Lucky Old Couple : చాలా మంది తీవ్రంగా ప్రయత్నించినా అదృష్టం కలిసిరాక ఫెయిల్ అవుతూ ఉంటారు. అనుకున్నది రీచ్ కాలేకపోతారు. అసలు అదృష్టం ఎప్పుడు ఎవరిని ఎలా వరిస్తుందో కూడా తేలియదు. అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందని అంటుంటారు. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకునే వారు కూడా చాలా తక్కువే.
అయితే బ్రిటన్ లో ఓ వృద్ధ దంపతులను అదృష్టం వరించింది. రాత్రికి రాత్రే వారిని లక్షాధికారిని చేసింది. అదృష్టం తలుపు తట్టగానే వారు తలుపులు తెరిచారు. వెంటనే లక్ష్మీదేవి ఇంట్లోకి వచ్చింది. వారు లక్షాధికారి అయ్యారు.
పాత కాలంలో రాజులు సంపదలను భూమిలో పాతిపెట్టేవారు. నేలమాళిగల్లో దాచి పెట్టేవారు. అడవులు , పర్వతాల్లో పాతిపెట్టేవారు. ఇలాంటి కథలు ఎన్నో విన్నాం. తాజాగా బ్రిటన్ లో ఓ ఆశ్చర్యకరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది.
ఇంటి మరమ్మతుల సమయంలో ఓ వృద్ధ దంపతుల పంట పండింది. 100 సంవత్సరాలకు పైగా పురాతనమైన పాత నోట్లు వారికి లభించాయి. 1916, 1918 మధ్య ముద్రించిన 9 పాత నోట్లు కనిపించాయి. అవి పాతవి కావటంతో వాటికి మార్కెట్‌లో చాలా డిమాండ్ ఉంది.ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్న విషయం తెలిసిందే..వాటికి మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది..
అదే వారి కలలను నేరవెర్చింది.. ఒక్కసారిగా లక్షలను అందించింది. దాంతోపాటు ధర కూడా గట్టిగానే పలికింది. వీటిని వేలం వేయగా.. ఏకంగా రూ. 47 లక్షలు వచ్చాయి. ప్రస్తుతం వేలంలో వచ్చిన డబ్బుతో ఈ వృద్ధ దంపతులు తమ డైమండ్ జూబ్లీ వార్షికోత్సవాన్ని జరుపుకోవాలని ప్లాన్స్ వేస్తున్నారు..వారికి వచ్చిన అదృష్టానికి తెగ సంబరపడిపోతున్నారు. అదృష్టం అంటే ఇదే మరి.
Also Read : Prabhas: ఢిల్లీలో దసరా వేడుకలకు ముఖ్య అతిథిగా ప్రభాస్.. ఆయన చేతుల మీదుగా రావణదహనం
Also Read : Krishnam Raju: మొదటి భార్య కోసం చనిపోయేదాకా ఆ పని చేసిన కృష్ణంరాజు..!