Tunover : ఉద్యోగాలతో విసిగిపోయిన చాలామంది వ్యాపారాల వైపు పరుగులు పెడుతుండటం మనం చూస్తూనే ఉన్నాం. కరోనా తర్వాత చాలామంది ఉద్యోగాల మీద నమ్మకం పోయి వ్యాపారాల వైపు అడుగులు వేస్తున్నారు. అయితే ఏ వ్యాపారం చేసినా నమ్మకంతో, కష్టపడుతూ ముందుకు సాగితే ఖచ్చితంగా అది విజయం సాధించి తీరుతుందనేది నిజం.
కేవలం రెండు లక్షల రూపాయల పెట్టుబడితో ముగ్గురు వ్యక్తులు ప్రారంభించిన ఓ వ్యాపారం ఇప్పుడు కోట్ల రూపాయల టర్నోవర్ తో నడుస్తోంది. 2021-22 ఏడాదికి గాను సదరు వ్యాపారం ఏకంగా రూ.75 కోట్ల టర్నోవర్ చేయడం మామూలు విషయం కాదు. ఇంతకీ అంతలా క్లిక్ అయిన ఆ వ్యాపారం ఏంటి, దానిని ఎవరు, ఎప్పుడు ప్రారంభించారో తెలుసుకుందాం.
హిమాన్షు చావ్లా, శ్రేయ్ సెహగల్, సుమన్ లు కలిసి వ్యాపారం ప్రారంభించాలని అనుకున్నారు. కానీ అప్పుడు వారి వద్ద కేవలం రెండు లక్షలు మాత్రమే పెట్టుబడిగా ఉంది. 2010లో వీరు ముగ్గురు కలిసి ఫ్లవర్ ఆరా పేరుతో ఓ కంపెనీని స్థాపించారు. ప్రారంభంలో కేవలం ఒక ఉద్యోగిని పెట్టుకొని కేకులు, ఫ్లవర్ బుకేలను డెలివరి చేయడం ప్రారంభించారు.
వ్యాలెంటైన్స్ డే రోజు ఎక్కువ ఆర్డర్లు డెలివరీకి రాగా.. కంపెనీ ఓనర్లు స్వయంగా వెళ్లి డెలివరీ చేశారు. 2016లో వీరు సొంతంగా బెకింగో అనే బేకరి బ్రాండ్ ను స్టార్ట్ చేశారు. వీరే స్వంతంగా కేకులు తయారు చేసి, వాటిని డెలివరీ చేయడం ప్రారంభించారు. ప్రస్తుతం వీరి వద్ద 500 మంది ఉద్యోగులు పని చేస్తుండగా.. 2021-22 నాటికి వీరి టర్నోవర్ ఏకంగా రూ.75కోట్లుగా ఉండటం వీరి విజయానికి నిదర్శనం.
Also Read : Health Tips : కిడ్నీ వ్యాధులు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Also Read : Allu Arjun : బన్నీ చేసిన ఏకైక షార్ట్ ఫిలిం ఇది.. లెజెండ్ డైరెక్టర్ తీసిండు..!