Group 2 : సక్సెస్.. ఈ పేరు కోసం చాలా మంది తపిస్తూ ఉంటారు.. అయితే కష్టపడి సాధిస్తే చేయలేని పని అంటూ ఏం లేదని చాలా మంది ఇప్పటికే నిరూపించారు.. ఇక ఇప్పుడు మరోసారి తండ్రీ కొడుకులు ఇద్దరు కలిసి ఈ విషయాన్ని నిరూపించారు.. మీరు కష్టపడితే ఏదైనా సక్సెస్ అదే వస్తుంది అని వీళ్ళు నిరూపించారు.. మరి ఇంతకీ వీరి సక్సెస్ సీక్రెట్ ఏంటి? ఎందులో విజయం సాధించారు? అనే విషయం తెలియాలంటే ఈ సక్సెస్ స్టోరీ చదివేయాల్సిందే..
త్రిపురాంతకం మండలం దూపాడు పంచాయతీ పరిధిలోని దీవేపల్లికి చెందిన తండ్రీ, కొడుకులు ఒకేసారి గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యి శభాష్ అనిపించు కున్నారు.. కటిక సుబ్బారావు, ఆయన కుమారుడు కటిక శ్రీనివాసులు ఇద్దరు కూడా ఈ ఘనత సాధించి వార్తల్లో నిలిచారు.. సుబ్బారావు 1999లో గ్రూప్ 2 కి సెలెక్ట్ అయ్యారు.
కానీ ఆ ఏడాది కొంతమంది కోర్టును ఆశ్రయించారు.. దీంతో పోస్టుల విషయంలో చాలా కాలం కాలయాపన జరిగింది.. సుబ్బారావు ఏఈవోగా సెలెక్ట్ అయ్యారు.. ప్రస్తుతం ఈయన ఉపాధ్యాయునిగా వృత్తిని నిర్వహిస్తున్నారు. గత 15 ఏళ్లుగా ఈ వృత్తిలో కొనసాగుతున్న ఈయన ప్రస్తుతం దొనకొండ స్కూల్ లో పని చేస్తున్నారు.
ఇక సుబ్బారావు కుమారుడు శ్రీనివాసులు కూడా గ్రూప్-2కి సెలెక్ట్ అయ్యారు. 2016 గ్రూప్ 2 ఫలితాల్లో ఏఎస్ఓగా సెక్రటేరియార్ గా ఎంపిక అయ్యారు.. ఒకరి తర్వాత ఒకరు గ్రూప్ 2 పరీక్షలు రాసినా ఇద్దరికీ ఒకేసారి ప్రభత్వం నుండి ఆదేశాలు రావడంతో తండ్రీ కొడుకులు ఆనందంగా ఉన్నారు. వీరు మారుమూల పల్లెటూరిలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలో చదివినా ఇప్పుడు ఏకంగా గ్రూప్ 2 లో సెలెక్ట్ అయ్యి మనిషి పట్టుదలతో అనుకుంటే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించారు.. ఇది వీరి సక్సెస్ స్టోరీ..
Also Read : Samantha : ఆ షోలో అక్కినేని ఫ్యామిలీ గుట్టు విప్పాలని చూస్తున్న సమంత.. పెద్ద ప్లానే..!