Air Cooler : ఎండా కాలం ఎప్పుడో వచ్చింది. ఉష్ణోగ్రతలు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. చాలా చోట్ల 40 డిగ్రీలకు చేరుకున్నాయి. దీంతో వేడిని తట్టుకోవటానికి కూలర్ కొనాలనుకుంటున్నారా? ఏ కూలర్ కొంటే బెటర్ అనేది అర్థం కావట్లేదా? అయితే ఒక్క నిమిషం ఆగండి. ఈ సూచనలు, సలహాలు పాటిస్తే మీరు మంచి కూలర్ ని సొంతం చేసుకోగలరు. ముందు మీకు పర్సనల్ కూలర్ కావాలో డిజర్ట్ కూలర్ కావాలో తేల్చుకోండి. చిన్న రూమ్ అయితే పర్సనల్ కూలర్ సరిపోతుంది. పెద్ద రూమైతే డిజర్ట్ కూలర్ తీసుకోవాలి. గది పరిమాణం 150 నుంచి 300 చదరపు అడుగుల వరకు ఉంటే చిన్న రూము అని, అంతకన్నా పెద్దగా ఉంటే డిజర్ట్ కూలర్ కొనాలని తెలుసుకోండి.
ఎయిర్ కూలర్లలో వాటర్ ట్యాంక్ కెపాసిటీ చాలా ముఖ్యమైన అంశం. కూలర్ సైజ్ పెద్దగా ఉందంటే వాటర్ ట్యాంక్ కెపాసిటీ కూడా పెద్దదే అని అర్థంచేసుకోవాలి. సహజంగా రూమ్ సైజు కన్నా ఎక్కువ సామర్థ్యం గల కూలర్ తీసుకుంటే చల్లదనం బాగా వస్తుంది. చిన్న రూములకు 15 లీటర్ల కెపాసిటీ కలిగిన వాటర్ ట్యాంకర్, మీడియం సైజ్ రూములకు 25 లీటర్ల కెపాసిటీ గల వాటర్ ట్యాంకర్ ఉండే కూలర్లు బెటర్.
Air Cooler : read these tips before air cooler purchage
ఎయిర్ కూలర్ ని గది బయట లేదా పెరట్లో లేదా అటక (టెర్రాస్) మీద పెట్టాలనుకుంటే డిజర్ట్ కూలర్ కరెక్ట్. ఇంట్లో పెట్టుకోవాలనుకుంటే పర్సనల్ లేదా టవర్ కూలర్స్ సూటబుల్. వాతావరణాన్ని బట్టి కూడా కూలర్ ని సెలెక్ట్ చేసుకోవాలి. పొడి వాతావరణం ఉండే ప్రాంతమైతే డిజర్ట్ కూలర్స్ ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. చల్లని ప్రదేశాలైతే పర్సనల్ లేదా టవర్ కూలర్లు సరిపోతాయి. కూలర్ కొనే ముందు దాని శబ్ధ స్థాయిని కూడా చెక్ చేయాలి. కొన్ని కూలర్లు పెద్ద సౌండ్ చేస్తాయి. ఫ్యాన్ స్పీడ్ ని మ్యాగ్జిమమ్ లెవల్ కి పెట్టడం ద్వారా కూలర్ ఎంత శబ్ధం చేస్తోందో గుర్తించొచ్చు.
కూలర్ లో ఎప్పటికప్పుడు నీళ్లు పోయటం కష్టమైన పని. అందుకని ఆటో రీఫిల్ ఆప్షన్ గల కూలర్ తీసుకోవటం మంచిది. అదైతే బాగా చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ట్యాంక్ లో నీళ్లు అయిపోవు. మోటర్ డ్యామేజ్ కాకుండా ఉంటుంది. కూలర్ లో అమర్చే కూలింగ్ ప్యాడ్లు కూడా పరిగణనలోకి తీసుకోవాల్సిన ముఖ్యాంశమే. ఊల్ ఉడ్(ఉన్ని కలప), ఆస్పెన్(ఆస్పేన్ వృక్షం), హానీ కోంబ్(తేనె పెట్టె) తదితర రకాల ప్యాడ్లు మార్కెట్లో లభిస్తున్నాయి. ఎక్కువగా ఉపయోగించే ప్యాడ్లు ఊల్ ఉడ్ రకానికి చెందినవే. అయితే మిగతా రెండింటి కన్నా హానీ కోంబ్ ప్యాడ్లు నయం అంటున్నారు.
వాతావరణాన్ని వేగంగా చల్లబర్చటం కోసం కొన్ని కంపెనీలు కూలర్లకు ఐస్ ఛాంబర్లను కూడా ఫిట్ చేసి ఇస్తాయి. వాటిలో ఐసు ముక్కలను వేయటం ద్వారా వాటర్ ట్యాంక్ లోని నీళ్లు త్వరగా చల్లబడతాయి. ఇన్వర్టర్లతో కూడిన కూలర్లను తీసుకుంటే కరెంట్ పోయినా ఇబ్బంది ఉండదు. రిమోట్ కంట్రోల్, యాంటీ మస్కిటో ఫిల్టర్, డస్ట్ ఫిల్టర్ తదితర అదనపు ఫీచర్లు ఉన్న కూలర్లు కూడా తీసుకోవచ్చు. బడ్జెట్ ని బట్టి.