Khosta-2 Virus: మరో కొత్త రకం వైరస్ వెలుగులోకి వచ్చింది. రష్యాలోని గబ్బిలాల్లో ఖోస్టా-2 అనే కొత్త రకం వైరస్ ను గుర్తించారు. అయితే ఇది కరోనా తరహాలో మనుషులకు సోకగలదని పరిశోధనల్లో తేలింది. సార్స్-కొవ్-2కు ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ ఖోస్టా-2 వైరస్ ను ఎదుర్కొనేందుకు పనిచేయవని నిర్ధరణ అయింది.
యాంటీబాడీ థెరపీలు, బ్లడ్ సీరం చికిత్సలతోనూ ఉపయోగం ఉండదని తెలిసింది. అమెరికాలోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్సిటీ పరిశోధకుల బృందం ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా వైరస్ లని సార్బేకొవైరసెస్ అనే ఉపజాతికి చెందిన సార్స్-కొవ్-2, ఖోస్టా-2.. ఒకే రకమైన స్పైక్ ప్రొటీన్ ను ఆసరాగా చేసుకుని మానవ కణాలకు వ్యాపిస్తాయని వివరించింది.
ఖోస్టా-2 వైరస్‌పై అధ్యయనం.. ‘PLoS Pathogens’ అనే జర్నల్ లో ప్రచురితమైంది. దాని ప్రకారం.. ఖోస్టా-1, ఖోస్టా-2 వైరస్‌లను రష్యాలోని గబ్బిలాల్లో 2020లోనే కనుగొన్నారు. అయితే.. ఆ వైరస్‌లతో మనుషులకు ఎలాంటి ముప్పు ఉండదని తొలుత భావించారు. కానీ.. అది తప్పని ఇటీవల నిర్ధరణ అయింది. ఖోస్టా-1తో పెద్దగా ముప్పు లేకపోయినా.. ఖోస్టా-2 మనుషులకు వ్యాపిస్తుందని తేలిందని వివరించారు పరిశోధకుల బృందంలో ఒకరైన మైకేల్ లెట్కో.
ప్రస్తుతం అందుబాటులో ఉన్న కరోనా టీకాలు.. ఖోస్టా-2 వైరస్ ను ఎదుర్కోగలవా అనే కోణంలో పరిశోధకులు అధ్యయనం చేశారు. కొవిడ్ టీకా తీసుకున్న వారి శరీరంలో నుంచి బ్లడ్ సీరం సేకరించి పరీక్షలు జరిపారు. అయితే.. ఖోస్టా-2 వైరస్ ను ప్రస్తుతమున్న టీకాలు నిర్వీర్యం చేయలేకపోతున్నాయని వారు గుర్తించారు. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వారిలోని యాంటీబాడీలు కూడా ప్రభావం చూపలేకపోయాయని నిర్ధరించారు. కొన్ని జన్యువులు ఖోస్టా-2 వైరస్ లో లేకపోవడమే ఇందుకు కారణమై ఉండొచ్చని చెప్పారు మైకేల్ లెట్కో. సార్స్-కొవ్-2తో ఖోస్టా-2 వైరస్ కలిస్తే.. మరింత ముప్పు ఉండొచ్చని హెచ్చరించారు.
Read Also : Rashi Khanna : అది బాగా ఉండే మగాడు కావాలి.. పచ్చిగా మాట్లాడిన రాశీఖన్నా..!
Read Also : Balakrishna: విశ్వాసం లేని కుక్కలు.. జూనియర్ ఎన్టీఆర్‌ను తిట్టిన బాలయ్య..