Cash: క్యాషూ కావాలి బాసూ

Cash: గడచిన నాలుగైదు సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరగటంతో ఆన్ లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ లెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లే కనిపిస్తున్నాయి. టీ తాగే చోట కూడా ఈ రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. చివరికి తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు సైతం కస్టమర్లు ఫోన్ ద్వారా పేమెంట్ చేసినా ఓకే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎంలకు […].

By: jyothi

Updated On - Mon - 17 May 21

Cash: క్యాషూ కావాలి బాసూ

Cash: గడచిన నాలుగైదు సంవత్సరాలుగా స్మార్ట్ ఫోన్ల వినియోగం భారీగా పెరగటంతో ఆన్ లైన్ లావాదేవీలు ఊపందుకున్నాయి. ఫోన్ పే, గూగుల్ పే, పేటీఎం తదితర యాప్ లెన్నో అందుబాటులోకి వచ్చాయి. ఎక్కడ చూసిన క్యూఆర్ కోడ్ స్టిక్కర్లే కనిపిస్తున్నాయి. టీ తాగే చోట కూడా ఈ రూపంలోనే చెల్లింపులు చేస్తున్నారు. చివరికి తోపుడు బండి మీద కూరగాయలు, పండ్లు అమ్మేవాళ్లు సైతం కస్టమర్లు ఫోన్ ద్వారా పేమెంట్ చేసినా ఓకే అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకునేవాళ్ల సంఖ్య బాగా తగ్గిపోయింది. దీంతో చాలా ఏటీఎంలు మూతపడ్డాయి కూడా. అయితే ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఎక్కువ మంది అటు ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేస్తూనే ఇటు ఏటీఎంల నుంచి క్యాషూ తీసుకొని దగ్గర పెట్టుకుంటున్నారు.

Online Cash Payments

అత్యవసరమైతే..

కొవిడ్ సెకండ్ వేవ్ వల్ల కొన్ని ఆస్పత్రులు కార్డుల ద్వారా బిల్లు కడతామంటే ఒప్పుకోవట్లేదు. అలాంటప్పుడు అత్యవసరమైతే నగదు దొరుకుతుందో లేదో అనే భయంతో పలువురు ముందుగా జాగ్రత్త పడుతున్నారు. ఏటీఎం నుంచి పెద్ద మొత్తంలో విత్ డ్రా చేస్తున్నారు తప్ప ఆ మనీతో లావాదేవీలు జరపట్లేదు. ఇంట్లో అట్టే పెడుతున్నారు. చెల్లింపుల కోసం మాత్రం డిజిటల్ బాట పడుతున్నారు. బయట అసలే బాగాలేదు. కాబట్టి నిత్యం ఏటీఎంలకు వెళ్లటం ఎందుకు అనుకుంటున్నారు. ఫలితంగా ఇంతకుముందుతో పోల్చితే ఇప్పుడు ఏటీఎంలలో క్యాష్ విత్ డ్రాయల్స్ 20 శాతం పెరిగినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో యూపీఐ ద్వారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా మనీ ట్రాన్స్ ఫర్లు స్థిరంగా కొనసాగుతున్నాయని అంటున్నారు.

Online Cash Payments

ఆధార్ ఆధారంగా..

గతంలో పల్లెల్లో, టౌన్లలో యావరేజ్ గా రూ.2,000-3,000 వరకు ఏటీఎం నుంచి తీసుకునేవారు. ఇప్పుడు వెయ్యి రూపాయలు అదనంగా (రూ.3,000-4,000) విత్ డ్రా చేస్తున్నారు. యూపీఐ, ఐఎంపీఎస్ ద్వారా ఇంతకుముందు రూ.6,000-7,000 ట్రాన్స్ ఫర్ చేసేవాళ్లు ప్రస్తుతం రూ.9,000 దాకా బదిలీ చేస్తున్నారు. ఇక ఆధార్ ఆధారితంగా నడిచే ఏటీఎంలలో విత్ డ్రాయల్స్ అనూహ్యంగా పెరిగాయి. గత ఆర్థిక సంవత్సర చివరి త్రైమాసికంలో ఇలా రూ.10,000 కోట్ల లావాదేవీలు జరిగాయని, అంతకుముందు ఈ ట్రాన్సాక్షన్లు రూ.7,650 కోట్లు మాత్రమేనని అనలిస్టులు వివరిస్తున్నారు.

Online Cash Payments

Latest News

Related News