Cough Syrups: దగ్గు మందు తాగి 66 మంది పిల్లలు మృతి?.. భారత్ కి చెందిన కంపెనీపై దర్యాప్తు

Cough Syrups: భారత్ లో తయారైన నాలుగు దగ్గు మందుల సిరప్ ల కారణంగా 66 మంది చిన్నారులు చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి..

By: jyothi

Published Date - Thu - 6 October 22

Cough Syrups: దగ్గు మందు తాగి 66 మంది పిల్లలు మృతి?.. భారత్ కి చెందిన కంపెనీపై దర్యాప్తు

Cough Syrups: భారత్ లో తయారైన నాలుగు దగ్గు మందుల సిరప్ ల కారణంగా 66 మంది చిన్నారులు చనిపోయారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో అలర్టయిన ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతీయ ఫార్మా కంపెనీలపై దర్యాప్తు చేపట్టింది. సదరు కంపెనీ భద్రతా ప్రమాణాలు పాటిస్తుందా.. లేదా… అని తేల్చనుంది.

హర్యానా కేంద్రంగా..

హర్యానా కేంద్రంగా మెయిడెన్ ఫార్మాసూటికల్స్ లిమిటెడ్ దగ్గు సిరప్ లు తయారుచేస్తుంది. అయితే నాలుగు కలుషిత సిరప్ ల కారణంగా ఆఫ్రికన్​ దేశమైన గాంబియాలో 66 మంది చిన్నారుల మృతికి, మరికొందరు కిడ్నీ సంబంధిత సమస్యల బారిన పడేందుకు కారణం కావచ్చొన్న వార్తల నేపథ్యంలో ఈమేరకు చర్యలు చేపట్టింది డబ్ల్యూహెచ్​ఓ.

నాలుగు సిరప్ లు..

ప్రొమెతజైన్​ ఓరల్ సొల్యూషన్​, కాఫెక్స్​మాలిన్ బేబీ కాఫ్​ సిరప్, మాకాఫ్​ బేబీ కాఫ్​ సిరప్, మేగ్రిప్ ఎన్ కోల్డ్ సిరప్​ విషయంలో మెయిడెన్ ఫార్మాకు అలర్ట్ జారీ చేసింది డబ్ల్యూహెచ్​ఓ. వీటి ఉత్పత్తిలో పూర్తిస్థాయిలో భద్రత, నాణ్యతా ప్రమాణాల్ని పాటించినట్టుగా ఇప్పటివరకు ఆ సంస్థ తమకు తగిన ఆధారాలు సమర్పించలేదని చెప్పింది ప్రపంచ ఆరోగ్య సంస్థ.

ఈ కలుషిత ఔషధాలు ప్రస్తుతానికి గాంబియాలోనే వెలుగు చూసినా.. ఇతర దేశాలకూ వాటిని సరఫరా చేసి ఉండొచ్చని ఆందోళన వ్యక్తం చేసింది. ఆ నాలుగు సిరప్ లు మార్కెట్​లో లేకుండా చేయాలని అన్ని దేశాలకు ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచించింది.

Also Read : Health Tips : ఇమ్యూనిటీ పెరగాలంటే విటమిన్ సి టాబ్లెట్ తీసుకోవచ్చా?

Also Read : Cobra : ఫుల్లుగా తాగేసి నాగుపాముతో ఆటలు.. పాముకాటుతో ఆస్పత్రి పాలు

Read Today's Latest International News in Telugu. Get LIVE Telugu News Updates on Latest News Telugu

Follow Us

Latest News

Related News