Success Story: టీ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోనక్కర్లేదు. ఉదయం నుండి సాయంత్రం వరకు ఇండియాలో 70 శాతం మంది ప్రజలకు టీ తాగనిదే పొద్దుపోదు. ప్రత్యేకంగా టీ గురించి సినిమాల్లో కూడా పాటల రూపంలో హీరోలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటారు. కోట్లకు పడగెత్తిన వాళ్ళకైనా, డబ్బులేని నిరుపేదకు కూడా టీ కచ్చితంగా అవసరం పడుతుంది. కొన్ని రోగాలు టీ తాగడం వల్ల కూడా తగ్గిపోతాయి. ప్రస్తుతం ప్రపంచ దేశాల్లో టీకి మంచి ఆదరణ ఏర్పడింది. పలు రకాల టీలు కూడా అందుబాటులో వున్నాయి. టీ తో పాటు కాఫీకి కూడా అత్యంత ఆదరణ ఏర్పడింది.
Women Success Story With Tea Stall Business Earnings in Lakhs Per Month
తాజాగా రాజ్ కోట్ కు చెందిన మహిళ నిషా హుస్సేన్ తన ఉద్యోగానికి రాజీనామా చేసి టీ కొట్టు పెట్టింది. రాజ్ కోట్ లో “ఛాయి వాలీ” అనే టీ పెట్టి లో పనిచేసి కొంతకాలం అనుభవం తెచ్చుకుని “ది చైలాండ్” అనే టీ కొట్టు పెట్టి సక్సస్ అయింది. అందరు ఇష్టపడే 10 రకాల టీలు ఆమె అమ్ముతుంది. నిషా ఆ టీ వ్యాపారం చేస్తుండడం ఇంట్లో వాళ్లకు ఇష్టం లేకపోయినా 2017 లో కంప్యూటర్ ఉద్యోగానికి రాజీనామా చేసి రహస్యంగా టీ అమ్మడం ప్రారంభించింది. నాకు ప్రత్యేకంగా టీలు అమ్మడం చిన్నప్పటి నుండి అలవాటైందని చెప్పింది.
నేను నా వ్యాపారాన్ని ప్రారంభించినప్పుడు మొదట్లోనే నమ్మకం వుంది. మొదట్లో కష్టమర్లు ఎవ్వరు లేరు ఒక మహిళ ఒంటరిగా టీ కొట్టు నడుపుతుంటే నా దగ్గరికి ఎవ్వరు వచ్చేవారు కాదు అని నిషా అనింది. మొదట్లో నా దగ్గరికి ఎవ్వరు రాలేదు 15 రోజులు నేను చేసిన టీని పారబోషాను. ఒక రోజు ఒక కస్టమర్ నా వ్యాపారం గురించి ఇన్ స్టా గ్రామ్ లోపెట్టాడు. ఆ వీడియో వైరల్ గా మారింది. ఆ తర్వాత ది చైలాండ్ కు జనం రావడం అధికం అయింది. ఇప్పుడు జనం నన్ను రాజ్ కోట్ చాయ్ వాలీ అని పిలవడం సంతోషంగా వుంది. నిషా ప్రతీ నెలకు రూ. 50,000 సంపాదించింది. కానీ లాక్ డౌన్ సమయంలో నా టీ స్థాల్ మూసివేయవల్సి వచ్చింది దీంతో బారీగా నష్టం వాటిల్లింది అని నిషా చెప్పింది.
నేను పెద్ద కస్టమర్ బేస్ ను సంపాదించాలనే ఆశతో జూన్ లో మళ్ళీ షాప్ తెరిచాను. కానీ అది అంత బాగా నడవలేదు. ప్రస్తుతం నా వ్యాపారం బాగా జరగాలని చూసుకుంటున్న. రాజ్ కోట్ ప్రజలు నన్ను ఎంతో ప్రేమాభిమానాలు అందించారు. ఇది నా వ్యాపారానికి మంచి శక్తిని ఇచ్చింది. చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలను నా వద్దకు తీసుకువస్తున్నారు. నా విజయాన్ని వారి పిల్లలకు చెబుతారు. నాకు చాలా గర్వాంగా ఉంది అని నిషా చెప్పింది.