Soumita Basu : ప్రతి మనిషి విజయం కోసం పరితపిస్తుంటాడు. చేసిన పనిలో తప్పకుండా సక్సెస్సే వెతుక్కుంటారు. అది ఫెయిల్ అయితే భరించలేడు. ఇప్పటికిప్పుడు విజయం సాధించాల్సిందే. ఓటమి అస్సలు ఒప్పుకోరు. గెలుపును మాత్రమే చూడాలను కుంటారు. అయితే అన్ని సమయాల్లో మనం అనుకున్న పనులు అనుకున్న విధంగా జరుగవు..
ఇలా మనిషికి కష్టాలు వచ్చినప్పుడే క్రుంగి పోకుండా మనకు ఎదురైనా వాటి నుండి కూడా ప్రేరణ తీసుకుని జీవించి ముందుకు వెళ్ళాలి. మనం ఇప్పుడు చెప్పుకోబోయే ఆమె కూడా ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని ఇప్పుడు అందరికి ఆదర్శంగా నిలుస్తుంది. ఈమె ఎవరు ఈమె కథ ఏంటో తెలియాలంటే మొత్తం స్టోరీ తెలుసు కోవాల్సిందే..
కోల్ కత్తాకు చెందిన సౌమిత బసు అనే అమ్మాయి చిన్నప్పటి నుండి అన్ని విషయాల్లో చురుకుగా ఉండేది.. ఎంతో ఆనందంగా ఉన్న ఈమె జీవితం 32 ఏళ్ల వయసులో సోరియాటిక్ ఆర్థరైటిస్ రావడంతో కదల్లేని స్థితికి వెళ్లిది. రెండేళ్ల పాటు అన్నింటికి దూరంగా ఉంది.. అయినా గుండె నిబ్బరం కోల్పోలేదు.
ఈమె కదల్లేని స్థితిలో ఉండడం వల్ల బట్టలు కూడా మరొకరి సహాయంతోనే వేసుకునేది.. అందుకే ఈమె ఇలాంటి వారికి పరిష్కారం చూపించాలని అలాంటి సమయంలో కూడా ఆలోచించింది. ఇలాంటి వ్యాధులు వచ్చి కదల్లేని స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎవరి సహాయం లేకుండా బట్టలు ఎలా వేసుకోవచ్చో సెర్చ్ చేయడం మొదలు పెట్టి కొన్ని బ్రాండ్ బట్టలు అంత సౌకర్యంగా లేవు అని ఆమెకు అనిపించింది.
అందుకే 2020లో తల్లితో కలిసి జైనిక అనే బ్రాండ్ ను స్టార్ట్ చేసి సీఈఓ అయ్యింది. ఆమె ముందుగా తాను వేసుకోవడానికి వీలుగా బట్టలు డిజైన్ చేసుకుంది.. ఆ తర్వాత కస్టమర్స్ కోరిక ప్రకారం తయారీ చేసి అమ్మేది. కేవలం 20 వేలతో స్టార్ట్ చేసి ఇప్పుడు లక్షల టర్నోవర్ చేసే స్థాయికి ఎదిగింది. ఈమె తన బ్రాండ్ దుస్తులను మిగతా ప్రాంతాలకు కూడా విస్తరించి.. మహిళలకు, వికలాంగులకు ఉపాధి కల్పించడమే తన లక్ష్యంగా చెబుతుంది. మరి అన్ని బాగుండి కూడా ఏది సాధించలేము అని అనుకునే వారికీ మాత్రమే కాదు.. వికలాంగులకు కూడా ఈమె స్ఫూర్తిగా నిలుస్తుంది.
Also Read : Cheating Wife : పక్కింటి వ్యక్తితో పడక సుఖం.. భర్త, పిల్లల్ని వదిలేసి ఆమె బాగోతం.. చివరకు..!
Also Read : Health Tips : షాంపూ హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుందా?