JOBS: ఏపీఎస్ఎస్‌డీసీ (ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్) నుంచి జాబ్ మేళా నోటిఫికేషన్ విడుదల అయింది. అనేక రకాల జాబ్స్ ఇందులో ఉన్నాయి. ఆసక్తి ఉన్న వారు ఆన్ లైన్ ద్వారా అప్లై చేసుకునే చాన్స్ ఉంది. అపోలో ఫార్మసీ, మీషో, నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు
www.apssdc.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని, ఈ నెల 27వ తేదీన మార్నింగ్ 10గంటలకు కృష్ణాజిల్లాలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నామని, అభ్యర్థులు అందుకు హాజరవ్వాలని ప్రకటనలో వెల్లడించారు.
JOBS
మీషో సంస్థలో సెల్స్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఇంటర్మీడియట్, ఆపైన చదువుకున్న వారు వీటికి దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే అభ్యర్థులకు ఆరు నెలల నుండి మూడేండ్ల పాటు ఎక్స్ పీరియన్స్ ఉండాలి. ఈ పోస్టులకు సెలక్ట్ అయిన వారికి నెలకు రూ.18,500 సాలరీ పొందుతారు. ఈ చాన్స్ కేవలం పురుషులకు మాత్రమే. అప్లై చేసుకునే వారు 19 నుంచి 32 ఏళ్ల మధ్య ఉండాలి.
ఇక అపోలో ఫార్మసీలో ఫార్మసిస్ట్, ఫార్మసీ ట్రైనీ, అసిస్టెంట్ వంటి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఫార్మసిస్ట్ పోస్టు కోసం బీఫార్మసీ, డీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చేసిన వారు పీసీఐ సర్టిఫికేట్ ఉన్న వారు అర్హులు.. ఇందులో అర్హత సాధించిన వారికి నెలకు రూ.11,500 నుంచి రూ.14 వేల వరకు వేతనం ఉంటుంది. దరఖాస్తు చేసుకునే వారు 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయసున్న వారు అర్హులు.
ఫార్మసీ ట్రైనీ, అసిస్టెంట్ పోస్టుల కోసం పదో తరగతి పాసైన వారు అప్లై చేసుకోవచ్చు. ఎంపికైన వారికి నెలకు రూ.9,500 నుంచి రూ.10,500 వరకు సాలరీ ఇస్తారు. ఇందుకు పురుషులు మాత్రమే అర్హులు.
jobs
నవతా రోడ్ ట్రాన్స్ పోర్ట్‌లో క్లర్క్లు, కంప్యూటర్ ఆపరేటర్స్ తదితర ఖాళీలు ఫిలప్ చేయనున్నారు. ఇందుకు పది, అంతకు మించి చదువుకున్న వారు అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.8,500 నుంచి రూ.10 వేల సాలరీ వస్తుంది. ఇందుకు కేవలం 18 నుంచి 30 సంవత్సరాల వయసున్న పురుషులు మాత్రమే అర్హలు.
అభ్యర్థులు ఇంటర్వ్యూకు అటెండ్ అయ్యే టైంలో రెసూమ్, స్టడీ సర్టిఫికేట్స్, ఆధార్ కార్డు తీసుకురావాలి. ఎంపికైన వారు విజయవాడ లో వర్క్ చేయాలని సదురు నోటిఫికేషన్ లో స్పష్టం చేశారు. మరిన్ని వివరాలకు 6300618985, 8074370846 నంబర్లను సంప్రదించాలని సూచించారు. మరి ఇంకెందుకు ఆలస్యం.. అర్హత, ఆసక్తి ఉన్న నిరుద్యోగులకు ఇదొక మంచి అవకాశం.