Succeed Life : ఓడిపోతే భయమెందుకు?..తర్వాత విజయం మీ వెనకాలే ఉంటుంది

Succeed Life : మనల్ని మనం గొప్పగా అంచనా వేసుకోవడంలో తప్పులేదు. కాని అవతలివారిని తక్కువుగా అంచనా వేయడమే చాలా మంది చేస్తున్న తప్పు. ముఖ్యంగా నేటి యువత అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడానికి ప్రధాన కారణం ఓపిక లేకపోవడం..

By: jyothi

Published Date - Thu - 1 September 22

Succeed Life : ఓడిపోతే భయమెందుకు?..తర్వాత విజయం మీ వెనకాలే ఉంటుంది

Succeed Life : ప్రతి మనిషి విజయం కోసం పరితపిస్తుంటాడు. చేసిన పనిలో తప్పకుండా సక్సెసే వెతుక్కుంటారు. అది ఫెయిల్ అయితే భరించలేడు. ఇప్పటికిప్పుడు విజయం సాధించాల్సిందే. ఓటమి అస్సలు ఒప్పుకోరు. గెలుపును మాత్రమే చూడాలనుకుంటారు. కాస్తా కూడా ఓపిక పట్టలేరు. అనుకున్నది అనుకున్న సమయానికి కావాల్సిందే. లేకపోతే అంతే. తట్టుకోలేరు. కోపాన్ని దాచుకోలేరు. ఇందుకోసం ఎంతకైనా తెగిస్తుంటారు. ఇక ఓటమికి వేరే వారిని బాధ్యులను చేయడం కూడా సాధారణమే. వారిపై నిందలు మోపి వారిని కూడా ఏడిపిస్తుంటారు.

మనల్ని మనం గొప్పగా అంచనా వేసుకోవడంలో తప్పులేదు. కాని అవతలివారిని తక్కువుగా అంచనా వేయడమే చాలా మంది చేస్తున్న తప్పు. ముఖ్యంగా నేటి యువత అనుకున్న లక్ష్యాన్ని చేరకపోవడానికి ప్రధాన కారణం ఓపిక లేకపోవడం. మనం చాలామందిని చూస్తూ ఉంటాం.. వారిని మనం ఎంత విసిగించినా ఎంతో ఓపిక, సహనంతో ఉంటారు. అదే మరికొంతమంది అయితే ఇమిడియట్ గా రియాక్ట్ అవుతారు. ఎంత ఓపికగా ఆలోచిస్తే అంత విజయం సాధిస్తాం అనే విషయాన్ని నేటి యువత గ్రహించలేకపోతోంది.

విత్తనం నాటిన రోజే అది మొక్కై, పండుని ఇస్తుందా..

ఇవ్వదు. విత్తనం మొలకెత్తాలి. పెరగాలి, తర్వాత అది ఫలాలిస్తుంది. ఇదంతా జరగాలంటే దానిని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఓపికతో కాపాడుకుంటే.. కొంత కాలానికి అది పండ్లు ఇవ్వడం మొదలుపెడుతుంది. అలాగే మన లక్ష్యం విత్తనం లాంటిది. అది వెంటనే ఫలితాలు ఇవ్వదు. మనం తగినంత శ్రద్ధ వహిస్తూ.. ఓపికగా ఉంటే ఏదొక రోజు ఫలితం వస్తుంది. మన ప్రయత్నాన్ని బట్టి ఫలితం ఆధారపడి ఉంటుంది. మన కృషిలో లోపం ఉందనుకోండి.. ఇక మనం ఆ లక్ష్యం​ మీద ఆశలు వదులుకోవాల్సివస్తుంది. జీవితంలో విజయం సాధించడానికి చాలా కష్టపడాలి. విజయం ఈజీగా వస్తే ఇప్పటికే అందరూ సక్సెస్ అయిపోయి ఉంటారు. కొందరికి ఈజీగా సక్సెస్ వచ్చిందనుకుంటాము కానీ.. అంతకుముందు వారెంత కష్టపడ్డారో మనం తెలుసుకోలేము. విజయం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఎన్నో అవాంతరాలు ఎదురవుతాయి. వాటన్నింటిని ఎదుర్కొంటూ ముందుకెళ్తే తప్పకుండా విజయం నీకు తలవంచుతుంది. ఇదంతా జరగాలంటే ఓపిక, సహనం ఎంతో అవసరం.

మనం అనుకున్నది సాధించడం కోసం నిరంతరం శ్రమించాలి. లక్ష్యం నెరవేరే వరకు ప్రయత్నిస్తూనే ఉండాలి. ఓటమి ఎదురైనా స్వీకరించాలి. మళ్లీ పదే పదే ప్రయత్నిస్తూనే ఉండాలి. ఎన్నిసార్లు ఓడిపోయినా దాన్ని నవ్వుతూ భరించండి. చివరకు విజయం వరిస్తుంది. సక్సెస్ కి కూడా ఓపిక నశించి మీ వశమవుతుంది. ఇందుకోసం మీరు చేయాల్సిందల్లా మీ కృషిలో ఎలాంటి లోపం లేకుండా చూసుకోవడం. అప్పుడు తప్పకుండా గెలుపు మీ సొంతమవుతుంది.

 

Read Also : Video Viral : స్టేడియంలోనే గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేసిన హాంకాంగ్ క్రికెటర్

Read Also : Liger : ఇదేం ట్విస్టురా బాబు.. లైగర్ ప్లాప్ కు సుకుమార్ కార‌ణ‌మా..?

Related News