Serena Williams : తూచ్…నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం..అంటే సెరెనా వీడ్కోలు లేనట్టేనా?

Serena Williams : యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్ లో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో మాట్లాడింది..

By: jyothi

Published Date - Sat - 3 September 22

Serena Williams : తూచ్…నాకు ఆస్ట్రేలియా అంటే ఇష్టం..అంటే సెరెనా వీడ్కోలు లేనట్టేనా?

Serena Williams : యూఎస్ ఓపెన్ బరిలోకి దిగిన అమెరికా స్టార్ టెన్నిస్ ప్లేయర్ సెరెనా విలియమ్స్ మూడో రౌండ్ లో ఓడిపోయింది. మ్యాచ్ అనంతరం భావోద్వేగంతో మాట్లాడింది. సోదరి వీనస్ లేకపోతే తాను లేదని చెప్పింది. అందరికీ థ్యాంక్స్ చెప్పింది. దీంతో సెరెనా ఆటకు గుడ్ బై చెప్పిందని అందరూ భావించారు.

యూఎస్ ఆటకు ముందే సెరెనా ఇదే తన చివరి మ్యాచ్ అని చెప్పింది.

తన సమయాన్ని పూర్తిగా కుటుంబానికి ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపింది. అయితే ఆమె ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. దీంతో అందరూ అయోమయానికి గురయ్యారు. తనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమని చెప్పడంతో కొత్త ఊహాగానాలకు తెరతీశాయి.

టెన్నిస్ లో భాగం కావడమే తనకు ఇష్టమని సెరెనా చెప్పుకొచ్చింది. ఇప్పటికీ గెలిచే సామర్థ్యం ఉందని.. యూఎస్ ఓపెన్ మూడో రౌండ్ లో ఓడిపోయానని.. అయితే తాను ఫైటర్ నని చెప్పింది. ఇలాంటి ఓటములను తాను పట్టించుకోనని.. టెన్నిస్ జీవితంలో భాగమైపోయిందని తెలిపింది.

అలాగే టెన్నిస్ లేకుండా ఊహించుకోవడం కష్టమన్న సెరెనా.. భవిష్యత్తులో టెన్నిస్ తో అనుబంధం లేకుండా ఉండలేనని చెప్పుకొచ్చింది. తనకు ఆస్ట్రేలియా అంటే ఇష్టమని కూడా చెప్పింది. దీంతో క్రీడా పండితులు రకరకాలుగా విశ్లేషిస్తున్నారు. వచ్చే జనవరిలో ఆస్ట్రేలియన్ ఓపెన్ ఉంది. ఆ టోర్నీలోనూ సెరెనా బరిలోకి దిగే అవకాశం లేకపోలేదని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Also Read : Crimes : పాన్ ఇండియా సినిమా చూసి ఫేమస్ అవ్వాలనుకున్న యువకుడు.. వరుసగా ఐదు హత్యలు

Also Read : Health Tips : హై బీపీకి చెక్ పెట్టండి ఇలా..

Related News