీళ్ల కంపెనీ చిప్స్ కు అంతకంతకు ఆదరణ పెరగడంతో.. వారి వ్యాపారం మరింత విస్తరించడం జరిగింది. ఇప్పుడు వీళ్లు ఒక రోజుకు ఎనిమిది వేల పొటాటో చిప్స్ ప్యాకెట్లను తయారు చేస్తున్నారు.
తాజాగా ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రి భూపేష్ బఘేలా కట్కోనా గ్రామంలో ఈ మహిళలు ఏర్పాటు చేసిన.. కొరియా పొటాటో చిప్స్ కంపెనీ యూనిట్ ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మహిళలు ప్రభుత్వ పథకం వల్ల తాము ఎలా వ్యవసాయ కూలీల నుండి పారిశ్రామికవేత్తలు మారారనే విషయాన్ని వెల్లడించారు. దీంతో బాగా ఆనందించిన భూపేష్.. మరిన్ని పథకాలను ప్రారంభించి, ఎంతోమందికి అన్ని రకాలుగా సాయం చేయాలని తాము ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.
Also Read : Dance Video : స్వింగ్ జర అంటూ ఊపేస్తున్న అమ్మాయి.. ఇవేం అందాలు బాబోయ్..!
Also Read : Shahid Kapoor : ఫ్లాప్ తర్వాత రూ.5 కోట్లు ఎక్కువ డిమాండ్ చేస్తున్న హీరో